OTT Release: ఓటీటీలోకి 2 రోజుల్లో 36 సినిమాలు, సిరీసులు- 20 చాలా స్పెషల్, నెట్‌ఫ్లిక్స్‌లో 17- తెలుగులో 13 ఇంట్రెస్టింగ్
OTT Release Movies New: ఓటీటీలోకి 2 రోజుల్లో 36 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 20 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్గా 13 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలేంటో లుక్కేద్దాం.
OTT Release Movies New: ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 36 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఫోక్ హారర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, యాక్షన్, కామెడీ, రొమాంటిక్ డ్రామా, థ్రిల్లర్స్ వంటి విభిన్న జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చిన ఆ సినిమాలు ఏంటో చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
బత్తా (తెలుగు డబ్బింగ్ తమిళ పీరియాడిక్ యాక్షన్ కామెడీ డ్రామా మూవీ)- అక్టోబర్ 29
బలరా: బ్లడ్ ఐలాండ్ (ఫిలిపినో ఫోక్ హారర్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 29
యూ, మీ, అజ్ (ఇటాలియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 29
ది ఫాల్ ఆఫ్ ఎల్ మయో సీజన్ 1 (ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ పొలిటికల్ ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబర్ 29
అవరచన్ & సన్స్ (తెలుగు డబ్బింగ్ మలయాళ డార్క్ కామెడీ ఫ్యామీలీ డ్రామా సినిమా)- అక్టోబర్ 30
ఎస్ఐ యుగంధర్ (తెలుగు క్రైమ్ యాక్షన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 30
అక్క (తెలుగు డబ్బింగ్ హిందీ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 30
సిగ్మా (తెలుగు తమిళ బైలింగువల్ యాక్షన్ హీస్ట్ క్రైమ్ కామెడీ డ్రామా సినిమా)- అక్టోబర్ 30
డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ (తెలుగు ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ డ్రామా చిత్రం)- అక్టోబర్ 30
హౌ టూ రూయిన్ దివాళి: మీట్ ది పేరెంట్స్ (సౌతాఫ్రికన్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 30
ఏ కపుల్ ఆఫ్ లైస్ (స్వీడిష్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 30
కొలిజన్ కోర్స్ (స్పానిష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 30
డెడ్ ఎండ్ జాబ్ (సౌత్ కొరియన్ హారర్ ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్)- అక్టోబర్ 30
మీథే మే క్యాన్ హై (హిందీ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 30
అబ్సెస్ (అరబ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 30
ఎస్సీటీవీ: ది గ్రేట్ షో యూ నెవర్ హియర్డ్ ఆఫ్ (ఇంగ్లీష్ కామెడీ డాక్యుమెంటరీ షో)- అక్టోబర్ 30
ది బర్త్ డే గిఫ్ట్ (జెర్మన్ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ)- అక్టోబర్ 30
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ఘోస్ట్ సీజన్ 6 (ఇంగ్లీష్ ఫాంటసీ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 29
లవ్ ఆల్వేస్ (తెలుగు డబ్బింగ్ తమిళ టైమ్ ట్రావెల్ ఫాంటసీ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 30
అబ్సెషన్: ది ఒరిజినల్ అన్ కట్ వెర్షన్ (ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ చిత్రం)- అక్టోబర్ 30
ది పర్ఫెక్ట్ లై (సౌత్ కొరియన్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 30
ది పాట్రిక్ స్టార్ షో సీజన్ 6 (ఇంగ్లీష్ యానిమేటెడ్ సిట్ కామ్ ఫ్యామిలీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 30
కల్డాస్: ఎల్ అల్టిమో బార్కో (స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 30
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
అపోకలిప్స్ జెడ్: న్యూ వరల్డ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ జాంబీ హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 30
డెక్ట్సర్: రిసరెక్షన్ సీజన్ 2 (ఇంగ్లీష్ సైకలాజికల్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 30
ది ట్రేటర్ వితిన్ (నార్వేజియన్ థ్రిల్లర్ వార్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 30
ది స్ట్రేంజర్స్ చాప్టర్ 3 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ స్లాషర్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్)- అక్టోబర్ 30
ది డార్క్ హెవెన్ (తమిళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 30 (ఆహా ఓటీటీలోనూ)
మీర్జాపూర్ ది మూవీ (హిందీ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- అక్టోబర్ 30
కామ్రేడ్ కళ్యాణ్ (తెలుగు పీరియాడిక్ యాక్షన్ కామెడీ డ్రామా చిత్రం)- అక్టోబర్ 30
తెల్లకాగితం (తెలుగు మ్యూజికల్ టీన్ రొమాంటిక్ డ్రామా మూవీ)- ఈటీవీ విన్ ఓటీటీ- అక్టోబర్ 29
ఇమ్మోర్టల్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- అక్టోబర్ 29
బోల్ బావీన్ న బోల్ (పంజాబీ రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ డ్రామా చిత్రం)- చౌపల్ ఓటీటీ- అక్టోబర్ 29
రుద్రవనం పీఎస్ (తెలుగు క్రైమ్ మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- అక్టోబర్ 30
కోల్డ్ కాల్ (తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ డ్రామా సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- అక్టోబర్ 30
నోక్టర్న్ (ఇంగ్లీష్ సైకలాజికల్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీ- అక్టోబర్ 30
ఓటీటీలోకి 36 సినిమాలు
ఇలా గురు, శుక్రవారాలు కలిపి రెండు రోజుల్లో ఏకంగా 36 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో తెల్లకాగితం, ఇమ్మోర్టల్, రుద్రవనం పీఎస్, కోల్డ్ కాల్, మీర్జాపూర్ ది మూవీ, కామ్రేడ్ కళ్యాణ్, ది స్ట్రేంజర్స్ చాప్టర్ 3, ది డార్క్ హెవెన్, లవ్ ఆల్వేస్, బత్తా, బలరా, అవరచన్ & సన్స్, ఎస్ఐ యుగంధర్, అబ్సెషన్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్‌గా 20, తెలుగులో 13 ఇంట్రెస్టింగ్
వీటితోపాటు అపోకలిప్స్ జెడ్, డెడ్ ఎండ్ జాబ్, అబ్సెస్, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, అక్క, సిగ్మాతో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 20 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులోనూ తెలుగులో మరింత ఇంట్రెస్టింగ్గా 13 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 17 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


