OTT Comedy: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్- 7.6 రేటింగ్- 4 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!

Jetlee OTT Streaming Today: ఓటీటీలోకి ఇవాళ తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జెట్లీ డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. కమెడియన్ సత్య హీరోగా మారిన ఈ సినిమాకు రితేష్ రాణా దర్శకత్వం వహించారు. ఐఎమ్‌డీబీలో ఏకంగా 7.6 రేటింగ్ సాధించిన జెట్లీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: May 25, 2026, 06:20:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telugu Comedy Action Thriller Jetlee OTT Release Today: వెండితెరపై తనదైన మేనరిజమ్స్, టైమింగ్‌తో నవ్వించిన కమెడియన్ సత్య హీరోగా మారిన సినిమా జెట్లీ. తెలుగులో కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా జెట్లీ సినిమాను తెరకెక్కించారు.

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్- 7.6 రేటింగ్- 4 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్- 7.6 రేటింగ్- 4 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి జెట్లీ

'మత్తు వదలరా' లాంటి విభిన్నమైన విజయవంతమైన చిత్రంతో టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు రితేష్ రాణా జెట్లీ సినిమాను తెరకెక్కించారు. సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జెట్లీ ఓటీటీలోకి ఇవాళ (మే 25) వచ్చేసింది. థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఈ తరహా విభిన్న చిత్రాలకు ఓటీటీల్లో మంచి ఆదరణ దక్కుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జెట్లీ ఓటీటీ రిలీజ్ అయింది.

గాల్లో తేలే విమానంలో హైజాక్ డ్రామా

జెట్లీ సినిమా కథ అంతా 'స్వింగ్‌ఫిషర్ 6EB1CH' అనే ప్యాసింజర్ విమానం లోపల జరుగుతుంది. దేశం విడిచి పారిపోవాలని చూస్తున్న ఒక అపర కుబేరుడిని ఆ విమానంలో తరలిస్తుంటారు. అదే సమయంలో కొందరు కిరాయి గూండాలు, రహస్య ఏజెంట్లు ఆ ఫ్లైట్‌లోకి ప్రవేశించడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.

సస్పెన్స్-యాక్షన్-కామెడీ కలయక

పరిస్థితులను అదుపు చేయడానికి ఒక స్పెషల్ ఏజెంట్ ప్రయత్నిస్తుంటే.. మరోవైపు విమానంలో ఒక వ్యక్తికి అకస్మాత్తుగా స్పృహ వస్తుంది. అసలు తానెవరో, అక్కడికి ఎలా వచ్చాడో అతడికి గుర్తుండదు. కానీ జరుగుతున్న గందరగోళానికి, అతడికి ఒక బలమైన సంబంధం ఉంటుంది. ఈ సస్పెన్స్, యాక్షన్, కామెడీల కలయికే 'జెట్లీ' చిత్రం.

హీరోయిన్‌గా రియా సింఘా

హీరో సత్యతో పాటు జెట్లీ చిత్రంలో రియా సింఘా హీరోయిన్‌గా నటించింది. అలాగే వెన్నెల కిషోర్, అజయ్, వైవా హర్ష, గెటప్ శ్రీను, కబీర్ దుహాన్ సింగ్ లాంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' సమర్పకులుగా వ్యవహరించింది.

ఐఎమ్‌డీబీ రేటింగ్

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు కాలభైరవ సంగీతాన్ని అందించగా, సురేష్ సారంగం కెమెరా బాధ్యతలను నిర్వహించారు. అయితే, థియేటర్లలో జెట్లీ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కానీ, సత్య కామెడీ టైమింగ్ అదిరిపోయిందని టాక్ వినిపించింది. దీంతో ఐఎమ్‌డీబీలో పదికి ఏకంగా 7.6 రేటింగ్ సాధించుకుంది జెట్లీ సినిమా.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

అలాంటి జెట్లీ ఓటీటీ రైట్స్‌ను డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' (JioHotstar) దక్కించుకుంది. జియో హాట్‌స్టార్‌లో ఇవాళ అంటే మే 25న జెట్లీ ఓటీటీ రిలీజ్ అయింది. తెలుగుతోపాటుగా తమిళం, మలయాళం, కన్నడ వంటి నాలుగు భాషల్లో హాట్‌స్టార్‌లో జెట్లీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్, కామెడీ, యాక్షన్ అంశాలు ఇష్టపడేవాడు అర్థరాత్రి నుంచే జియో హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చిన జెట్లీ మూవీని ఎంచక్కా చూసేయండి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More