...
...
Next Story

Kajal Agarwal Dhurandhar 2: నువ్వు నిజంగా ఒక లెజెండ్‌వి- రణ్‌వీర్ సింగ్‌పై కాజల్ అగర్వాల్- ధురంధర్ 2పై చందమామ రివ్యూ

Kajal Agarwal Review On Dhurandhar 2: మార్చి 19న విడుదలైన 'ధురంధర్: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. రణ్‌వీర్ సింగ్ పవర్‌ఫుల్ నటనపై ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ప్రశంసలు కురిపించగా తాజాగా చందమామ కాజల్ అగర్వాల్ ధురంధర్ 2 సినిమాపై రివ్యూ రాసుకొచ్చారు.

Published on: Mar 23, 2026, 06:19:36 IST
Advertisement

రణ్‌వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రంపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మహేశ్ బాబు, అల్లు అర్జున్ తర్వాత

నువ్వు నిజంగా ఒక లెజెండ్‌వి- రణ్‌వీర్ సింగ్‌పై కాజల్ అగర్వాల్- ధురంధర్ 2పై చందమామ రివ్యూ
నువ్వు నిజంగా ఒక లెజెండ్‌వి- రణ్‌వీర్ సింగ్‌పై కాజల్ అగర్వాల్- ధురంధర్ 2పై చందమామ రివ్యూ

ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాను కొనియాడగా.. తాజాగా బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ధురంధర్ 2పై రివ్యూ ఇచ్చారు. తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ చిత్రంపై సుదీర్ఘమైన రివ్యూ రాసుకొచ్చారు.

రణ్‌వీర్.. నువ్వు ఒక లెజెండ్‌వి!

సినిమా చూసిన అనుభూతి నుంచి తాను ఇంకా బయటకు రాలేకపోతున్నానని కాజల్ పేర్కొన్నారు. "ధురంధర్: ది రివెంజ్.. ఆ పేరు వింటేనే ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది. రణ్‌వీర్, నువ్వు చేసిన పనికి నేను ఫిదా అయిపోయాను. ఆ ఎమోషన్, ఆ తీవ్రత, ఆ సహజత్వం.. ఆ పాత్ర వెనుక ఉన్న నీ కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తోంది. జస్కీరాత్, హమ్జా పాత్రలు మా గుండెల్లో ఎప్పటికీ ఉండిపోతాయి. నువ్వు నిజంగానే ఈ కాలపు గొప్ప నటుడివి" అని కాజల్ అగర్వాల్ ప్రశంసించారు.

మ్యాడీ నుంచి యామీ దాకా.. అందరూ అద్భుతం!

"ఆదిత్య ధర్, ఇది కేవలం సినిమా కాదు.. ఒక వెండితెర విందు. మొదటి భాగం మర్చిపోలేనిది అయితే, రెండో భాగం అంతకు మించి ఉంది. ఇక యామీ గౌతమ్ తన నటనతో ఎప్పటిలాగే మెరిసిపోగా, సారా అర్జున్ తన పాత్రలో ఎంతో ముచ్చటగా కనిపించింది" అని ప్రతి ఒక్కరి గురించి చెబుతూ కాజల్ రివ్యూ రాసుకొచ్చారు.

సంగీతంపై కాజల్

ధురంధర్ 2 సినిమాలోని సంగీతం గురించి చెబుతూ.. "శశ్వత్ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. మొదటి భాగంలోని పంజాబీ జానపదాల నుంచి ఇప్పుడు రెండో భాగంలో వినిపించిన సంగీతం వరకు ప్రతిదీ అద్భుతం" అని టీమ్ మొత్తానికి కంగ్రాట్స్ చెప్పారు చందమామ కాజల్ అగర్వాల్.

అసలు ఏంటి ఈ 'ధురంధర్ 2' కథ?

పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న ప్రమాదకరమైన 'ల్యారీ' ప్రాంతం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. గతంలో జరిగిన కందహార్ హైజాక్, పార్లమెంట్ దాడి, 26/11 ముంబై దాడుల వంటి కీలక ఘట్టాల వెనుక గూఢచారి వ్యవస్థ ఎలా పనిచేసింది అనే కోణంలో ఈ కథను రూపొందించారు.

రణ్‌వీర్ సింగ్ ఒక సాధారణ యువకుడు జస్కీరాత్ సింగ్ రంగీ నుంచి కరాచీ అండర్‌వరల్డ్‌ను శాసించే హమ్జా అలీ మజారీగా ఎలా మారాడు అనే ప్రయాణమే ఈ సినిమా. మొత్తానికి 'ధురంధర్ 2' కేవలం రికార్డులనే కాదు, సెలబ్రిటీల మనసులను కూడా గెలుచుకుంటూ బాక్సాఫీస్ వద్ద రారాజులా దూసుకుపోతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks