పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీగా ఉంది. అయితే, ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ రాశీ ఖన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అయితే, రాశీ ఖన్నా కేవలం తన పాత్ర గురించి మాత్రమే కాకుండా, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు, యుద్ధం వంటి విషయాలు సినిమా పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై చాలా లోతైన విశ్లేషణ చేశారు.
యుద్ధం-ద్రవ్యోల్బణం: రాశీ ఖన్నా ఆందోళన
అమెరికా,ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ.. "మనం ఒక యుద్ధ కాలంలో ఉన్నాం. దీనివల్ల భవిష్యత్తులో ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) ఎంత దారుణంగా ఉండబోతుందో చాలామంది గ్రహించడం లేదు" అని తెలిపారు.
"నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని, కాబట్టి నాకు తెలుసు.. సామాన్యుడికి సినిమా అనేది ఒక లగ్జరీ. చేతిలో డబ్బులు లేనప్పుడు, తన ప్రాధాన్యతల్లో సినిమా మొదటి స్థానంలో ఉండదు" అని రాశీ ఖన్నా కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
థియేటర్ల భవిష్యత్తుపై ప్రశ్నలు
ప్రస్తుతం ప్రేక్షకులు కేవలం భారీ బడ్జెట్ సినిమాల కోసమే థియేటర్లకు వస్తున్నారని, చిన్న, మధ్యతరహా సినిమాల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని రాశీ ఖన్నా అభిప్రాయపడ్డారు.
"యుద్ధం ముదిరి ధరలు పెరిగి, ఆర్థిక ఇబ్బందులు వస్తే థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య మరింత తగ్గుతుంది. అప్పుడు ఓటీటీలు మరింత శక్తివంతంగా మారతాయి. ఇదే మన భవిష్యత్తు కాబోతోంది" అని రాశీ ఖన్నా పేర్కొన్నారు.
పరిశ్రమలో ఇప్పటికే మొదలైన మార్పులు
యుద్ధం, ఇంధన కొరత ప్రభావం ఇప్పటికే బెంగాలీ, మలయాళ చిత్ర పరిశ్రమలపై పడింది. ఎల్పీజీ గ్యాస్ కొరత వల్ల అవుట్డోర్ షూటింగుల్లో వంట కోసం కట్టెలు లేదా ఇండక్షన్ స్టవ్‌లను వాడుతున్నారనే వార్తలు సినిమా బడ్జెట్లపై పెరుగుతున్న ఒత్తిడికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
మార్చి 19న బాక్సాఫీస్ ఫైట్
{{/usCountry}}యుద్ధం, ఇంధన కొరత ప్రభావం ఇప్పటికే బెంగాలీ, మలయాళ చిత్ర పరిశ్రమలపై పడింది. ఎల్పీజీ గ్యాస్ కొరత వల్ల అవుట్డోర్ షూటింగుల్లో వంట కోసం కట్టెలు లేదా ఇండక్షన్ స్టవ్‌లను వాడుతున్నారనే వార్తలు సినిమా బడ్జెట్లపై పెరుగుతున్న ఒత్తిడికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
మార్చి 19న బాక్సాఫీస్ ఫైట్
{{/usCountry}}ఇదిలా ఉంటే, రాశీ ఖన్నా ఈ ఏడాది వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ‘తెలుసు కదా’, ‘120 బహదూర్’ వంటి చిత్రాలతో అలరించిన రాశీ ఖన్నా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్‌గా చేసింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్, శ్రీలీలతో కలిసి రాశీ స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 19న విడుదల కానుంది. అదే రోజున రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధరందర్: ది రివెంజ్’ కూడా రిలీజ్ కానుంది. దీంతో ఆరోజున బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో తెల్లవారుజామున 4 గంటలకే ఉస్తాద్ భగత్ సింగ్ బెనిఫిట్ షోలు పడనుండటంతో మెగా ఫ్యాన్స్‌లో సందడి నెలకొంది.
ఓటీటీ సినిమాలు, సిరీస్‌లతో
వీటితో పాటు ‘ఫర్జీ 2’, ‘తలాఖోన్ మే ఏక్’ వంటి ఓటీటీ వెబ్ సిరీస్‌లు, సినిమాలతో రాశీ ఖన్నా తన సత్తా చాటుతోంది. యుద్ధ నీడలు ఉన్నప్పటికీ, తన సినిమాలు ప్రేక్షకులను అలరిస్తాయన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.