...
...
Next Story

OTT Telugu Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన డివోషనల్ డ్రామా- రాజమౌళి తండ్రి కథ, శివ భక్తురాలిగా పాయల్- ముంచుకొచ్చే వరదలు!

Kannamma OTT Release Today: ఓటీటీలోకి ఇవాళ తెలుగు డివోషనల్ ఎమోషనల్ డ్రామా కన్నమ్మ వచ్చేసింది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాలో గ్లామర్ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ డీ గ్లామర్ రోల్‌లో పరమ శివభక్తురాలిగా నటించింది. మరి ఈ కన్నమ్మ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Nov 29, 2026, 11:19:22 IST
Advertisement

Kannamma OTT Streaming From Today: తెలుగులో ఎప్పటికప్పుడు సరికొత్త ఓటీటీ సినిమాలు వస్తూ అలరిస్తూనే ఉంటాయి. తాజాగా హృదయానికి హత్తుకునేలా పీరియాడిక్ డివోషనల్ ఎమోషనల్ డ్రామా చిత్రం కన్నమ్మ ఓటీటీలోకి వచ్చేసింది. అదే కన్నమ్మ. ఇవాళ్టీ (నవంబర్ 29) కన్నమ్మ ఓటీటీలో సందడి చేస్తోంది.

రాజమౌళి తండ్రి అందించిన కథ

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన డివోషనల్ డ్రామా- రాజమౌళి తండ్రి కథ, శివ భక్తురాలిగా పాయల్- ముంచుకొచ్చే వరదలు!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన డివోషనల్ డ్రామా- రాజమౌళి తండ్రి కథ, శివ భక్తురాలిగా పాయల్- ముంచుకొచ్చే వరదలు!

దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ కథా రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ ఈ కన్నమ్మ చిత్రానికి కథను అందించడం విశేషం. ఆదివారం సెలవు రోజున కుటుంబమంతా కలిసి చూసేందుకు తగిన భావోద్వేగభరిత కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

1969 కృష్ణా వరదలు.. నిజమైన భక్తికి నిదర్శనం

నిజమైన భక్తికి కులం, వివక్ష లాంటి అడ్డుగోడలు ఉండవనే బలమైన సందేశాన్ని ఈ చిత్రం ద్వారా అందించారు. 1969వ సంవత్సరంలో కృష్ణా నది తీర ప్రాంతంలో జరిగే కథగా దీనిని తీర్చిదిద్దారు. ఆలయ ప్రవేశానికి సైతం అనుమతి లేని వెనుకబడిన వర్గానికి చెందిన కన్నమ్మ అనే పరమ భక్తురాలి చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

ఓ భయంకరమైన వరద ముంచుకొచ్చిన వేళ, ఆలయంలోని పవిత్ర శివలింగాన్ని, విగ్రహాలను కాపాడేందుకు కన్నమ్మ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసం చేస్తుంది. కన్నమ్మ చేసిన ఆ నిస్వార్థ త్యాగం ఆలయ ప్రధాన అర్చకులు శాస్త్రి ఆలోచనా విధానంలో పెను మార్పు తెస్తుంది.

సంప్రదాయవాది అయిన శాస్త్రి.. నిజమైన భక్తి అన్ని వివక్షలకు అతీతమని గ్రహిస్తారు. చివరకు కన్నమ్మను ఓ దైవ సమానమైన తల్లిగా ఆయన గౌరవించడంతో కథ భావోద్వేగభరితంగా ముగుస్తుంది.

హృదయాన్ని తాకే డైలాగ్స్

సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్, కౌసల్య, ఆనంద్ భారతి, బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ, చైతన్య పిన్నమరాజు, మైథిలి కట్టా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో పాటు మాస్టర్ వెంకట్ శౌర్య, మాస్టర్ శ్రీతన్ రెడ్డి, బేబీ డి. లాస్యప్రియ, బేబీ శిఖరం గీతిక, మాదూరి రాకేష్ గుప్తా ఇతర పాత్రల్లో నటించారు.

డీ గ్లామర్ రోల్‌లో పాయల్ రాధాకృష్ణ

ఈ సినిమాతో తొలిసారిగా పాయల్ రాధాకృష్ణ డీ గ్లామర్ రోల్‌లో కనిపించారు. ఇక సాంకేతిక విభాగంలోనూ దిగ్గజ నిపుణులు ఈ సినిమాకు పనిచేశారు. ఎం.ఎం. శ్రీలేఖ అందించిన సంగీతం కథలోని భావోద్వేగాలను మరింత ఎలివేట్ చేస్తుంది. విష్ణు బేసి సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ ఈ పీరియాడిక్ డ్రామాకు ప్రధాన బలంగా నిలిచాయి.

కోడి రాము ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, నరేష్ కూరాకుల లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. రామానాయుడు స్టూడియోస్‌లో విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ డిజైనింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, 1969 నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.

కన్నమ్మ ఓటీటీ స్ట్రీమింగ్

ఇలాంటి కన్నమ్మ ఈటీవీ విన్ (ETV Win)లో నవంబర్ 29 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్ కథా సుధలో భాగంగా ఇవాళ కన్నమ్మ ఓటీటీ రిలీజ్ అయింది. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, మనసును కదిలించే కథలను ఇష్టపడే వారికి ఈటీవీ విన్ ఓటీటీలోని కన్నమ్మ సినిమా బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

 

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks