...
...
Next Story

OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు- 12 చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- ఆ రెండింట్లో 5, 5!

Friday OTT Releases Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 20 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 12 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయితే అందులో 5 తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలేంటో చూద్దాం.

Published on: Nov 6, 2026, 19:31:04 IST
Advertisement

OTT Release Movies Today Friday: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్ థ్రిల్లర్ నుంచి క్రైమ్ ఫాంటసీ వరకు విభిన్న జోనర్లలో ఓటీటీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, సన్ నెక్ట్స్, నెట్‌ఫ్లిక్స్, ఆహా, జీ5, సోనీ లివ్ వంటి తదితర ఓటీటీలో ఈ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు- 12 చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- ఆ రెండింట్లో 5, 5!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు- 12 చాలా స్పెషల్, తెలుగులో 5 ఇంట్రెస్టింగ్- ఆ రెండింట్లో 5, 5!

ఆల్ పాస్ (తమిళ చిత్రం)- నవంబర్ 06

ది వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ (హిందీ సినిమా)- నవంబర్ 06

ఓట్టమ్‌ తుల్లాల్ (మలయాళ మూవీ)- నవంబర్ 06

క్యాంపస్ డ్రైవర్స్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 06

డెవిల్స్ క్రెస్ట్ (జపనీస్ యానిమేటెడ్ వెబ్ సిరీస్)- నవంబర్ 06

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

కౌరిబురీర్ మందిర్ (బెంగాలీ సిరీస్)- నవంబర్ 06

పాసిబుల్ లవ్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ మూవీ)- నవంబర్ 06

అండర్ సీజ్ (కొలంబియన్ సిరీస్)- నవంబర్ 06

అన్‌ప్రొటెక్టెడ్: మర్డర్ ఇన్ గెలీసియా (స్పానిష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ)- నవంబర్ 06

ఫన్నీ మనీ: ది డేన్ కుక్ స్టోరీ (ఇంగ్లీష్ బయోకగ్రఫీ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ)- నవంబర్ 06

సన్ నెక్ట్స్ ఓటీటీ

బా బా బ్లాక్ షీప్ (తెలుగు సినిమా)- నవంబర్ 06

ఐసీయూ: అంటిల్ ది లాస్ట్ బ్రీత్ (మలయాళ సినిమా)- నవంబర్ 06

ది గ్రాండ్ మాస్టర్ (తమిళ సినిమా)- నవంబర్ 06

జీ5 ఓటీటీ

లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్ (హిందీ చిత్రం)- నవంబర్ 06

హైవాన్ (హిందీ మూవీ)- నవంబర్ 06

మీసయ మురుక్కు 2 (తెలుగు డబ్బింగ్ సినిమా)- నవంబర్ 06

జియో హాట్‌స్టార్ ఓటీటీ

ఐ యామ్ గేమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా)- నవంబర్ 06

ఆహా ఓటీటీ

7 స్టార్ బాయ్స్ (తమిళ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్)- నవంబర్ 06

యాపిల్ టీవీ ప్లస్ ఓటీటీ

అక్వాఫినా: ది అన్‌లైక్‌లీ కుక్ (Awkwafina: The Unlikely Cook) (ఇంగ్లీష్ రియాలిటీ డాక్యుమెంటరీ)- నవంబర్ 06

వేవ్స్ ఓటీటీ

నోటీస్ (హిందీ సోషల్ డ్రామా సినిమా)- నవంబర్ 06

ఓటీటీలోకి ఇవాళ 20 సినిమాలు

ఇలా ఇవాళ శుక్రవారం (నవంబర్ 06) ఏకంగా 20 సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిలో చూసేందుకు దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్, తమన్నా ది వాన్, సైఫ్ అలీ ఖాన్-అక్షయ్ కుమార్ హైవాన్, హిప్‌హాప్ తమిళ మీసయ మురుక్కు 2, తెలుగు క్రైమ్ కామెడీ బా బా బ్లాక్ షీప్ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

వీటితోపాటు నూర్ కోడివానవిళ్, లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్, ఐసీయూ, పాసిబుల్ లవ్, ఓట్టమ్‌ తుల్లాల్, క్యాంపస్ డ్రైవర్స్, ఆల్ పాస్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 12 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులోనూ తెలుగులో మరింత ఇంట్రెస్టింగ్‌గా 5 సినిమాలు మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీల్లో చెరో 5 చొప్పున సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks