Parineeti Chopra On OTT Re Entry And Cancelling Mothers: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. గతేడాది అక్టోబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమె, ఇప్పుడు 'షాక్' (Shaque) అనే సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు ఓటీటీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.
ఓటీటీ సిరీస్, రీ ఎంట్రీపై హీరోయిన్

ముంబైలో జరిగిన ఈ షాక్ ఓటీటీ సిరీస్ ట్రైలర్ విడుదల వేడుకలో తన వ్యక్తిగత జీవితం, రీ ఎంట్రీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధాను వివాహం చేసుకున్న పరిణీతి, గతేడాది తల్లిగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
తల్లిగా మారినంత మాత్రానా కెరీర్ ముగిసిపోదు
చివరిగా ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన 'అమర్ సింగ్ చమ్కీలా' చిత్రంలో నటించి మంచి ప్రశంసలు అందుకున్నారామె. ఇప్పుడు 'షాక్' ద్వారా ఓటీటీ తెరపైకి అడుగుపెడుతున్నారు. తల్లిగా మారినంత మాత్రాన నటీమణుల కెరీర్ ముగిసిపోదని, ప్రేక్షకులు కూడా ఈ మార్పును ఎంతో సానుకూలంగా స్వీకరిస్తున్నారని పరిణీతి ఆనందం వ్యక్తం చేశారు.
తల్లిగా మారినా తగ్గని అవకాశాలు
ఒకప్పుడు పెళ్లై, పిల్లలు పుడితే హీరోయిన్లకు అవకాశాలు తగ్గేవి. కానీ నేటి బాలీవుడ్‌లో ఆ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. షాక్ ట్రైలర్ లాంచ్ వేడుకలో పరిణీతి మాట్లాడుతూ.. "నేను తల్లినయ్యాక నా దగ్గరకు వచ్చిన ఏ దర్శకుడు లేదా నిర్మాత కూడా నా మాతృత్వాన్ని బూచీగా చూపిస్తూ అవకాశాలు తగ్గించలేదు. మాతృత్వం అనేది ఒక అందమైన అనుభూతి. బిడ్డకు జన్మనిచ్చినంత మాత్రాన నాకు లభించే మంచి పాత్రలను కోల్పోవాల్సి వస్తే తీవ్రంగా బాధపడేదాన్ని. కానీ పరిశ్రమ నా నిర్ణయాన్ని గౌరవించింది" అని పేర్కొన్నారు.
ప్రేక్షకుల వైఖరిలో పెద్ద మార్పు
ప్రేక్షకులు నటీమణులను కేవలం పాత్రలపరంగానే చూస్తున్నారని, తల్లి అయినంత మాత్రాన పక్కన పెట్టేయడం లేదని పరిణీతి చోప్రా తెలిపారు. "చిత్రసీమకు ప్రేక్షకులే ఆయువుపట్టు. డిమాండ్ అండ్ సప్లై ప్రాతిపదికన ఈ రంగం నడుస్తుంది. ప్రేక్షకులు నటీమణులపై చూపిస్తున్న ప్రేమాభిమానాల వల్లే రచయితలు, దర్శకులు సరికొత్త కథలతో మా దగ్గరకు రాగలుగుతున్నారు" అని వ్యాఖ్యానించారు పరిణీతి చోప్రా.
అలియా, దీపికా, ప్రియాంక బాటలోనే..
{{/usCountry}}ప్రేక్షకులు నటీమణులను కేవలం పాత్రలపరంగానే చూస్తున్నారని, తల్లి అయినంత మాత్రాన పక్కన పెట్టేయడం లేదని పరిణీతి చోప్రా తెలిపారు. "చిత్రసీమకు ప్రేక్షకులే ఆయువుపట్టు. డిమాండ్ అండ్ సప్లై ప్రాతిపదికన ఈ రంగం నడుస్తుంది. ప్రేక్షకులు నటీమణులపై చూపిస్తున్న ప్రేమాభిమానాల వల్లే రచయితలు, దర్శకులు సరికొత్త కథలతో మా దగ్గరకు రాగలుగుతున్నారు" అని వ్యాఖ్యానించారు పరిణీతి చోప్రా.
అలియా, దీపికా, ప్రియాంక బాటలోనే..
{{/usCountry}}తనతోటి కథానాయికలైన అలియా భట్, దీపికా పదుకొణెతో పాటు తన సోదరి ప్రియాంక చోప్రా బాటలోనే తాను పయనిస్తున్నట్లు పరిణీతి చెప్పారు. "గతంలో నటీమణులు పెళ్లైతే కెరీర్‌ను త్యాగం చేయాల్సి వచ్చేది. కానీ మా తరం హీరోయిన్లు ఆ పరిస్థితులను పూర్తిగా మార్చేశారు. అలియా, దీపికా, ప్రియాంక, నేను.. అందరం మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అత్యుత్తమ సినిమాలు చేస్తున్నాం. నిజం చెప్పాలంటే మునుపటి కంటే ఇప్పుడు మరింత మెరుగైన ప్రదర్శన ఇస్తున్నాం" అని చెప్పుకొచ్చారు.
'షాక్' కథేంటి?
రెన్సిల్ డిసిల్వా, సిద్ధార్థ్ పి మల్హోత్రా సృష్టించిన 'షాక్' సిరీస్‌లో పరిణీతి మిస్సింగ్ చైల్డ్ కోసం వెతికే తల్లి పాత్రలో కనిపిస్తారు. సోనీ రజ్దాన్, అనూప్ సోని, జెన్నిఫర్ వింగెట్, తాహిర్ రాజ్ భసిన్, హర్లీన్ సేథీ, సుమీత్ వ్యాస్ కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో షాక్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.