Theater To OTT: థియేటర్లలో విడుదల కావాల్సిన స్టార్ హీరోల 5 సినిమాలు ఓటీటీలో రిలీజ్- అందుకు కారణాలు? మరి హిట్ కొట్టాయా?

OTT Streaming Movies Which Has To Release In Theaters: థియేటర్లలో విడుదలయ్యేందుకు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన స్టార్ హీరోల సినిమాలు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‌కు వచ్చాయి. థియేటర్ టు ఓటీటీ రిలీజ్‌కు వచ్చిన పరిస్థితులు ఏంటీ, మరి ఓటీటీల్లోకి వచ్చాక ఆ సినిమాల ఫలితం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Nov 11, 2026, 14:11:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Streaming Movies Which Has To Release In Theaters: సినిమా నిర్మించే ఏ నిర్మాత అయినా తన చిత్రాన్ని వెండితెరపైనే ప్రదర్శించాలని బలంగా కోరుకుంటారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల కంటే థియేటర్ల ద్వారా వచ్చే వసూళ్లు, ఇచ్చే అనుభూతి ఎంతో ప్రత్యేకం. కలెక్షన్లు బాగుంటే పెట్టిన పెట్టుబడికి కొన్ని రెట్లు లాభాలు వస్తాయి.

థియేటర్లలో విడుదల కావాల్సిన స్టార్ హీరోల 5 సినిమాలు ఓటీటీలో రిలీజ్- అందుకు కారణాలు? మరి హిట్ కొట్టాయా?
థియేటర్లలో విడుదల కావాల్సిన స్టార్ హీరోల 5 సినిమాలు ఓటీటీలో రిలీజ్- అందుకు కారణాలు? మరి హిట్ కొట్టాయా?

థియేటర్ టు ఓటీటీకి

చిన్న సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన 'హనుమాన్' వంటి చిత్రాలే ఇందుకు నిదర్శనం. అయితే కొన్నిసార్లు ఊహించని పరిస్థితులు ఎదురైనప్పుడు నిర్మాతలు తమ నిర్ణయాలను మార్చుకోక తప్పదు. కోవిడ్ లాక్‌డౌన్ కాలంలో సరిగ్గా ఇదే జరిగింది.

థియేటర్ల కోసమే రూపుదిద్దుకున్న పలు భారీ చిత్రాలు ఆ సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి. అలా థియేటర్లలో విడుదల కావాల్సింది.. ఓటీటీ స్ట్రీమింగ్ అయిన ఆ సినిమాలు ఏంటీ, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం.

వివాదాలు, ఆశించిన స్థాయికి రాని స్పందన: 'లక్ష్మి'

అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ 'లక్ష్మి బాంబ్' మూవీ 2020లో విడుదల కావలసి ఉంది. రాఘవా లారెన్స్ తెరకెక్కించిన తమిళ హిట్ 'కాంచన'కి ఇది రీమేక్. థియేటర్లలో భారీ స్పందన వస్తుందని ఆశించిన ఈ సినిమాను లాక్‌డౌన్ కారణంగా జియో హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది. టైటిల్, కథాంశంపై అప్పట్లో తీవ్ర వివాదాలు చెలరేగాయి. భారీ అంచనాల నడుమ ఓటీటీలోకి వచ్చినప్పటికీ ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.

అభిమానుల ఆశ్రునయనాల నడుమ: 'దిల్ బిచారా'

దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం 'దిల్ బిచారా'. ఈ సినిమాను మొదట 2019 చివర్లో, ఆ తర్వాత 2020 మే నెలలో థియేటర్లలో తీసుకురావాలని భావించారు. కరోనా మహమ్మారి విజృంభణతో థియేటర్లు మూతపడటం, ఈ లోపే సుశాంత్ హఠాన్మరణం చెందడంతో చిత్రసీమ దిగ్భ్రాంతికి గురైంది. అభిమానులకు నివాళిగా ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. సుశాంత్ చివరి నటనను చూసి కోట్లాది మంది ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయ్యారు.

లీక్డ్ లుక్స్‌తో హడావుడి: 'గులాబో సితాబో'

అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన 'గులాబో సితాబో' సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే మంచి క్రేజ్ సంపాదించుకుంది. అమితాబ్ విభిన్నమైన గెటప్ ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేశాయి. కానీ థియేటర్లు తెరచుకునే పరిస్థితి లేకపోవడంతో నిర్మాతలు దీనిని అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. డిజిటల్‌లో ఈ సినిమాకి లభించిన సాధారణ స్పందన చూశాక, థియేటర్లలో కాకుండా ఓటీటీలోనే రావడం ఒక రకంగా మంచిదే అయిందని సినీ విశ్లేషకులు భావించారు.

బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ మిస్సయిన వార్ డ్రామా: 'భుజ్'

అజయ్ దేవగన్, సంజయ్ దత్ కలసి నటించిన వార్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ చిత్రం 'భుజ్ - ది ప్రైడ్ ఆఫ్ ఇండియా'. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధ ఘట్టాల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పక్కాగా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం డిజైన్ చేశారు. కానీ పరిస్థితుల ప్రభావంతో జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఆశించిన స్థాయి విజువల్ ఇంపాక్ట్ చిన్న తెరపై లభించకపోవడంతో ప్రేక్షకులను ఇది నిరాశపరిచింది.

ప్రేక్షకుల ఆదరణ పొందని సీక్వెల్: 'సడక్ 2'

మహేష్ భట్ దర్శకత్వంలో అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్, సంజయ్ దత్ నటించిన చిత్రం 'సడక్ 2'. తొంబైల నాటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉండేవి. 2020 జూలైలో విడుదల కావలసిన ఈ సినిమా థియేటర్లు సుదీర్ఘకాలం మూతపడటంతో జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చింది. అయితే డిజిటల్ మాధ్యమంలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన లభించలేదు.

ఇలా అనేక కారణాలతో ఓటీటీ వైపు అడుగులు వేసిన చిత్రాలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు కంటెంట్ తెచ్చిపెట్టినప్పటికీ, వెండితెర ఇచ్చే కిక్, కలెక్షన్ల వర్షం మాత్రం మిస్సయ్యాయని చెప్పక తప్పదు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More