హాలీవుడ్ అవార్డుల సందడి మొదలైంది. లాస్ ఏంజిల్స్‌లోని బెవర్లీ హిల్స్‌లో ఆదివారం (జనవరి 11) రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) 83వ వార్షిక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2026 వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ గోల్డెన్ గ్లోబ్స్ వేడుకల్లో గ్లోబల్ స్టార్, భారతీయ నటి, వారణాసి హీరోయిన్ ప్రియాంకా చోప్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అవార్డ్ ప్రజెంటర్‌గా ప్రియాంక

ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్స్ 2026కి అవార్డు ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా విచ్చేసింది. అయితే ప్రియాంక తన భర్త, ప్రముఖ సింగర్ నిక్ జోనాస్‌తో కలిసి గోల్డెన్ గ్లోబ్స్ 2026 రెడ్ కార్పెట్‌పై రొమాంటిక్‌గా మెరిశారు. ఇద్దరు కలిసి రెడ్ కార్పెట్‌పై రొమాంటిక్ పోజుతో అందరిని అట్రాక్ట్ చేశారు.
రెడ్ కార్పెట్‌పై ‘నమస్తే’..
నీలి రంగు ఆఫ్-షోల్డర్ గౌనులో ప్రియాంక చోప్రా దేవకన్యలా మెరిసిపోతుంటే, నిక్ జోనాస్ బ్లాక్ టక్సేడోలో ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. వేదిక వద్దకు రాగానే ప్రియాంక తనదైన శైలిలో ‘నమస్తే’ అంటూ అభిమానులకు, మీడియా ప్రతినిధులకు అభివాదం చేశారు.
ప్రియాంక, నిక్ రొమాంటిక్ సీన్
ఫోటోలకు ఫోజులిస్తున్న సమయంలో ప్రియాంక జుట్టు కాస్త చెదిరితే, నిక్ దగ్గరకు వచ్చి ఎంతో ప్రేమగా దానిని సరిచేశారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ రెడ్ కార్పెట్‌పై మెరిసిన ఆ మధుర క్షణాన్ని, రొమాంటిక్ సీన్‌ను అక్కడున్న ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించారు.
వీడియోపై కామెంట్స్
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "నిక్ నిజంగా పర్‌ఫెక్ట్ హస్బండ్.. వారి మధ్య ప్రేమ చూడముచ్చటగా ఉంది" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
గోల్డెన్ గ్లోబ్స్ 2026 విశేషాలు
ఈసారి గోల్డెన్ గ్లోబ్స్ కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. లియోనార్డో డికాప్రియో నటించిన పొలిటికల్ డ్రామా ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనెదర్’ (One Battle After Another), అలాగే హారర్ చిత్రం ‘సిన్నర్స్’ (Sinners) ఈ ఏడాది అవార్డుల రేసులో ముందున్నాయి.
ఫిల్మ్ క్రిటిక్స్‌తో
{{/usCountry}}ఈసారి గోల్డెన్ గ్లోబ్స్ కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. లియోనార్డో డికాప్రియో నటించిన పొలిటికల్ డ్రామా ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనెదర్’ (One Battle After Another), అలాగే హారర్ చిత్రం ‘సిన్నర్స్’ (Sinners) ఈ ఏడాది అవార్డుల రేసులో ముందున్నాయి.
ఫిల్మ్ క్రిటిక్స్‌తో
{{/usCountry}}టెలివిజన్ విభాగంలోనూ గట్టి పోటీ నెలకొంది. హెచ్‌బీఓ వారి బ్లాక్ కామెడీ ‘ది వైట్ లోటస్’, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘సెవెరెన్స్’, టీనేజ్ మర్డర్ మిస్టరీ ‘అడోలెసెన్స్’ ఓటీటీ సిరీస్‌లు నామినేషన్లలో అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ క్రిటిక్స్ ఈసారి విజేతలను ఎంపిక చేసే ప్రక్రియలో భాగస్వాములను చేయడం విశేషం.
1300 కోట్లతో వారణాసి
ఇక బ్యూటిఫుల్ ప్రియాంక చోప్రా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో వారణాసి మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ. 1300 కోట్లు అని టాక్ నడుస్తోంది.