గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రియాంక చోప్రా మెయిన్ లీడ్‌గా నటించిన తాజా చిత్రం ‘ది బ్లఫ్’ (The Bluff). పైరెట్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ది బ్లఫ్ ట్రైలర్ ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

అయితే, తాజాగా ది బ్లఫ్ ట్రైలర్ చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నిర్మాత, రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ ప్రశంసలు కురిపించారు. ప్రియాంక చోప్రా నటనను మెచ్చుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.
మహేశ్ బాబు ఏమన్నారంటే?
మహేశ్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘ది బ్లఫ్’ ట్రైలర్‌ను షేర్ చేస్తూ.. ప్రియాంక చోప్రాను ‘ఫార్మిడబుల్’ (మరింత శక్తివంతమైనది) అని అభివర్ణించారు. "ట్రైలర్ చాలా బాగుంది. ప్రియాంక చోప్రా మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఫిబ్రవరి 25న విడుదల కానున్న ఈ చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు" అని మహేశ్ బాబు రాసుకొచ్చారు. దీనికి స్పందించిన ప్రియాంక.. "ధన్యవాదాలు నా దోస్త్" అంటూ మహేశ్ బాబుకు రిప్లై ఇచ్చారు.
అటు ఎస్ఎస్ కార్తికేయ కూడా ప్రియాంక చోప్రా నటనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రియాంక చోప్రా.. ప్రతిసారీ ఇలాంటి పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ఎలా మెప్పిస్తారు? ఫిబ్రవరి 25 కోసం వెయిటింగ్" అని కార్తికేయ పేర్కొన్నారు. దానికి ప్రియాంక చోప్రా "చాలా థాంక్స్.. మీరు చాలా మంచివారు" అని బదులిచ్చారు.
ఏమిటీ ‘ది బ్లఫ్’?
19వ శతాబ్దపు కరీబియన్ దీవుల నేపథ్యంలో సాగే కథనే ది బ్లఫ్. ఇందులో ప్రియాంక ఒక మాజీ సముద్రపు దొంగ (Pirate) పాత్రలో కనిపిస్తున్నారు. తన గతాన్ని వదిలేసి ప్రశాంతంగా ఇద్దరు కూతుళ్లతో బతకాలనుకుంటుంది. కానీ, తన కుటుంబాన్ని గతం వెంటాడుతుంటుంది.
{{/usCountry}}19వ శతాబ్దపు కరీబియన్ దీవుల నేపథ్యంలో సాగే కథనే ది బ్లఫ్. ఇందులో ప్రియాంక ఒక మాజీ సముద్రపు దొంగ (Pirate) పాత్రలో కనిపిస్తున్నారు. తన గతాన్ని వదిలేసి ప్రశాంతంగా ఇద్దరు కూతుళ్లతో బతకాలనుకుంటుంది. కానీ, తన కుటుంబాన్ని గతం వెంటాడుతుంటుంది.
{{/usCountry}}తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ప్రియాంక చోప్రా తిరిగి ఆయుధం ఎలా పట్టిందనేది ది బ్లఫ్ సినిమా కథాంశం. అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా ది బ్లఫ్ ఓటీటీ రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 25 నుంచి తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ది బ్లఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
రాజమౌళి-మహేశ్ ‘వారణాసి’ అప్‌డేట్
మరోవైపు, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా తెరకెక్కనున్న భారీ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ (Varanasi) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 2027 సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో మహేశ్ బాబు ‘రుద్ర’గా, ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా కనిపించనున్నారు. ఇక మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఇండియన్ మైథాలజీ ఆధారంగా ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీ వారణాసి సాగనుంది.