...
...
Next Story

OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో 12 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 6 మరింత ఇంట్రెస్టింగ్- ఆ రెండింట్లో 3, 3!

OTT Release Movies Telugu: ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో 12 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు అన్నీ స్పెషల్‌గానే ఉంటే.. తెలుగు స్ట్రయిట్ సినిమాలైన 6 ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హాట్‌స్టార్, ప్రైమ్, ఆహా, ఈటీవీ విన్ ఓటీటీల్లో విభిన్న జోనర్లలో ఉన్న ఆ సినిమాలేంటో చూద్దాం.

Published on: Nov 24, 2026, 15:30:28 IST
Advertisement

OTT Release Movies Telugu: ఓటీటీలోకి గత వారం తెలుగులో 12 సినిమాలు రిలీజ్ అయ్యాయి. జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, సన్ నెక్ట్స్, సోనీ లివ్, ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో విభిన్న జోనర్లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో లుక్కేద్దాం

జియో హాట్‌స్టార్ ఓటీటీ

ఓటీటీలోకి తెలుగులో 12 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 6 ఇంట్రెస్టింగ్-క్రైమ్ కామెడీ టు సర్వైవల్ థ్రిల్లర్
ఓటీటీలోకి తెలుగులో 12 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 6 ఇంట్రెస్టింగ్-క్రైమ్ కామెడీ టు సర్వైవల్ థ్రిల్లర్

మిస్టర్ & మిసెస్ ఆఫీస్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ వర్క్‌ప్లేస్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 18

కికు చిరంజీవి (తెలుగు సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- నవంబర్ 18

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ది ఒడిస్సీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హిస్టారికల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ వార్ డ్రామా సినిమా)- నవంబర్ 17 (రెంట్)

మడ్డెన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా వెబ్ సిరీస్)- నవంబర్ 18

మయూఖ (తెలుగు సైకలాజికల్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్)- నవంబర్ 20

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

418 (తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 20

హైకూ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- నవంబర్ 20

స్టెప్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యానిమేషన్ మ్యూజికల్ ఫ్యామిలీ కామెడీ ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్)- నవంబర్ 20

క్రేజీ కళ్యాణం (తెలుగు రూరల్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- ఆహా ఓటీటీ- నవంబర్ 20

అనుమాన పక్షి (తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- సన్ నెక్ట్స్ ఓటీటీ- నవంబర్ 20

అన్బిల్ అవన్ (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సర్వైవల్ డ్రామా చిత్రం)- సోనీ లివ్ ఓటీటీ- నవంబర్ 20

ఇలా గత వారం (నవంబర్ 16 నుంచి 22) ఓటీటీలోకి ఏకంగా 12 సినిమాలు తెలుగు భాషలో స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో చూసేందుకు అన్నీ చాలా స్పెషల్‌గానే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఇంట్రెస్టింగ్‌గా 6-రెండింట్లో 3, 3

కానీ, తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన అనుపమ పరమేశ్వరన్-తరుణ్ భాస్కర్ క్రేజీ కళ్యాణం, సర్వైవల్ థ్రిల్లర్ కికు చిరంజీవి, రాగ్ మయూర్ అనుమాన పక్షి, హారర్ థ్రిల్లర్ 418, పాయల్ చెంగప్ప మయూఖ, సీనియర్ హీరో సురేష్ రంగస్థలం వంటి 6 మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అలాగే, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీల్లో చెరో 3 సినిమాలు అందుబాటులో ఉన్నాయి.

 

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks