బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. ఈ పేర్లు వింటేనే వెండితెరపై ఒక మెరుపు కనిపిస్తుంది. వీరిద్దరితో ఒక్క సినిమా అయినా చేయాలని ఎంతోమంది రచయితలు, దర్శకులు ఏళ్ల తరబడి నిరీక్షిస్తుంటారు. అయితే, ప్రస్తుత ట్రెండ్‌కు భిన్నంగా ఆలోచించే దర్శకులు కూడా పరిశ్రమలో ఉన్నారు.
సూపర్ హిట్ ఓటీటీ సిరీస్‌లతో

‘పాతాళ లోక్’, ‘కోహ్రా’ వంటి సూపర్ హిట్ ఓటీటీ సిరీస్‌లతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రచయిత-దర్శకుడు సుదీప్ శర్మ. తాజాగా షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌తో కలిసి సినిమా చేయాలనే ఇంట్రెస్ట్ తనకు ఏమాత్రం లేదని డైరెక్టర్ సుదీప్ శర్మ చెప్పడం షాకింగ్‌గా మారింది. అందుకు గల కారణాలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.
“స్టార్ల ఇమేజ్ కంటే కథే ముఖ్యం”
డిజిటల్ కామెంటరీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుదీప్ శర్మ తన మనసులోని మాటను బయటపెట్టారు. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి సూపర్ స్టార్లతో పనిచేసే కల మీకు కూడా ఉందా? అని అడిగిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమిచ్చారు.
“లేదు, నాకు ఎప్పుడూ అలాంటి కోరిక కలగలేదు. అందుకే నేను ఎప్పుడూ ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. నేను ఇక్కడికి వచ్చింది ఒక స్టార్‌తో సినిమా చేయడం కోసం కాదు.. నాకు నచ్చిన కథను, నేను చూసి ఇష్టపడిన సినిమాల తరహాలో చెప్పడం కోసం వచ్చాను” అని సుదీప్ శర్మ స్పష్టం చేశారు.
ఆ పని చేయడం చేతకాదు
అంతేకాదు, ఒకవేళ అలాంటి అవకాశం వస్తే భయమేస్తుందని కూడా ఆయన నిజాయతీగా ఒప్పుకున్నారు. “స్టార్లు అంటే వారికి ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్‌కు తగ్గట్లుగా మనం కథను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ పని చేయడం నాకు చేతకాదు” అని సుదీప్ శర్మ అన్నారు.
{{/usCountry}}అంతేకాదు, ఒకవేళ అలాంటి అవకాశం వస్తే భయమేస్తుందని కూడా ఆయన నిజాయతీగా ఒప్పుకున్నారు. “స్టార్లు అంటే వారికి ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్‌కు తగ్గట్లుగా మనం కథను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ పని చేయడం నాకు చేతకాదు” అని సుదీప్ శర్మ అన్నారు.
{{/usCountry}}“నేను ఒక పాత్రను రాస్తే.. ఆ పాత్రలో నటుడు ఒదిగిపోవాలి తప్ప, నటుడి కోసం పాత్ర మారకూడదు. ఫ్యాన్స్ ఏమనుకుంటారు? స్టార్‌డమ్ దెబ్బతింటుందా? అనే బాధ్యతలు నాకు వద్దు. సినిమా కంటే స్టార్ గురించే చర్చ ఎక్కువ జరిగే చోట నాకు ఆసక్తి ఉండదు” అని సుదీప్ శర్మ వివరించారు.
సుదీప్ శర్మ నేపథ్యం
ఇదిలా ఉంటే, అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటించిన ‘NH10’ చిత్రంతో సుదీప్ శర్మ రచయితగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. గౌరవ హత్యల నేపథ్యంలో వచ్చిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఆ తర్వాత ‘ఉడ్తా పంజాబ్’, ‘సోన్ చిరియా’ వంటి సినిమాలకు సుదీప్ శర్మ పనిచేశారు. అయితే, ఈ సినిమాలు విమర్శకులను మెప్పించినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు.
ఓటీటీ వేదికపై
కానీ, ఓటీటీ (OTT) వేదికగా ఆయన సృష్టించిన ‘పాతాళ్ లోక్’, ‘కోహ్రా’ సిరీస్‌లు సుదీప్ శర్మను స్టార్ మేకర్‌గా నిలబెట్టాయి. తాజాగా విడుదలైన ‘కోహ్రా సీజన్ 2’ నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్ టాప్-10 లిస్టులోకి చేరి సంచలనం సృష్టించింది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
కోహ్రా సీజన్ 2 ఓటీటీ రిలీజ్ అయిన మొదటి వారంలోనే 16 లక్షల మంది వీక్షించడం విశేషం. బరుణ్ సోబ్తీ, మోనా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.