OTT Political Thriller: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్.. ఆ 5 ప్రశ్నల చుట్టూ సాగే కథ.. ఎక్కడ చూడాలంటే?
Aakhri Sawal OTT Streaming From Today: బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా సినిమా ఆఖరి సవాల్ ఓటీటీలోకి నేడు వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా రెస్పాన్స్ తెచ్చుకోని ఈ సినిమా ఓటీటీలో ఆకట్టుకుంటోంది. 5 ప్రశ్నల కథతో సాగే ఆఖరి సవాల్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Aakhri Sawal OTT Release Today: బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ నటించిన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా 'ఆఖరి సవాల్' ఓటీటీలోకి ఇవాళ (ఆగస్ట్ 14) వచ్చేసింది. ఈ ఏడాది మే నెలలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా 2 నెలల గ్యాప్‌లో ఓటీటీలో అందుబాటులో ఉంది. థియేటర్లలో చూడటం మిస్సయిన వీక్షకులు ఇప్పుడు నేరుగా ఈ పొలిటికల్ డ్రామాను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఆస్వాదించవచ్చు.

ఆర్ఎస్ఎస్ నేపథ్యం..
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చరిత్ర, దాని సిద్ధాంతాల నేపథ్యంగా రూపొందిన కథతో ఈ సినిమా సాగుతుంది. ఒక విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, ఆయన వద్ద చదివే ఒక తిరుగుబాటు విద్యార్థి మధ్య జరిగే ఆలోచనాత్మక సంవాదం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
ఐదు కీలకమైన, నిలదీసే ప్రశ్నలు
విద్యార్థి విక్కీ హెగ్డే ఆర్ఎస్ఎస్ మూలాలపై సుదీర్ఘ పరిశోధన చేసి, ప్రొఫెసర్ గోపాల్ నాడ్కర్ణి ముందు ఐదు కీలకమైన, నిలదీసే ప్రశ్నలను ఉంచుతాడు. ఆ ప్రశ్నలకు ప్రొఫెసర్ ఎలాంటి సమాధానాలు చెప్పారు? వారి చర్చ ఎటు దారితీసింది? అనే కథాంశంతో దర్శకుడు అభిజీత్ వారంగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ప్రొఫెసర్ గోపాల్ నాడ్కర్ణి పాత్రలో సంజయ్ దత్
ఆఖరి సవాల్ చిత్రంలో ప్రొఫెసర్ గోపాల్ నాడ్కర్ణి పాత్రలో సంజయ్ దత్ తనదైన నటనతో ఆకట్టుకోగా, విద్యార్థిగా నమాషి చక్రవర్తి కనిపించారు. వారితో పాటు అమిత్ సాధ్, సమీరా రెడ్డి, నీతూ చంద్ర, ఆయుషి చతుర్వేది, త్రిధా చౌదరి, అర్చన ఆర్య కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మాంటీ శర్మ సంగీతం అందించగా, ప్రముఖ కవి కుమార్ విశ్వాస్ సాహిత్యాన్ని సమకూర్చారు.
థియేటర్లలో నిరాశ.. 3 కోట్ల కలెక్షన్స్ మాత్రమే
మే 15న థియేటర్లలో విడుదలైన ఆఖ్రీ సవాల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. భారతీయ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 2.94 కోట్ల నెట్ కలెక్షన్స్ (గ్రాస్ రూ. 3.04 కోట్లు) మాత్రమే సాధించి నిరాశపరిచింది. అయితే, ఐఎమ్‌డీబీ (IMDb)లో మాత్రం ఆఖరి సవాల్ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ కారణంగా 6.4 రేటింగ్ సాధించడం విశేషం.
ఆఖరి సవాల్ ఓటీటీ స్ట్రీమింగ్
ఇలాంటి ఆఖరి సవాల్ ఓటీటీలోకి నేడు వచ్చేసింది. లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play)లో ఆఖరి సవాల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆఖరి సవాల్ ఓటీటీ రిలీజ్ సందర్భంగా ఇటీవల "కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వినడం అంత సులువు కాదు.. అలాంటి పవర్‌ఫుల్ ప్రశ్నలనే ఈ సినిమా ప్రశ్నిస్తోంది" అని లయన్స్ గేట్ ప్లే సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది.
ఓటీటీ ఛాయిస్‌గా ఆఖరి సవాల్
ఇలా ఓటీటీలోకి వచ్చిన వెంటనే ఆఖరి సవాల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. సంజయ్ దత్ నటనను, నిజమైన సంఘటనల ఆధారంగా చర్చించిన తీరును ఓటీటీ ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. రాజకీయం, సామాజిక అంశాలపై ఆసక్తి ఉన్నవారికి ఆఖరి సవాల్ సినిమా మంచి ఓటీటీ ఛాయిస్‌గా మారింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


