Varanasi Promotions In Mexico CCXP Event Has Empty Seats: తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ఎస్ఎస్ రాజమౌళి తన కొత్త ప్రాజెక్ట్ 'వారణాసి'ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మెక్సికోలో జరిగిన ప్రఖ్యాత 'కామిక్ కాన్ ఎక్స్‌పీరియన్స్' (CCXP) ఈవెంట్‌లో వారణాసి సినిమా ప్రమోషన్లను అధికారికంగా మొదలుపెట్టారు.
హాలీవుడ్ భారీ చిత్రాలతోపాటు

హాలీవుడ్ భారీ చిత్రాలు అయిన 'అవెంజర్స్: డూమ్స్‌డే', 'డూన్: పార్ట్ 3' వంటి సినిమాలతో పోటీగా మన 'వారణాసి' ప్యానెల్‌ను ఆ ఈవెంట్‌లో ఏర్పాటు చేశారు. గతేడాది హైదరాబాద్‌లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత, అంతర్జాతీయ వేదికపై వారణాసి సినిమా గురించి మాట్లాడటం ఇదే తొలిసారి.
వేదికపై కార్తికేయ.. వీడియోలో రాజమౌళి
ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎస్.ఎస్. కార్తికేయ పాల్గొన్నారు. స్క్రీన్ రాంట్ ప్రతినిధి లియామ్ క్రౌలీ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, సినిమా స్థాయిని, దర్శకుడి విజన్‌ను వివరించారు. రాజమౌళి నేరుగా హాజరు కాలేకపోయినప్పటికీ, ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపారు.
'బాహుబలి'లో మెక్సికన్ ప్రభావం, 'ఆర్ఆర్ఆర్'కు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు గురించి కార్తికేయ మాట్లాడారు. ఈ సందర్భంగా వారణాసి సినిమాకు సంబంధించిన కొన్ని మునుపెన్నడూ చూడని మేకింగ్ విజువల్స్, బీటీఎస్ (BTS) వీడియోలను స్క్రీన్‌పై ప్రదర్శించారు.
ఖాళీ కుర్చీలు.. నడుచుకుంటూ వెళ్లిపోతున్న జనం?
అయితే, ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కార్తికేయ స్టేజ్‌పై మాట్లాడుతున్న సమయంలో ముందు వరుసలోని చాలా కుర్చీలు ఖాళీగా ఉండటం గమనార్హం.
"భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి సినిమాకు మెక్సికోలో ఆశించిన గౌరవం దక్కడం లేదు.. ఈ ఖాళీ కుర్చీలే దానికి నిదర్శనం" అంటూ కొందరు నెటిజన్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
{{/usCountry}}"భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి సినిమాకు మెక్సికోలో ఆశించిన గౌరవం దక్కడం లేదు.. ఈ ఖాళీ కుర్చీలే దానికి నిదర్శనం" అంటూ కొందరు నెటిజన్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
{{/usCountry}}మరికొన్ని వీడియోల్లో రాజమౌళి మెసేజ్ ప్లే అవుతుండగా, జనం అటు ఇటు తిరుగుతూ బయటకు వెళ్లిపోతున్నట్లుగా కనిపిస్తోంది. భారీ హైప్ ఉన్న వారణాసి సినిమాకు ఇలాంటి స్పందన రావడం ఏంటని సినీ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు.
వెనకేసుకొస్తున్న అభిమానులు
వారణాసి సినిమాకు అవమానం అంటూ వస్తున్న ఈ విమర్శలపై రాజమౌళి అభిమానులు గట్టిగానే స్పందిస్తున్నారు. అది కేవలం ఒక వైపు నుంచి తీసిన ఫోటో మాత్రమేనని, కార్తికేయతో అభిమానులు దిగిన ఫోటోల్లో జనం బాగానే ఉన్నారని వారు వాదిస్తున్నారు. కుర్చీలు ఖాళీగా ఉండటం కేవలం 'వారణాసి' ప్యానెల్‌కు మాత్రమే కాదని, ఆ సమయంలో ఇతర హాలీవుడ్ సినిమాల ఈవెంట్లకు కూడా అలాగే జరిగిందని చెబుతున్నారు. జనం బయటకు వెళ్లిపోవడం లేదని, తమ సీట్ల కోసం వెతుక్కుంటూ అటు ఇటు తిరుగుతున్నారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
'వారణాసి' కథేంటి?
కాగా, ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను అందించిన వారణాసి చిత్రం టైమ్ ట్రావెల్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోంది. సైన్స్ ఫిక్షన్‌కు భారతీయ పురాణాలను జోడించి రాజమౌళి ఈ అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నారు. మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ పాన్-వరల్డ్ మూవీని 2027 ఏప్రిల్‌లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'వారణాసి' సినిమాలో హీరో ఎవరు?
ఈ సినిమాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్నారు.
2. మెక్సికో ఈవెంట్‌లో ఏం జరిగింది?
మెక్సికోలో జరిగిన 'CCXP' ఈవెంట్‌లో 'వారణాసి' చిత్ర ప్రోమోలను ప్రదర్శించారు. అయితే కొన్ని విజువల్స్‌లో ఖాళీ కుర్చీలు కనిపించడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
3. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?
రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ నెలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
4. సినిమాలో టైమ్ ట్రావెల్ అంశం ఉందా?
అవును, భారతీయ ఇతిహాసాలను సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో కలిపి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.