OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 14 సినిమాలు- అన్నీ స్పెషల్, ఒకేదాంట్లో 6 స్ట్రీమింగ్- 5 మాత్రం చాలా ఇంట్రెస్టింగ్!

OTT Telugu Movies: ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు అన్నీ స్పెషల్‌గా ఉండగా.. ఐదు తెలుగు స్ట్రయిట్ సినిమాలు ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక ఒక్క ఓటీటీలోనే ఏకంగా 6 సినిమాలు ప్రీమియర్ అవడం విశేషం. ఆ ఓటీటీ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

Published on: Feb 2, 2026, 05:40:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి గత వారం తెలుగులో ఏకంగా 14 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో హారర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా, ఫ్యామిలీ ఎమోషనల్, కామెడీ అడ్వెంచర్ వంటి అన్ని రకాల జోనర్స్ ఉన్నాయి.

ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 14 సినిమాలు- అన్నీ స్పెషల్, ఒకేదాంట్లో 6 స్ట్రీమింగ్- 5 మాత్రం చాలా ఇంట్రెస్టింగ్!
ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 14 సినిమాలు- అన్నీ స్పెషల్, ఒకేదాంట్లో 6 స్ట్రీమింగ్- 5 మాత్రం చాలా ఇంట్రెస్టింగ్!

నెట్‌ఫ్లిక్స్ టు ఆహా

అలాగే, ఈ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్, సన్ నెక్ట్స్, జియో హాట్‌స్టార్, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఛాంపియన్ (తెలుగు పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 29

బ్రిడ్జర్‌టన్ సీజన్ 4 పార్ట్ 1 (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 29

ధురంధర్ (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 30

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

వా వాతియార్ (తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ కామెడీ ఫాంటసీ ఫిల్మ్)- జనవరి 28

ది వ్రెకింగ్ క్య్రూ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ మూవీ)- జనవరి 28

అనకొండ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ కామెడీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- జనవరి 29

దల్ దల్ (తెలుగు డబ్బింగ్ హిందీ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 30

గత వైభవ (తెలుగు డబ్బింగ్ కన్నడ ఫాంటసీ హిస్టారికల్ రొమాంటిక్ డ్రామా సినిమా)- జనవరి 30

ర్యాబిట్ ట్రాప్ (తెలుగు డబ్బింగ్ బ్రిటీష్ సైకలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- జనవరి 30

ఈటీవీ విన్ ఓటీటీ

కానిస్టేబుల్ (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 29

జ్యోతి (తెలుగు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 1

సర్వం మాయ (తెలుగు డబ్బింగ్ మలయాళ హారర్ కామెడీ ఫాంటసీ డ్రామా సినిమా)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- జనవరి 30

పతంగ్ (తెలుగు రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా చిత్రం)- సన్ నెక్ట్స్ ఓటీటీ- జనవరి 30

డ్రైవ్ (తెలుగు సైబర్ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ ఫిల్మ్)- ఆహా ఓటీటీ- జనవరి 30

ఓటీటీలోకి తెలుగులో 14

ఇలా గత వారం (జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1 వరకు) తెలుగు భాషలో ఏకంగా 14 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో అన్ని సినిమాలు దాదాపుగా స్పెషల్‌గానే ఉన్నాయి.

ఇంట్రెస్టింగ్‌గా 5

అయితే, తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన ఛాంపియన్, కానిస్టేబుల్, పతంగ్, డ్రైవ్, జ్యోతి 5 చాలా ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇక గత వారం నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న 14 తెలుగు మూవీస్‌లో ఒక్క అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనే ఆరు సినిమాలు ప్రీమియర్ కావడం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More