...
...
Next Story

Police Complaint Review: పోలీస్ కంప్లైంట్ రివ్యూ- కర్మ సిద్ధాంతో భయపెట్టే వరలక్ష్మీ, నవీన్ చంద్ర హారర్ యాక్షన్ థ్రిల్లర్

Police Complaint Movie Review And Rating In Telugu: వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో సంజీవ్ మేగోటి తెరకెక్కించిన హారర్ యాక్షన్ థ్రిల్లర్ పోలీస్ కంప్లైంట్ థియేటర్లలోకి వచ్చింది. కర్మ సిద్ధాంతంతో సాగే ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో నేటి పోలీస్ కంప్లైంట్ రివ్యూలో చూద్దాం.

Published on: Jun 13, 2026, 05:32:55 IST
Advertisement

Police Complaint Review In Telugu And Rating: హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా హాలీవుడ్‌లో తెరకెక్కుతుంటాయి. అలాంటి జోనర్‌లో తెలుగులో వచ్చిన లేటెస్ట్ సినిమానే పోలీస్ కంప్లైంట్. ఈ సినిమాలో పాపులర్ నటి వరలక్ష్మి శరత్ కుమార్, హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు.

పోలీస్ కంప్లైంట్ రివ్యూ

పోలీస్ కంప్లైంట్ రివ్యూ- కర్మ సిద్ధాంతో భయపెట్టే వరలక్ష్మీ, నవీన్ చంద్ర హారర్ యాక్షన్ థ్రిల్లర్
పోలీస్ కంప్లైంట్ రివ్యూ- కర్మ సిద్ధాంతో భయపెట్టే వరలక్ష్మీ, నవీన్ చంద్ర హారర్ యాక్షన్ థ్రిల్లర్

కృష్ణసాయి, రాగిణి ద్వివేది, పి. రవిశంకర్, జెమినీ సురేష్, శ్రీనివాస్ రెడ్డి, బబ్లూ పృథ్వీరాజ్, బిగ్ బాస్ ఆదిత్య ఓం తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. హారర్, సస్పెన్స్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్, యాక్షన్ వంటి ఎలిమెంట్స్‌తో పోలీస్ కంప్లైంట్ సినిమాను డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకెక్కించారు.

ఎంఈఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించిన ఈ సినిమా జూన్ 12న థియేటర్లలో విడుదల అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి పోలీస్ కంప్లైంట్ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

ఒక గర్భిణి మహిళ దారుణ హత్యతో పోలీస్ కంప్లైంట్ సినిమా ప్రారంభమవుతుంది. క్షుద్రపూజల కోణంలో జరిగినట్లు భావించే ఈ హత్య కేసు ఎలాంటి పురోగతి లేక ఏళ్ల తరబడి పోలీస్ రికార్డుల్లో మూలన పడిపోతుంది. అయితే అద్వైత అనే ఒక చిన్నారి పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన 'డాడీ కావాలి' అంటూ కంప్లైంట్ ఇవ్వడంతో కథ ఊహించని మలుపు తిరుగుతుంది.

ఆ పాప ఎవరినైతే డాడీ అని పిలుస్తుందో, వాళ్లంతా వరుసగా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ సీరియల్ మరణాల మిస్టరీని ఛేదించే బాధ్యతను ఒక నిబద్ధత గల పోలీస్ అధికారిణి చేపడుతుంది. ఈ కేసు దర్యాప్తు చేసే క్రమంలో ఆమెకు తన భర్త, డాక్టర్ రామ్ మోటివేట్ చేస్తాడు.

ట్విస్టులు

దర్శకుడు సంజీవ్ మేగోటి పోలీస్ కంప్లైంట్ సినిమాకు "చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ" అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. మనం చేసే పాపపుణ్యాల ఫలితం మనల్ని ఎలా వెంటాడుతుందనే కథాంశానికి హారర్, మిస్టరీ, యాక్షన్, ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్‌ను జోడించి కథను నడిపించిన తీరు బాగుంది. మూఢనమ్మకాలు, అవినీతి, సమాజంలో దాగి ఉన్న నేరాల చుట్టూ కథను అల్లారు.

సినిమా మొదటి భాగం మొత్తం కేసు దర్యాప్తు, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత కథనంలో వేగం పెరుగుతుంది. విచారణలో బయటపడే ఒక్కో రహస్యం ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌లు థ్రిల్లర్ ప్రియులను మెప్పిస్తాయి. ముఖ్యంగా పాప తండ్రి అని చెప్పిన వారంతా చనిపోవడం, దానికి తగినట్లుగా సాగే సీన్స్ మంచి థ్రిల్ ఇస్తాయి.

సాగదీతల లవ్ ట్రాక్

అయితే, వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర మధ్య వచ్చే లవ్ ట్రాక్ సాగదీతలా అనిపిస్తుంది. కథకు అడ్డు తగిలినట్లుగా ఉంటుంది. రీల్స్ పిచ్చే ఉండే ఎస్సై ఇన్వెస్టిగేషన్ చేసే తీరు కాస్తా కామెడీగా మెప్పిస్తుంది. కథకు తగినట్లుగా వచ్చే హారర్ సీన్లు ఉత్కంఠను రేపుతాయి.

అయితే, అదంతా చేస్తుంది ఎవరు అనేది చాలా వరకు గెస్ చేసేలా ఉండటం మైనస్ అని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంటుంది. కాకపోతే అది కొంచెం ఊహించేలా ఉంటుంది. అయితే, ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. హారర్ సీన్లు, రాత్రి పూట వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్‌ను విజువల్‌గా బాగా చూపించారు.

దర్శకుడిగా సక్సెస్

ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. అనుగోజు రేణుకా బాబు ఎడిటింగ్ పర్వాలేదు. హారర్ యాక్షన్ ఇన్వెస్టిగేషన్ మిస్టరీ అంశాలతో పోలీస్ కంప్లైంట్‌ను తీర్చిదిద్దడంలో డైరెక్టర్ సంజీవ్ మేగోటి దాదాపుగా సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు.

నవీన్ చంద్ర, వరలక్ష్మిల పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్

ఇక నవీన్ చంద్ర మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. నెగెటివ్, పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు పెద్ద అసెట్ అని చెప్పవచ్చు. పోలీస్ అధికారిణిగా వరలక్ష్మి శరత్‌కుమార్ తన అనుభవాన్ని అంతా ఉపయోగించి పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో ఆమె నటన కంటితడి పెట్టించడమే కాకుండా రీల్స్ పిచ్చి ఉన్న పోలీస్‌గా చేసే కామెడీ ఆకట్టుకుంటుంది.

కృష్ణసాయి తన పాత్ర పరిధి మేర చక్కగా నటించారు. సూపర్‌స్టార్ కృష్ణకు నివాళిగా సినిమాలో పెట్టిన ఐటమ్ సాంగ్ అభిమానులను అలరిస్తుంది. రాగిణి ద్వివేది తన గ్లామర్‌తో పాటు నటనతోనూ ఆకట్టుకుంది. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి కామెడీ ట్రాక్ సినిమాలోని సీరియస్‌నెస్‌ను తగ్గించి కాస్త ఉపశమనం ఇస్తుంది. పోలీసు పాత్రల్లో కనిపించిన జెమిని సురేష్, విజయభాస్కర్ నటనతో మెప్పించారు.

హారర్ సినిమాలను ఇష్టపడేవారికి

పి రవిశంకర్, పృథ్వీ బబ్లూ తమ పరిధిమేర ఆకట్టుకున్నారు. ఫైనల్‌గా చెప్పాలంటే క్లైమాక్స్ ట్విస్ట్‌లు, నటీనటుల ప్రతిభ, హారర్ ఎలిమెంట్స్ సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. హారర్, సస్పెన్స్ సినిమాలను ఇష్టపడే వారికి 'పోలీస్ కంప్లైంట్' థియేటర్లలో ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.

రేటింగ్: 2.75/5

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe