Kriti Sanon On Facing Discrimination: సినిమా గ్లామర్ ప్రపంచం పైకి కనిపించే అంత అందంగా ఉండదు. ఇక్కడ రంగుల వెనుక ఎన్నో వివక్షలు, అసమానతలు దాగుంటాయి. టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా వెండితెరపై నటీమణులకు ప్రాధాన్యత పెరుగుతున్నా, తెర వెనుక మాత్రం ఇంకా పురుషాధిక్యత నడుస్తోందనేది పచ్చి నిజం అంటారు కొంతమంది హీరోయిన్లు.
యూట్యూబర్ లిల్లీ సింగ్ టాక్ షో

తాజాగా ఇదే విషయంపై కృతి సనన్ ఓపెన్ అయ్యారు. ప్రముఖ యూట్యూబర్ లిల్లీ సింగ్ టాక్ షోలో పాల్గొన్న కృతి సనన్ షూటింగ్ సెట్స్‌లో మహిళా నటీమణులు, హీరోయిన్లు ఎదుర్కొనే వివక్షను ఉదాహరణలతో సహా చెప్పుకొచ్చారు.
కృతి సనన్ మోడలింగ్ రంగం నుంచి వచ్చి, ఇంజనీరింగ్ చదివి, ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తానొచ్చిన అన్ని రంగాల కంటే బాలీవుడ్‌లోనే భరించలేనంత ఎక్కువ సవాళ్లు ఎదుర్కొన్నానని కృతి సనన్ చెప్పారు.
కెరీర్ ప్రారంభంలో కేవలం గ్లామర్ పాత్రలకే, హీరోల పక్కన కేవలం రొమాన్స్ సీన్లకే పరిమితం చేసేవారని గుర్తుచేసుకున్నారు కృతి. ఇప్పుడు కథల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యత లభిస్తున్నా, సెట్స్‌లో చూపే వివక్ష రూపం మారిందే తప్ప పూర్తిగా పోలేదన్నారు.
ప్రశ్న అడిగితే తలపోటుగా చూస్తారు!
షూటింగ్ సమయంలో నటీనటులు తమ పాత్రల గురించి దర్శకులను, సాంకేతిక నిపుణులను ప్రశ్నలు అడగడం సహజం. కానీ, అక్కడే అసలు వివక్ష మొదలవుతుందని కృతి సనన్ పేర్కొన్నారు. ఒకే రకమైన ప్రశ్నకు హీరోలకు, హీరోయిన్లకు దక్కే సమాధానాల్లో ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుందని వివరించారు.
"ఒక హీరోయిన్ ప్రశ్నలు అడిగితే.. 'ఈమె ఏంటి ఇన్ని ప్రశ్నలు అడుగుతోంది, ఇప్పుడే యాభై ప్రశ్నలు మొదలుపెడుతుంది' అన్నట్లు వెనకాల మాట్లాడుకుంటారు. అదే ఒక స్టార్ హీరో ప్రశ్నలు అడిగితే మాత్రం.. సినిమాపై అతనికి చాలా శ్రద్ధ ఉందని, ఇన్వాల్వ్ అవుతున్నాడని మెచ్చుకుంటారు. ఇది నా విషయంలో స్వయంగా జరిగింది. నేను ఏదైనా డౌట్ అడిగితే ఎక్కువగా ఓవర్ ఎనలైజ్ చేయకు అని అనేవారు. అదే ఒక హీరో అడిగితే వెంటనే సరే అలానే చేద్దాం అనేవారు" అని కృతి సనన్ తన ఆవేదనను పంచుకున్నారు.
చిన్న రూములు, చిన్న కార్లు..
{{/usCountry}}"ఒక హీరోయిన్ ప్రశ్నలు అడిగితే.. 'ఈమె ఏంటి ఇన్ని ప్రశ్నలు అడుగుతోంది, ఇప్పుడే యాభై ప్రశ్నలు మొదలుపెడుతుంది' అన్నట్లు వెనకాల మాట్లాడుకుంటారు. అదే ఒక స్టార్ హీరో ప్రశ్నలు అడిగితే మాత్రం.. సినిమాపై అతనికి చాలా శ్రద్ధ ఉందని, ఇన్వాల్వ్ అవుతున్నాడని మెచ్చుకుంటారు. ఇది నా విషయంలో స్వయంగా జరిగింది. నేను ఏదైనా డౌట్ అడిగితే ఎక్కువగా ఓవర్ ఎనలైజ్ చేయకు అని అనేవారు. అదే ఒక హీరో అడిగితే వెంటనే సరే అలానే చేద్దాం అనేవారు" అని కృతి సనన్ తన ఆవేదనను పంచుకున్నారు.
చిన్న రూములు, చిన్న కార్లు..
{{/usCountry}}సినిమా సెట్స్‌లో క్యారవాన్లు, రూములు, కార్ల కేటాయింపుల్లోనూ వ్యత్యాసాలు చూపిస్తారని కృతి సనన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హీరోలకు లగ్జరీ వసతులు కల్పించి, హీరోయిన్లకు తక్కువ స్థాయి వసతులు కల్పిస్తారని చెప్పారు. తనకు భౌతిక సుఖాలు ముఖ్యం కాదని, కానీ ఆ వ్యత్యాసం వల్ల కలిగే అవమానం బాధ కలిగిస్తుందన్నారు. తనకు చిన్న రూమ్ ఇచ్చినా ఇబ్బంది లేదని, కానీ తమను తక్కువ చేసి చూడవద్దని కృతి సనన్ కోరారు.
అసిస్టెంట్ డైరెక్టర్లకు భయం
కేవలం వసతుల పరంగానే కాకుండా, సెట్స్‌లో పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్ల (ADs) ప్రవర్తనలోనూ ఈ తేడా కనిపిస్తుందని కృతి స్పష్టం చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్లకు సెట్స్‌పైకి హీరోయిన్లను అందరికంటే ముందే పిలిచే అలవాటు ఉంటుందని చెప్పారు. వాళ్లు హీరోలను చూసి భయపడతారని, కానీ హీరోయిన్లను మాత్రం చాలా తేలికగా (Taken for granted) తీసుకుంటారని కృతి సనన్ పేర్కొన్నారు.
కాగా, కృతి సనన్ ఇటీవలే 'కాక్‌టెయిల్ 2' (Cocktail 2) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హోమీ అదజానియా దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో షాహిద్ కపూర్, రష్మిక మందన్నా కూడా ప్రధాన పాత్రలు పోషించారు.
కృతి సినిమాకు రూ. 137 కలెక్షన్స్
మిశ్రమ స్పందన తెచ్చుకున్న కాక్‌టెయిల్ 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 137 కోట్ల వసూళ్లను సాధించింది. ప్రస్తుతం కృతి సనన్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించాల్సి ఉంది. ఏదేమైనా కృతి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.