OTT Release Movies Today: వీకెండ్ రాగానే డిజిటల్ వినోదాన్ని కోరుకునే వారికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సరికొత్త కంటెంట్‌తో స్వాగతం పలుకుతున్నాయి. ఈ వారం డిజిటల్ ప్రేమికులను అలరించేందుకు నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్ సంస్థలు విభిన్న జోనర్లలో ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు, సినిమాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
ఇవాళే టాప్ 6 సినిమాలు

భయం గొలిపే హర్రర్ కథల నుంచి కంటిమీద కునుకు లేకుండా చేసే సస్పెన్స్ థ్రిల్లర్ల వరకు సరికొత్త కథలతో ఈ రెండు ఓటీటీల్లో ఇవాళ ఒక్కరోజే టాప్ 6 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఒకేదాంట్లో ఏకంగా 5 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
1. భయాన్ని పరిచయం చేసే 'అమెరికన్ హారర్ స్టోరీ: సీజన్ 13'
హారర్ కథలను ఇష్టపడే వారికి 'అమెరికన్ హారర్ స్టోరీ' ఒక ఐకానిక్ సిరీస్. ఇప్పటివరకు 12 విజయవంతమైన సీజన్లు పూర్తి చేసుకున్న ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పుడు 13వ సీజన్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఓటీటీ సిరీస్ ప్రతి సీజన్‌లోనూ కొత్త కథ, కొత్త పాత్రలతో భయాందోళనలను రేకెత్తిస్తుంది.
హత్యల నేపథ్యం ఉన్న వింత ఇల్లు, మానసిక చికిత్సాలయం, చేతబడులు చేసే డాక్యుమెంట్ల నుంచి క్రూరమైన గ్యాంగ్‌ల వరకు ప్రతి అంశాన్ని అత్యంత ఉత్కంఠభరితంగా ఇందులో తెరకెక్కించారు. హారర్, ఫాంటసీ అభిమానులకు ఈ సీజన్ విపరీతంగా నచ్చుతుంది.
నెట్‌ఫ్లిక్స్‌లో ఆకట్టుకుంటున్న డ్రామా, థ్రిల్లర్ సిరీస్‌లు
2. ఎ డిఫరెంట్ వరల్డ్: కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన కథలను ఇష్టపడే వారి కోసం 'ఎ డిఫరెంట్ వరల్డ్' అనే కొత్త సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. హిల్మన్ కాలేజ్ నేపథ్యంలో సాగే ఈ కథలో డెబోరా వేన్ అనే ప్రతిభావంతురాలైన అమ్మాయి తన జీవిత గమ్యాన్ని వెతుక్కునే ప్రయాణాన్ని వినోదాత్మకంగా చూపించారు.
{{/usCountry}}2. ఎ డిఫరెంట్ వరల్డ్: కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన కథలను ఇష్టపడే వారి కోసం 'ఎ డిఫరెంట్ వరల్డ్' అనే కొత్త సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. హిల్మన్ కాలేజ్ నేపథ్యంలో సాగే ఈ కథలో డెబోరా వేన్ అనే ప్రతిభావంతురాలైన అమ్మాయి తన జీవిత గమ్యాన్ని వెతుక్కునే ప్రయాణాన్ని వినోదాత్మకంగా చూపించారు.
{{/usCountry}}3. బలరావ్- బ్లడ్ ఐలాండ్: మిస్టరీ ప్రియుల కోసం 'బలరావ్: బ్లడ్ ఐలాండ్' ఓటీటీలోకి వచ్చేసింది. చిన్నతనంలో తల్లి అకస్మాత్తుగా మాయమైన తర్వాత, సబీనా అనే యువతి కుటుంబ రహస్యాలను ఛేదించేందుకు ఒక నిగూఢమైన దీవికి వెళ్తుంది. అక్కడ ఆమెకు ఎదురైన దిగ్భ్రాంతికరమైన నిజాలు ఏంటనేది ఈ డ్రామాలో ఉత్కంఠగా చూపించారు.
సస్పెన్స్, మర్డర్ మిస్టరీల ధమాకా
4. షాక్: ట్రస్ట్ నో వన్: సస్పెన్స్ కథలలో 'షాక్: ట్రస్ట్ నో వన్' వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆస్పత్రిలో జన్మించిన వెంటనే పోయిన తన బిడ్డ కోసం ఒక తల్లి తొమ్మిదేళ్ల పాటు జరిపిన సుదీర్ఘ పోరాటమే ఈ ఓటీటీ సిరీస్ ఇతివృత్తం. ఈ అన్వేషణలో ఆమెకు అత్యంత ఆప్తులైన వారి అసలు రంగు బయటపడటం, ఊహించని మలుపులు రావడం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఇది తెలుగులో కూడా ఓటీటీ రిలీజ్ అయింది.
5. డెల్యూషన్: ఈ థ్రిల్లర్ సిరీస్ ఒక చిన్న పల్లెటూర్లో జరిగే దారుణ హత్యల చుట్టూ తిరుగుతుంది. డిమెన్షియాతో బాధపడుతున్న తండ్రిపై పడిన నిందను తొలగించేందుకు ఒక ఉపాధ్యాయురాలు చేసే సాహసోపేతమైన పోరాటం ఇందులో కనిపిస్తుంది. గ్రామస్తుల మూఢనమ్మకాలు, దెయ్యాల భయాల నడుమ నిజం తెలుసుకునేందుకు ఆమె పడే తాపత్రయం ఆకట్టుకుంటుంది.
6. మై సాడ్ డెడ్: చనిపోయిన ఆత్మలను చూడగలిగే ఎమ్మా అనే మహిళ కథతో తెరకెక్కిన సిరీస్ 'మై సాడ్ డెడ్' కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. దెయ్యాలను చూడగలిగే ఎమ్మా దగ్గరికి తన మేనకోడలు వస్తుంది. ఆమె వెయ్యేళ్ల క్రితమే ఆమె చనిపోయినట్లుగా ఎమ్మాకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైందనేదే మిగతా కథ.
ఒకేదాంట్లో 5
ఓటీటీలో వీకెండ్‌లో కుటుంబంతో కలిసి డిజిటల్ స్క్రీన్లపై క్రైమ్, హర్రర్ కథలను వీక్షించాలనుకునే వారికి ఈ టాప్ 6 సినిమాలు బెస్ట్ ఛాయిస్. ఇందులో క్రైమ్, ఫాంటసీ, హారర్, కామెడీ, సస్పెన్స్ వంటి అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఒక్క నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనే 5 మూవీస్ అందుబాటులో ఉండటం విశేషం.