Sunil Kattalan OTT Release: మలయాళ చిత్రసీమ నుంచి వచ్చే వైవిధ్యమైన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్లకు తెలుగునాట ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అలాంటిది తెలుగు స్టార్ కమెడియన్, నటుడు, హీరో సునీల్, మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ నటించిన సినిమా ఓటీటీలోకి వస్తుందంటే మరింత ఇంట్రెస్టింగ్ ఉంటుంది.
ఓటీటీలోకి కాటాలన్

ఆ సినిమానే 'కాటాలన్' (Kattalan). సూపర్ హిట్ 'ఆర్‌డీఎక్స్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన మలయాళ యాక్షన్ హీరో ఆంటోనీ వర్గీస్ (పెపే) నటించిన తాజా యాక్షన్ డ్రామానే ఈ కాటాలన్. మే 28న థియేటర్లలో విడుదలై రఫ్ అండ్ టఫ్ యాక్షన్ ఎపిసోడ్లతో ప్రేక్షకులను మెప్పించిన కాటాలన్ ఓటీటీలోకి వచ్చేయనుంది.
క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో తమిళ, తెలుగు నటులు కూడా భాగమవ్వడం విశేషం. ప్రముఖ నటి దుషార విజయన్ హీరోయిన్‌గా నటించగా, సునీల్‌తోపాటు బాలీవుడ్ నటుడు కబీర్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. లోకేష్ కనగరాజ్ ప్రత్యేక పాత్రలో మెరిశారు.
వీఎఫ్ఎక్స్ కాదు.. ఒరిజినల్ ఏనుగుతో మైండ్ బ్లాకింగ్ ఫైట్లు!
'కాటాలన్' చిత్రంలో ప్రధాన ఆకర్షణ ఇందులోని యాక్షన్ సీక్వెన్సెస్. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో జంతువులతో ఉండే దృశ్యాలకు గ్రాఫిక్స్ (VFX) ఉపయోగిస్తారు. చిత్ర యూనిట్ మాత్రం ఏకంగా ఒరిజినల్ ఏనుగును ఉపయోగించి చిత్రీకరించడం విశేషం.
థాయ్‌లాండ్‌లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌లో అంతర్జాతీయ స్థాయి స్టంట్ కొరియోగ్రాఫర్ కెచ్చా ఖంపక్డీ పర్యవేక్షణలో యాక్షన్ సీన్లు తీశారు. "ఈ సినిమాలో కనిపించే ఏనుగు సీన్లు ఏవీ గ్రాఫిక్స్ కావు. అసలైన ఏనుగుతోనే నటీనటులు పోరాట ఘట్టాల్లో పాల్గొన్నారు" అని చిత్ర బృందం స్పష్టం చేసింది.
స్టార్ స్టంట్ కొరియోగ్రాఫర్
కెచ్చా గతంలో 'బాహుబలి 2', 'జవాన్', 'పొన్నియిన్ సెల్వన్ 1', 'బాఘీ 2' వంటి భారీ చిత్రాలకు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. మార్షల్ ఆర్ట్స్ క్లాసిక్ 'ఓంగ్-బాక్ 2' సినిమాలో నటించి మెప్పించిన 'పాంగ్' అనే ప్రసిద్ధ ఏనుగును ఈ సినిమాలో ఉపయోగించడం మరో విశేషం.
కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్.. సాంకేతిక నిపుణుల సత్తా!
{{/usCountry}}కెచ్చా గతంలో 'బాహుబలి 2', 'జవాన్', 'పొన్నియిన్ సెల్వన్ 1', 'బాఘీ 2' వంటి భారీ చిత్రాలకు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. మార్షల్ ఆర్ట్స్ క్లాసిక్ 'ఓంగ్-బాక్ 2' సినిమాలో నటించి మెప్పించిన 'పాంగ్' అనే ప్రసిద్ధ ఏనుగును ఈ సినిమాలో ఉపయోగించడం మరో విశేషం.
కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్.. సాంకేతిక నిపుణుల సత్తా!
{{/usCountry}}సీజీఐ వాడకుండా సహజ సిద్ధమైన లొకేషన్లలో రియల్ ఏనుగుతో తీసిన పోరాట ఘట్టాలు థియేటర్లలో ప్రేక్షకులకు రోమాంచిత అనుభూతిని అందించాయి. సాంకేతిక విభాగంలోనూ ఈ సినిమాకు టాప్ క్లాస్ టీమ్ పనిచేసింది. 'కేజీఎఫ్', 'సలార్' చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ చిత్రానికి అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు.
క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో ఆయనకు ఇది రెండో సినిమా. 'కాంతార' ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్ ఒక ప్రత్యేకమైన పాటను సమకూర్చడం మరో విశేషం. దర్శకుడు పోల్ జార్జ్.. జోబీ వర్గీస్, జెరో జేకబ్‌లతో కలిసి కథ అందించగా, 'బిగ్ బి', 'చార్లీ' వంటి క్లాసిక్ సినిమాలకు మాటలు రాసిన ప్రసిద్ధ రచయిత ఉన్ని ఆర్ ఈ చిత్రానికి సంభాషణలు సమకూర్చారు.
కాటాలన్ ఐఎమ్‌డీబీ రేటింగ్
ప్రముఖ ఎడిటర్ షమీర్ మహమ్మద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా, చంద్రు సెల్వరాజ్, రెణదేవ్ కెమెరామెన్లుగా వ్యవహరించారు. సిద్దిఖ్, జగదీష్, ఆన్సన్ పోల్ వంటి దిగ్గజ నటులు ఇతర కీలక పాత్రల్లో మెరిసారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడమే కాకుండా కాటాలన్ ఐఎమ్‌డీబీ వద్ద ఏకంగా 8.2 రేటింగ్ కూడా సంపాదించుకుంది.
కాటాలన్ ఓటీటీ స్ట్రీమింగ్
ఇలాంటి కాటాలన్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ప్రముఖ మలయాళ డిజిటల్ సంస్థ మనోరమ మ్యాక్స్ కాటాలన్ ఓటీటీ హక్కులను దక్కించుకుంది. ఆగస్ట్ 4 నుంచి మనోరమ మ్యాక్స్‌లో కాటాలన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అంటే, మరో రెండు రోజుల్లో కాటాలన్ ఓటీటీ రిలీజ్ అవనుందని తెలుస్తోంది.