...
...
Next Story

OTT Crime: 18 ఏళ్ల తర్వాత ఓటీటీతో కలిసిన సూపర్ హిట్ జోడీ- వరుణ్ సందేశ్, శ్వేతా బసుల నా వైఫ్ మిస్సింగ్ ఓటీటీ స్ట్రీమింగ్

Naa Wife Missing Glimpse Released: 'కొత్త బంగారు లోకం' సూపర్ హిట్ జోడీ వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ ఓటీటీతో మళ్లీ ఒక్కటయ్యారు. సుమారు 18 ఏళ్ల తర్వాత వరుణ్ సందేశ్, శ్వేతా బసు కలిసి నటించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నా వైఫ్ మిస్సింగ్ ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజైన గ్లింప్స్ విశేషాలు ఇక్కడ చూద్దాం.

Published on: Sep 28, 2026, 05:35:36 IST
Advertisement

Varun Sandesh Shweta Basu Prasad Naa Wife Missing Glimpse Released: ఇటీవల సమాజంలో జరుగుతున్న కొన్ని క్రైమ్ ఇన్సిడెంట్స్ చూస్తే దిగ్భ్రాంతికరమైన విషయాలు, నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వైవాహిక బంధాల్లో వెల్లువెత్తుతున్న విభేదాలు, అక్రమ సంబంధాల నేపథ్యం చివరకు దారుణమైన హత్యలకు దారితీస్తున్నాయి.

ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ డ్రామా

18 ఏళ్ల తర్వాత ఓటీటీతో కలిసిన సూపర్ హిట్ జోడీ- వరుణ్ సందేశ్, శ్వేతా బసుల నా వైఫ్ మిస్సింగ్ ఓటీటీ స్ట్రీమింగ్
18 ఏళ్ల తర్వాత ఓటీటీతో కలిసిన సూపర్ హిట్ జోడీ- వరుణ్ సందేశ్, శ్వేతా బసుల నా వైఫ్ మిస్సింగ్ ఓటీటీ స్ట్రీమింగ్

ప్రియుడి కోసం భర్తను మట్టుబెట్టడం, అనుమానంతో భార్యను హత్య చేసి ఏమీ తెలియనట్లు నటించడం వంటి ఘటనలు తరచూ వార్తల్లో చూస్తున్నాం. సరిగ్గా ఇలాంటి నిజజీవిత క్రైమ్ కోణాల ఆధారంగా ఒక ఉత్కంఠభరితమైన కథతో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.

18 ఏళ్ల తర్వాత మళ్లీ అదే క్రేజీ కాంబినేషన్

2008లో వచ్చిన 'కొత్త బంగారు లోకం' సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంతో యూత్ ఐకాన్లుగా మారిన హీరోహీరోయిన్లు వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ టాలీవుడ్‌లో సూపర్ హిట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మాత్రం ఇద్దరూ వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా మారారు.

శ్వేతా బసు ప్రసాద్ 2018 తర్వాత తెలుగు తెరకు కొంత దూరంగా ఉండి బాలీవుడ్‌లో క్రేజీ ఓటీటీ సిరీస్‌లతో దూసుకుపోయింది. మరోవైపు వరుణ్ సందేశ్ బిగ్ బాస్, వరుసగా సినిమాలు, షోలు చేస్తూ అలరిస్తున్నాడు. అయితే, దాదాపు 18 ఏళ్ల విరామం తర్వాత ఈ హిట్ పెయిర్ మళ్లీ ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలపడం డిజిటల్ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

'నా వైఫ్ మిస్సింగ్'.. అసలేం జరిగింది?

తాజాగా చిత్రబృందం ఈ సిరీస్‌కి సంబంధించిన నా వైఫ్ మిస్సింగ్ గ్లింప్స్‌ను విడుదల చేసి ప్రమోషన్లకు శ్రీకారం చుట్టింది. ఈ గ్లింప్స్ పరిశీలిస్తే కథపై ఒక స్పష్టత వస్తోంది. బ్యాంకు ఉద్యోగిగా పనిచేసే బాలు (వరుణ్ సందేశ్) తన భార్య అకస్మాత్తుగా కనిపించకుండా పోయిందని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేస్తాడు.

పోలీసులను బురిడీ కొట్టిస్తున్నాడా

పోలీసుల విచారణ ప్రారంభమైన కొద్దీ అనేక సంచలనాత్మక విషయాలు బయటకు వస్తుంటాయి. అసలు బాలు భార్య ఏమైంది? ఆమెను బాలునే సొంతంగా హత్య చేసి పోలీసులను బురిడీ కొట్టిస్తున్నాడా? లేక ఆమె వేరే ఎవరితోనైనా వెళ్లిపోయిందా? అనే ప్రశ్నలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.

అయితే, కొత్త బంగారు లోకం సినిమాలో వరుణ్ సందేశ్ పాత్ర పేరు కూడా బాలునే. ఇందులో కూడా బాలుగానే పాత్ర పేరు ఉంది. ఇలా చూస్తే కొత్త బంగారు లోకం సినిమా జోడీనే పెళ్లి చేసుకుని లైఫ్ లీడ్ చేసుకున్నట్లుగా మేకర్స్ చూపించనున్నట్లు తెలుస్తోంది.

నా వైఫ్ మిస్సింగ్ ఓటీటీ రిలీజ్

ఇటీవలి కాలంలో ఓటీటీ వేదికలపై సైకలాజికల్, క్రైమ్ థ్రిల్లర్లకు ఆదరణ విపరీతంగా పెరిగింది. వాస్తవ ఘటనలకు దగ్గరగా ఉండే కథలను చూసేందుకు ఓటీటీ లవర్స్ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే 'నా వైఫ్ మిస్సింగ్' ఓటీటీ సిరీస్ కూడా నేటి సమాజంలో జరుగుతున్న క్రైమ్ ధోరణులను ఆసక్తికరంగా చూపించనుందని తెలుస్తోంది.

వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ నటన ఈ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలవనుంది. అయితే, నా వైఫ్ మిస్సింగ్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆహా మాత్రం ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks