OTT Romantic: ఓటీటీలోకి సెన్సేషన్ హిట్ మూవీ- గుండె లోతుల్లోకి వెళ్లే అందమైన కథ- 7.2 రేటింగ్- ఎక్కడ చూడాలంటే?

Love Mocktail 3 OTT Release Date Announced: ఓటీటీలోకి కన్నడ సెన్సేషన్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా హిట్ మూవీ వచ్చేయనుంది. గుండె లోతుల్లోకి వెళ్లే అందమైన కథగా తెరకెక్కిన లవ్ మాక్‌టెయిల్ 3 ఓటీటీ రిలీజ్ డేట్‌ను తాజాగా సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. లవ్ మాక్‌టెయిల్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో చూద్దాం.

Published on: May 1, 2026, 21:20:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Super Hit Love Mocktail 3 OTT Streaming Date Announced: కన్నడ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫ్రాంచైజీ 'లవ్ మాక్‌టెయిల్'. ఇప్పుడు ఈ సిరీస్ నుంచి ఆఖరి భాగమైన లవ్ మాక్‌టెయిల్ ఓటీటీలోకి వచ్చేయనుంది. థియేటర్లలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం త్వరలోనే మీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా అరచేతిలోకి రానుంది.

ఓటీటీలోకి సెన్సేషన్ హిట్ మూవీ- గుండె లోతుల్లోకి వెళ్లే అందమైన కథ- 7.2 రేటింగ్- ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి సెన్సేషన్ హిట్ మూవీ- గుండె లోతుల్లోకి వెళ్లే అందమైన కథ- 7.2 రేటింగ్- ఎక్కడ చూడాలంటే?

బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం

హీరో డార్లింగ్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో నటించిన 'లవ్ మాక్‌టెయిల్ 3' ఈ ఏడాది మార్చి 19న థియేటర్లలో విడుదలైంది. తొలి రెండు భాగాల మాదిరిగానే ఈ సినిమా కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సుమారు 25 రోజుల పాటు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైన ఈ చిత్రం, 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

కృష్ణ, మిలనా నాగరాజ్ సంయుక్తంగా తమ సొంత బ్యానర్ 'క్రిస్మీ ఫిల్మ్స్'పై ఈ లవ్ మాక్‌టెయిల్ 3 చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంది.

ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?

కన్నడలో రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన లవ్ మాక్‌టెయిల్ 3 ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ జీ5 (ZEE5) సొంతం చేసుకుంది. మే 8వ తేదీ నుంచి జీ5లో మాక్‌టెయిల్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు.

"గుండె లోతుల్లోకి వెళ్లే ఒక అందమైన కథ.. ఆది జీవితంలోని కొత్త అధ్యాయాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి" అంటూ జీ5 ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన తెలుగు ప్రేక్షకులు కూడా సబ్‌టైటిల్స్ లేదా డబ్బింగ్ వెర్షన్ ద్వారా ఈ సినిమాను వీక్షించవచ్చు.

ఆది ప్రయాణంలో మరో మలుపు

'లవ్ మాక్‌టెయిల్' సిరీస్ ప్రతి భాగంతోనూ పరిణితి చెందుతూ వచ్చింది. మొదటి భాగంలో కృష్ణను ఒక సరదా యువకుడిగా చూపిస్తే, రెండో భాగంలో భార్యను కోల్పోయిన బాధలో ఉండే వ్యక్తిగా ఎమోషనల్‌గా చూపించారు.

అయితే, ఈ మూడో భాగంలో కథ మరింత ఇంట్రెస్టింగ్‌గా, మెచ్యూర్‌డ్‌గా సాగుతుంది. ఇందులో ఆది ఒక తండ్రి పాత్రలో కనిపిస్తారు. ఒక తండ్రిగా తన బాధ్యతలు, భావోద్వేగాలను దర్శకుడు కృష్ణ చాలా సహజంగా తెరకెక్కించారని విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.2 రేటింగ్ కూడా వచ్చింది.

సాంకేతిక నిపుణులు, తారాగణం

ఈ చిత్రానికి నకుల్ అభ్యంకర్ అందించిన సంగీతం మేజర్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. శ్రీ క్రేజీ మైండ్స్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. రేచల్ డేవిడ్, అమృత అయ్యంగార్, రజనీ భరద్వాజ్, శ్వేత ప్రసాద్, దిలీప్ రాజ్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.

జీ5 ఓటీటీలో

ఆది పాత్రలో డార్లింగ్ కృష్ణ నటన ఈ సినిమాకు ప్రాణం పోసిందని రివ్యూలు వచ్చాయి. మరి ఇలాంటి లవ్ మాక్‌టెయిల్ 3 ఓటీటీ రిలీజ్ కానుంది. మే 8 నుంచి జీ5 ఓటీటీలో ఎంచక్కా చూసేయండి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More