...
...
Next Story

OTT Action: తుపాకులు, దొంగతనం, ప్రేమ, ప్రెగ్నెంట్ లేడి ఫైట్స్.. ఓటీటీలోకి డైరెక్ట్ వచ్చిన మైండ్ బ్లాక్ యాక్షన్ థ్రిల్లర్

Nibba Nibbi OTT Streaming: ఓటీటీలోకి నేరుగా రోడ్ ట్రిప్ డార్క్ కామెడీ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నిబ్బా నిబ్బీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఒక సీక్రెట్ హార్డ్ డ్రైవ్ దొంగతనం చేసే లవర్స్ చుట్టూ ఛేజింగ్, యాక్షన్‌తో ఈ సినిమా సాగుతుంది. మరి నిబ్బా నిబ్బీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Aug 15, 2026, 13:47:58 IST
Advertisement

Nibba Nibbi OTT Release: ప్రస్తుతం డిజిటల్ మీడియాలో వినూత్నమైన కథలకు, థ్రిల్లింగ్ రోడ్ మూవీలకు మంచి క్రేజ్ ఉంది. సాధారణ రొమాంటిక్ లేదా యాక్షన్ సినిమాలకు భిన్నంగా, డార్క్ కామెడీ, ఉత్కంఠభరితమైన యాక్షన్, వైవిధ్యమైన ప్రేమకథల సమాహారంగా వచ్చే చిత్రాలను ఓటీటీ ప్రియులు బాగా ఆదరిస్తున్నారు.

ఓటీటీలోకి డైరెక్ట్‌గా నిబ్బా నిబ్బీ

తుపాకులు, దొంగతనం, ప్రేమ, ప్రెగ్నెంట్ లేడి ఫైట్స్.. ఓటీటీలోకి డైరెక్ట్ వచ్చిన మైండ్ బ్లాక్ యాక్షన్ థ్రిల్లర్
తుపాకులు, దొంగతనం, ప్రేమ, ప్రెగ్నెంట్ లేడి ఫైట్స్.. ఓటీటీలోకి డైరెక్ట్ వచ్చిన మైండ్ బ్లాక్ యాక్షన్ థ్రిల్లర్

ఈ కోవలోనే వచ్చిన సరికొత్త డార్క్ కామెడీ రోడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'నిబ్బా నిబ్బీ' (Nibba Nibbi). తాజాగా ఈ నిబ్బా నిబ్బీ ఓటీటీలోకి నేరుగా వచ్చేసింది. తథాగత ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ రోడ్ డ్రామా మూవీలో రిషభ్ బసు, సౌరసేని మైత్రా ప్రధాన పాత్రల్లో హీరో హీరోయిన్లుగా నటించారు.

ఒక్క హార్డ్ డ్రైవ్.. ఉత్కంఠభరిత ఛేజింగ్!

నిబ్బా నిబ్బీ సినిమా కథ విషయానికి వస్తే.. సమాజంలో ఎంతో పవర్ ఫుల్ వ్యక్తులకు సంబంధించిన అత్యంత రహస్యమైన సమాచారం ఉన్న ఒక హార్డ్ డ్రైవ్‌ను ఒక ప్రేమికుల జంట దొంగిలిస్తుంది. వారిద్దరూ చేసిన ఆ ఒక్క ఆలోచనారహితమైన పని, వారి జీవితాలను ఊహించని మలుపు తిప్పుతుంది.

ఆ హార్డ్ డ్రైవ్ కోసం వెంటపడే డేంజరస్ గ్యాంగ్‌ల నుంచి తప్పించుకునేందుకు ఆ జంట బెంగాల్ రోడ్లపై సాగించే పరుగు, ఉత్కంఠభరితమైన ఛేజింగ్ కథనానికి ప్రాణం పోసింది. ప్రతి మలుపులోనూ కొత్త ప్రమాదం, ఊహించని ఎదురుదెబ్బలు తగిలినా.. ఆ జంట తీసుకునే తొందరపాటు నిర్ణయాలు, చేసే విపరీత చేష్టలు ప్రేక్షకులకు గూస్‌బంప్స్‌తో పాటు విపరీతమైన నవ్వులను అందిస్తాయి.

తుపాకుల మోత మధ్య డార్క్ హ్యూమర్!

యాక్షన్ సీన్స్ సీరియస్‌గా సాగుతున్న సమయంలోనే, పాత్రల ప్రవర్తన కథను సరదాగా మార్చేస్తుంది. ఈ డిఫరెంట్ అప్రోచే ఈ సినిమాను ఇతర యాక్షన్ చిత్రాల కంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. అలాగే, హీరోయిన్ ప్రెగ్నెంట్‌గా ఉండి కూడా చేసే యాక్షన్ సీక్వెన్స్ అలరిస్తాయి.

అదిరిపోయిన కెమిస్ట్రీ.. ఆకట్టుకున్న నటన

ఈ క్రేజీ ప్రయాణంలో రిషభ్ బసు, సౌరసేని మైత్రా తమ నటనతో దుమ్మురేపారు. ఎలాంటి క్యాలిక్యులేషన్స్‌తో సంబంధం లేకుండా ప్రమాదంలోకి దూకే ప్రేమికులుగా వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. తనదైన ముద్ర వేసే పాత్రలో రిషభ్ బసు కనిపిస్తే, ఎవరికీ లొంగని ధైర్యవంతురాలైన ప్రెగ్నెంట్ యువతిగా సౌరసేని జీవించేసింది.

శాంతిలాల్ ముఖర్జీ, శంకర్ చక్రవర్తి వంటి సీనియర్ నటులు తమ అనుభవంతో కథకు మరింత బలాన్ని చేకూర్చారు. సగటు సినిమాల్లో కనిపించే రొమాంటిక్ ప్రేమకథ కాకుండా, ప్రమాదాలు-తోపులాటల మధ్య సాగే వీరి బంధం నేటితరం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది.

నిబ్బా నిబ్బీ ఓటీటీ స్ట్రీమింగ్

ఏమాత్రం రొటీన్‌గా లేకుండా, వేగవంతమైన కథనంతో సాగే నిబ్బా నిబ్బీ ఆకట్టుకుంటుంది. అలాంటి నిబ్బా నిబ్బీ ఓటీటీలోకి డైరెక్ట్‌గా నిన్న (ఆగస్ట్ 14) వచ్చేసింది. ఆగస్ట్ 14 నుంచి జీ5లో నిబ్బా నిబ్బీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్, యాక్షన్, డార్క్ హ్యూమర్‌తో కలగలపిన రోడ్ ట్రిప్ మూవీ నిబ్బా నిబ్బీని జీ5 ఓటీటీలో చూసేందుకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe