Serial Actress Weight Loss Journey: బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఐశ్వర్య సాలిమత్. 'అగ్నిసాక్షి', 'రామాచారి', 'సేవంతి', 'సరయు' వంటి అనేక పాపులర్ కన్నడ సీరియళ్ల ద్వారా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా కన్నడ డబ్బింగ్ ధారావాహికల ద్వారా ఈమె బాగా చిరపరిచితమే.
ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్

ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చిన ఐశ్వర్య, ప్రస్తుతం నటనకు కాస్త విరామం ఇచ్చి పిల్లల సంరక్షణలో మునిగిపోయారు. అయితే, ప్రసవం తర్వాత తను సాధించిన ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
90 కేజీల నుంచి 65 కేజీలకు..
గతేడాది డిసెంబర్‌లో ఐశ్వర్య, నటుడు వినయ్ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఆ ముద్దుల పిల్లలకు 'వజ్ర', 'వైడూర్య' అని పేర్లు పెట్టుకున్నారు. ప్రసవానంతరం బాలింతగా ఇంట్లోనే ఉంటున్న ఐశ్వర్య సలిమత్ పిల్లల సంరక్షణతో పాటు తన ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ప్రారంభించారు.
కవల పిల్లలు పుట్టిన మూడు నెలల్లోనే!
కవలలు పుట్టిన కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఐశ్వర్య సలిమత్ ఏకంగా 25 కేజీల బరువు తగ్గడం విశేషం. ఒకానొక దశలో 90 కేజీలకు చేరుకున్న తన బరువును, ఇప్పుడు 65 కేజీలకు తగ్గించుకున్నట్లు ఐశ్వర్య వెల్లడించారు.
కఠినమైన జిమ్ వర్కౌట్లు కావు..
చాలామంది ప్రసవం తర్వాత బరువు తగ్గడానికి కఠినమైన క్రాష్ డైట్లు లేదా కష్టమైన వర్కౌట్లు చేస్తుంటారు. కానీ, ఐశ్వర్య మాత్రం కేవలం తన ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవడం, ప్రతిరోజూ వాకింగ్ చేయడం ద్వారానే ఈ ఘనత సాధించారు.
ఇంట్లో వండుకునే తిండే!
"గతంలో చపాతీ, అన్నం, పప్పు వంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినేదాన్ని. కానీ, ఇప్పుడు నా డైట్లో ప్రోటీన్, ఫైబర్ ఉండేలా చూసుకుంటున్నాను. కఠినమైన డైటింగ్ కన్నా ఇంట్లో వండిన పౌష్టికాహారానికే ప్రాధాన్యమిచ్చాను" అని ఐశ్వర్య తన డైట్ సీక్రెట్లను వెల్లడించారు.
{{/usCountry}}"గతంలో చపాతీ, అన్నం, పప్పు వంటి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినేదాన్ని. కానీ, ఇప్పుడు నా డైట్లో ప్రోటీన్, ఫైబర్ ఉండేలా చూసుకుంటున్నాను. కఠినమైన డైటింగ్ కన్నా ఇంట్లో వండిన పౌష్టికాహారానికే ప్రాధాన్యమిచ్చాను" అని ఐశ్వర్య తన డైట్ సీక్రెట్లను వెల్లడించారు.
{{/usCountry}}ఐశ్వర్య రోజువారీ ఆహారంలో కూరగాయలు, పండ్లు, గుడ్లు, పన్నీర్, మొలకెత్తిన విత్తనాలు, రాగి ముద్ద, పుట్టగొడుగులు (మష్రూమ్స్), బ్రోకలీ, బాదం, సూప్‌లు చేర్చుకున్నారు. వీటితో పాటు లీటర్ల కొద్దీ నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం కూడా బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడిందని చెప్పారు.
పిల్లల ఆరోగ్యం కోసమే సరైన తిండి
కేవలం బరువు తగ్గడమే తన లక్ష్యం కాదని, పాలు ఇచ్చే తల్లిగా పిల్లల ఆరోగ్యం కోసం తాను పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యమని ఐశ్వర్య స్పష్టం చేశారు. సరైన ఆహారం, నిత్యం నడక వల్ల తన మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగుందని, ప్రసవం తర్వాత వచ్చే 'మూడ్ స్వింగ్స్' సమస్య ఇప్పుడు తనకు లేదని ఆమె సంతోషంగా పంచుకున్నారు.
షూటింగ్ సెట్‌లో మొదలైన ప్రేమాయణం
ఐశ్వర్య, వినయ్‌ల ప్రేమకథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 'మహాసతి' సీరియల్ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మొదటిసారి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వేర్వేరు సీరియళ్లలో నటించినప్పటికీ వారి స్నేహం కొనసాగింది.
కాలక్రమేణా ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడంతో, రెండు కుటుంబాల పెద్దలను ఒప్పించి 2022లో ఈ జంట వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఇటీవల ఈ దంపతులు తమ కవల పిల్లలకు నిరాడంబరంగా చెవులు కుట్టించే వేడుకను పూర్తి చేసి, ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.