...
...
Next Story

OTT Talk Show: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన సరికొత్త టాక్ షో- మాతృత్వం, పితృత్వంపై మనసుకు హత్తుకునే చర్చలు- హోస్ట్‌గా హీరోయిన్!

Parineeti Chopra Mom Talks Show OTT Release Today: గతేడాది మాతృత్వపు మధురిమలను ఆస్వాదించిన బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా 'మామ్ టాక్స్' (Mom Talks) పేరుతో సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. గర్భధారణ, శిశువుల పెంపకంలో ఉండే సవాళ్లపై సాగే ఈ షోకు ఆమె భర్త, ఎంపీ రాఘవ్ చద్దా అండగా నిలిచారు.

Published on: Apr 5, 2026, 07:34:43 IST
Advertisement

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. గతేడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన పరిణీతి చోప్రా ఇప్పుడు తల్లుల సమస్యలు, వారి మనోభావాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు 'మామ్ టాక్స్' (Mom Talks) అనే సరికొత్త టాక్ షోను ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన మామ్ టాక్స్ టీజర్‌ను ఆమె తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ప్రముఖ సెలబ్రిటీలతో మనసు విప్పే సంభాషణలు

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన సరికొత్త టాక్ షో- మాతృత్వం, పితృత్వంపై మనసుకు హత్తుకునే చర్చలు- హోస్ట్‌గా హీరోయిన్!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన సరికొత్త టాక్ షో- మాతృత్వం, పితృత్వంపై మనసుకు హత్తుకునే చర్చలు- హోస్ట్‌గా హీరోయిన్!

ఈ షోలో మాతృత్వం, పితృత్వంపై మనసుకు హత్తుకునే చర్చలు ఉండనున్నాయి. నేహా ధూపియా, విక్రాంత్ మాస్సే-శీతల్ ఠాకూర్ జంట, ఇమ్రాన్ ఖాన్, గౌహర్ ఖాన్-జైద్ దర్బార్, దిశా పర్మార్ వంటి సినీ సెలబ్రిటీలు ఈ వేదికపై తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకోనున్నారు. పిల్లల పెంపకంలో ఎదురయ్యే సామాజిక ఒత్తిళ్లు, అపోహలపై పరిణీతి వీరితో కలిసి లోతుగా చర్చించనున్నారు.

ఈ కొత్త ప్రయత్నాన్ని చూసి గర్వపడుతున్నట్లు పరిణీతి చోప్రా భర్త, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేర్కొన్నారు. "నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది! అభినందనలు. నేను ఎప్పుడూ నీకు మద్దతుగా ఉంటాను" అని రాఘవ్ చద్దా కామెంట్ సెక్షన్‌లో తన ప్రేమను చాటుకున్నారు.

రాజకీయాల్లో 'గాయపడ్డ సింహం'లా రాఘవ్ చద్దా

మరోవైపు, గత కొద్దిరోజులుగా రాఘవ్ చద్దా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆయన్ని అనూహ్యంగా తొలగించి, అశోక్ మిట్టల్‌ను నియమించింది. ఈ నిర్ణయంపై రాఘవ్ స్పందిస్తూ.. తనను మౌనంగా ఉంచగలరేమో కానీ ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు.

తనపై జరుగుతున్నది ఒక ప్రణాళికాబద్ధమైన దాడి అని, అందరూ ఒకే తరహా విమర్శలు చేయడం వెనుక కుట్ర ఉందని రాఘవ్ చద్దా ఆరోపించారు. కాగా, గతంలో పార్లమెంటులో తండ్రులకు కూడా సెలవులు (Paternal Leave) కావాలని రాఘవ్ చద్దా గొంతు వినిపించగా, పరిణీతి ఆయనకు మద్దతు తెలపడం విశేషం.

ఉదయ్‌పూర్ వేదికగా వైభవంగా పెళ్లి..

పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా 2023 మే నెలలో ఉదయ్‌పూర్‌లోని లీలా ప్యాలెస్‌లో అట్టహాసంగా వివాహం చేసుకున్నారు. వివాహబంధంలోకి అడుగుపెట్టిన రెండేళ్ల తర్వాత, అంటే 2025 అక్టోబర్ 19న ఈ దంపతులకు 'నీర్' అనే కుమారుడు జన్మించాడు. ఇప్పుడు తన కుమారుడి రాకతో కలిగిన అనుభవాలను ఈ షో ద్వారా పంచుకోవడానికి పరిణీతి సిద్ధమయ్యారు.

భార్య పరిణీతి చోప్రా మామ్ టాక్స్ షోపై భర్త రాఘవ్ చద్ధా కామెంట్

మామ్ టాక్స్ ఓటీటీ స్ట్రీమింగ్

ఇకపోతే పరిణీతి చోప్రా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న మామ్ టాక్స్ ఓటీటీలోకి ఇవాళ (ఏప్రిల్ 5) వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5లో మామ్ టాక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి ఎపిసోడ్‌లో బాలీవుడ్ ప్రముఖ నటుడు విక్రాంత్ మాస్సే, ఆయన భార్య శీతల్ అతిథిగా హాజరయ్యారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe