Kareena Kapoor Unseen Photos On Saif Ali Khan Birthday: బాలీవుడ్ నవాబ్, దేవర విలన్, స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఆగస్టు 16న తన 56వ ఏట అడుగుపెట్టారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండే సైఫ్ వ్యక్తిగత విశేషాలను ఆయన భార్య, ప్రముఖ హీరోయిన్ కరీనా కపూర్ తరచుగా అభిమానులతో పంచుకుంటారు.
సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా

ఈ క్రమంలోనే సైఫ్ పుట్టినరోజును పురస్కరించుకుని తమ వేకేషన్‌కు సంబంధించిన కొన్ని అరుదైన, కళ్లు చెదిరే బికినీ ఫొటోలను కరీనా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సైఫ్, కరీనా జంట ఫొటోలు
సముద్ర ప్రయాణాలు, సముద్రంలో బికినీతో కరీనా, సూర్యాస్తమయం వేళ పిల్లలతో సైఫ్ గడిపిన సరదా క్షణాలు, లిఫ్ట్ ఫొటోలు, లాంగ్ డ్రైవ్‌లతో కూడిన పిక్స్‌ను కరీనా షేర్ చేశారు. స్విమ్‌సూట్‌లో కరీనా, వైట్ షర్ట్‌లో సైఫ్ ఉన్న జంట ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
"నువ్వు లేకపోతే జీవితం బోర్": కరీనా స్పెషల్ పోస్ట్
"నా లైఫ్ పార్ట్‌నర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు లేకపోతే జీవితం ఎంత బోర్ కొట్టేదో! ఇక్కడ నేను షేర్ చేసిన ప్రతీ ఫొటో సైఫ్ స్వయంగా ఓకే చేసినవే" అని కరీనా కపూర్ సరదాగా క్యాప్షన్ రాసుకొచ్చారు.
దిల్ డ్యాన్స్ మారే
ఈ పోస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌లో 'తషాన్' సినిమాలోని 'దిల్ డ్యాన్స్ మారే' పాటను జత చేయడం విశేషం. 2008లో వచ్చిన ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. సైఫ్ అలీ ఖాన్ సోదరి సబా పటాడీతో పాటు వేలాది మంది అభిమానులు ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
'తషాన్' నుంచి పెళ్లి పీటల వరకు!
అమృతా సింగ్‌తో విడాకుల తర్వాత ఒంటరిగా ఉన్న సైఫ్, కరీనాతో ప్రేమలో పడ్డారు. అప్పట్లో ఈ జంట సంబంధం బాలీవుడ్లో పెద్ద సంచలనంగా మారింది. ఆ తర్వాత ఈ జంట 2012 అక్టోబర్ 16న ముంబైలోని బాంద్రా నివాసంలో అత్యంత ఆప్తుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
ఇద్దరి చేతిలోనూ వరుస సినిమాలు!
{{/usCountry}}అమృతా సింగ్‌తో విడాకుల తర్వాత ఒంటరిగా ఉన్న సైఫ్, కరీనాతో ప్రేమలో పడ్డారు. అప్పట్లో ఈ జంట సంబంధం బాలీవుడ్లో పెద్ద సంచలనంగా మారింది. ఆ తర్వాత ఈ జంట 2012 అక్టోబర్ 16న ముంబైలోని బాంద్రా నివాసంలో అత్యంత ఆప్తుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
ఇద్దరి చేతిలోనూ వరుస సినిమాలు!
{{/usCountry}}సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ జంటకు తైమూర్ అలీ ఖాన్ (2016), జెహ్ అలీ ఖాన్ (2021) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం సైఫ్, కరీనా ఇద్దరూ తమ వృత్తిగత జీవితంలో బిజీగా ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్ దశాబ్దం తర్వాత ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'హైవాన్' చిత్రంలో నటిస్తున్నారు.
దృష్టి లోపం ఉన్న వ్యక్తిగా
అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ దృష్టిలోపం ఉన్న వ్యక్తిగా సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. ఈ హైవాన్ చిత్రం సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.
పృథ్వీరాజ్ సుకుమారన్‌తో కరీనా
మరోవైపు కరీనా కపూర్ మేఘనా గుల్జార్ దర్శకత్వంలో 'దాయిరా' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా కరీనా కపూర్ పోస్ట్ చేసిన బికినీ, వెకేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.