...
...
Next Story

దీపికా పదుకొణె బాటలోనే తెలుగు హీరోయిన్- 12 గంటలు మాత్రమే షూటింగ్ చేస్తా, అలా ఇండస్ట్రీ మారాలన్న రాధిక ఆప్టే!

సినిమా ఇండస్ట్రీలో లాంగ్ షిఫ్ట్ షూటింగ్‌పై తెలుగు హీరోయిన్ రాధిక ఆప్టే గొంతు విప్పారు. గంటల తరబడి షూటింగ్‌లు చేయడం తన వల్ల కాదని, రోజుకు 12 గంటలకు మించి పని చేయనని ఆమె స్పష్టం చేశారు. పేరెంటింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చేలా ఇండస్ట్రీ మారాలని రాధిక ఆప్టే కోరుతున్నారు.

Published on: Jan 14, 2026, 13:04:12 IST
Advertisement

సినిమా రంగంలో గంటల తరబడి షూటింగ్‌లు చేయడం, విశ్రాంతి లేకుండా పని చేయడం అనే సంస్కృతిపై ఇప్పుడు తారలు గొంతు విప్పుతున్నారు. ఇంతకుముందు దీపికా పదుకొణె లాంగ్ షిఫ్టుల విషయంలో తన అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం పెద్ద కాంట్రవర్సీగా మారిన విషయం తెలిసిందే.

దీపికా పదుకొణె బాటలోనే తెలుగు హీరోయిన్- 12 గంటలు మాత్రమే షూటింగ్ చేస్తా, అలా ఇండస్ట్రీ మారాలన్న రాధిక ఆప్టే!
దీపికా పదుకొణె బాటలోనే తెలుగు హీరోయిన్- 12 గంటలు మాత్రమే షూటింగ్ చేస్తా, అలా ఇండస్ట్రీ మారాలన్న రాధిక ఆప్టే!

ఇప్పుడు దీపికా పదుకొణె బాటలో మరో హీరోయిన్, విలక్షణ నటి రాధిక ఆప్టే పయనిస్తున్నారు. తెలుగులో బాలకృష్ణతో లెజెండ్, లయన్ సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన రాధిక ఆప్టే పని గంటల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు.

పిల్లలను చూడకుండా వారం మొత్తం ఎలా పని చేస్తారు?

తాజాగా ఫిల్మ్‌ఫేర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధిక ఆప్టే సినిమా ఇండస్ట్రీలోని పని వాతావరణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "సినిమా రంగంలో తల్లిదండ్రులకు అనుకూలమైన వాతావరణం ఉండాలి. వారం మొత్తం తన బిడ్డను చూడకుండా ఎవరైనా ఎలా పని చేయగలరు? నేను లాంగ్ షిఫ్టులు చేయనని చెప్పినప్పుడు చాలామందితో వాదించాల్సి వచ్చింది. బేబీని చూసుకోవడానికి నానీని (ఆయమ్మను) సెట్‌కు తీసుకురమ్మని కొందరు సలహా ఇస్తారు. కానీ, అది సరైన పరిష్కారం కాదు" అని రాధిక ఆప్టే పేర్కొన్నారు.

నా రూల్స్ ఇవే.. నో కాంప్రమైజ్!

సినిమా ఒప్పుకునే ముందే రాధిక ఆప్టే తన నిబంధనలను స్పష్టంగా వివరిస్తున్నారు. "నా ప్రయాణం, మేకప్, షూటింగ్ అంతా కలిపి రోజుకు 12 గంటలు మాత్రమే పని చేస్తాను. అంతకు మించి ఒక్క నిమిషం కూడా ఉండను" అని రాధిక ఆప్టే డిమాండ్ చేస్తోంది.

ఇదిలా ఉంటే, రాధికా ఆప్టే 2012లో బెనెడిక్ట్ టేలర్‌ను వివాహం చేసుకున్నారు. 2024 డిసెంబర్‌లో ఈ దంపతులకు తొలి సంతానం జన్మించింది. బెనెడిక్ట్ లండన్‌లో, రాధిక ముంబైలో ఉంటూ తమ మధ్య సమయాన్ని పంచుకుంటూ కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తున్నారు.

కాగా, ఇటీవలే రాధిక ఆప్టే తిస్కా చోప్రా దర్శకత్వంలో వచ్చిన 'సాలీ మొహబ్బత్' (Saali Mohabbat) అనే మిస్టరీ థ్రిల్లర్‌లో నటించారు. ఇది 2025 డిసెంబర్‌లో జీ5లో ఓటీటీ రిలీజ్ అయి మంచి ఆదరణ పొందింది. అలాగే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సిరీస్ 'రాత్ అకేలీ హై: ది బన్సల్ మర్డర్స్'లో కూడా రాధిక ఆప్టే అతిథి పాత్రలో మెరిశారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe