OTT Crime Thrillers In Telugu Tamil Kannada Hindi: ఎండల తీవ్రత పెరగడంతో బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే కూర్చుని ఓటీటీ కంటెంట్ చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. అలాంటి వారికోసం థ్రిల్‌ను పంచేందుకు క్రైమ్ థ్రిల్లర్స్ ఓటీటీలోకి వచ్చేశాయి.
ఒక్కదాంట్లోనే 3

ఒక్క శుక్రవారం (మే 22) నాడు రెండు ఓటీటీల్లో నాలుగు క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అవి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ వంటి ఒక్కో భాషలో ఒక్కోటి ఉంది. అంతేకాకుండా ఒక్క ఓటీటీలోనే ఏకంగా 3 క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ అవడం విశేషం. మరి విభిన్నమైన కథాంశాలతో కూడిన ఆ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
'వారెంట్'.. సాధు స్వభావం వెనుక దాగున్న క్రూరత్వం!
తమిళంలో సూపర్ హిట్ అయిన విలంగు ఓటీటీ వెబ్ సిరీస్ ప్రపంచం (Universe) నుంచి వచ్చిన సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ 'వారెంట్'. వారెంట్ ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ ది విలంగు అనేది పూర్తి టైటిల్. కోట్టై కరుప్పసామి అనే ఒక సాధు స్వభావం గల, దయా హృదయుడైన కానిస్టేబుల్ కథ ఇది.
అతని మంచితనాన్ని చూసి చుట్టుపక్కల వారు, తోటి సిబ్బంది హేళన చేయడంతో అతనిలో మార్పు మొదలవుతుంది. ఆ అవమానాల నుంచి అతను ఒక క్రూరమైన, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకునే రక్షకుడిగా ఎలా మారాడనేది దర్శకుడు ఆసక్తికరంగా చూపించారు. అధికారం, అణచివేత అనే అంశాల చుట్టూ సాగే ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ వారెంట్ ఓటీటీ రిలీజ్ అయింది. మే 22 నుంచి జీ5లో వారెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
'శేష 2016'.. ఒకే రాత్రిలో సాగే మరణ శాసనం!
కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన బైలింగ్వల్ క్రైమ్ థ్రిల్లర్ 'శేష 2016'. ప్రదీప్ అరసికెరె దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకే ఒక్క రాత్రిలో జరిగే మనుగడ సాగించే పోరాటం, నైతిక విలువల చుట్టూ ఈ కథ నడుస్తుంది.
{{/usCountry}}కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన బైలింగ్వల్ క్రైమ్ థ్రిల్లర్ 'శేష 2016'. ప్రదీప్ అరసికెరె దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకే ఒక్క రాత్రిలో జరిగే మనుగడ సాగించే పోరాటం, నైతిక విలువల చుట్టూ ఈ కథ నడుస్తుంది.
{{/usCountry}}ఇందులో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) పాత్రలో దేవరాజ్, ఏఎస్ఐ ఆంథోనీ వర్గీస్ పాత్రలో ప్రమోద్ శెట్టి, ఎస్ఐ దాస్ పాత్రలో జాన్ కైప్పల్లిల్ పవర్‌ఫుల్ నటనను కనబరిచారు. సస్పెన్స్, హై డ్రామా ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి ఎంపిక. మే 22 నుంచి సన్ నెక్ట్స్ (Sun NXT)లో శేష 2016 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడ క్రైమ్ థ్రిల్లర్ అయిన శేష 2016 మలయాళంలో కూడా అందుబాటులో ఉంది.
సత్రంగి బద్లే కా ఖేల్ ఓటీటీ రిలీజ్
హిందీ క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారి కోసం సత్రంగి: బద్లే కా ఖేల్ ఓటీటీలోకి వచ్చేసింది. హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయిన సత్రంగి పగ, ప్రతీకారాల నేపథ్యంలో థ్రిల్లర్ లవర్స్‌ను అట్రాక్ట్ చేస్తుంది. జీ5 ఓటీటీలోనే మే 22 నుంచి సత్రంగి బద్లే కా ఖేల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
పందెం కోడి చుట్టూ తిరిగే నవ్వుల పండగ!
తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూ థ్రిల్ పంచేందుకు వచ్చిన సరికొత్త క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కామెడీ వెబ్ సిరీస్ 'మేము కాప్‌లం'. తెలుగు రాష్ట్రాల్లో కోడి పందెలాకు ఉండే క్రేజ్ వేరు. అదే తరహాలో ఒక పెద్ద కోడి పందాల పోటీకి ముందు 'సలార్ రాజు' అనే పందెం కోడి హఠాత్తుగా మాయమవుతుంది. ఆ కోడిని వెతికే బాధ్యతను గ్రామంలోని ఇద్దరు అమాయక పోలీసు కానిస్టేబుళ్లు రవి సొటారి, మోహన్ సొటారిలకు అప్పగిస్తారు.
జీ5 ఓటీటీలో
ఒక సాధారణ కోడి దొంగతనం కేసు కాస్తా, ఊహించని మలుపులు తిరిగి ఎలాంటి పెద్ద కుట్రకు దారితీసిందనేది ఈ ఓటీటీ సిరీస్ కథాంశం. గ్రామీణ నేపథ్యంలో సాగే వ్యంగ్యం, కామెడీతో ఈ థ్రిల్లర్ మిస్టరీ సిరీస్‌ను చాలా చక్కగా మలిచారు. నాగబాబు, గెటప్ శ్రీను నటించిన మేము కాప్‌లం జీ5లో మే 22న ఓటీటీ రిలీజ్ అయింది.