టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ ఓటీటీ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు. మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు.
సినిమాగా ఓటీటీ సిరీస్

ఈ ఓటీటీ సిరీస్ నుంచి వచ్చిన రెండు సీజన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. కానిస్టేబుల్ కనకం చాప్టర్ 3 కాల్ ఘాట్ సినిమాగా థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే రెండు సీజన్స్ కలిపి థియేటర్స్‌లో సినిమాగా విడుదల చేయనున్నారు. కానిస్టేబుల్ కనకం కాల్ ఘాట్ చాప్టర్ 3 గ్లింప్స్‌ని ప్రముఖ దర్శకుడు కె రాఘవేంద్రరావు, నిర్మాత అశ్విని దత్ లాంచ్ చేశారు.
మేమిద్దరం మహేశ్ బాబుని పరిచయం చేశాం
ఈ సందర్భంగా ప్రెస్ మీట్‌లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. నేను అశ్విని దత్ కలిసి ఫస్ట్ ప్రిన్స్ మహేశ్ బాబుని పరిచయం చేశాం. దానికి సాయిబాబానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. తర్వాత పెళ్లి సందడి, గంగోత్రి.. ఎన్నో సకెస్‌ఫుల్ సినిమాలు చేశాం. ఆ విజయాల్లో భాగం సాయిబాబాకి, ఈటీవీకి ఉంది" అని అన్నారు.
ఈటీవీతో మా జర్నీ మొదలైంది
"తన అనుభవాన్ని అంతా కలబోసి కానిస్టేబుల్ కనకం అనే సక్సెస్‌ఫుల్ ఫిల్మ్ చేశారు. వర్ష చాలా మంచి ఆర్టిస్ట్. తను చాలా బిజీ కాబోతోంది. 30 ఏళ్ల క్రితం శాంతినివాసం సీరియల్‌తో ఈటీవీతో మా జర్నీ మొదలైంది. శాంతి నివాసం సీరియల్‌కు రాజమౌళి డైరెక్టర్. నేను అనుకున్న దాని కంటే అద్భుతంగా తీశాడు. ఈరోజు ఇండియాలోనే అగ్ర దర్శకుడుగా ఉన్నారు" అని కె రాఘవేంద్ర రావు తెలిపారు.
సక్సెస్ రేట్ చాలా బాగుంది
"శాంతి నివాసానికి హేమంత్ ఎడిటింగ్ చేశాడు. అప్పటినుంచి మా జర్నీ ఉంది. ఇప్పటి దర్శకుడు చాలా అద్భుతంగా తీస్తున్నారు. ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ కూడా చాలా చక్కగా తీశాడు. సాయి కృష్ణ, నితిన్ లక్కీ హాండ్స్. వీళ్ల కాంబినేషన్స్ అన్ని పిక్చర్స్ బాగుంటాయి. వీళ్ల సక్సెస్ రేట్ చాలా బాగుంది" అని డైరెక్టర్ కె రాఘవేంద్ర రావు చెప్పారు.
పది కథలు తీశాను
{{/usCountry}}"శాంతి నివాసానికి హేమంత్ ఎడిటింగ్ చేశాడు. అప్పటినుంచి మా జర్నీ ఉంది. ఇప్పటి దర్శకుడు చాలా అద్భుతంగా తీస్తున్నారు. ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ కూడా చాలా చక్కగా తీశాడు. సాయి కృష్ణ, నితిన్ లక్కీ హాండ్స్. వీళ్ల కాంబినేషన్స్ అన్ని పిక్చర్స్ బాగుంటాయి. వీళ్ల సక్సెస్ రేట్ చాలా బాగుంది" అని డైరెక్టర్ కె రాఘవేంద్ర రావు చెప్పారు.
పది కథలు తీశాను
{{/usCountry}}"సురేష్ చక్కని మ్యూజిక్ అందించాడు. ఈటీవీ విన్ ఓటీటీ కథా సుధాలో ఇప్పటివరకు ఒక పది కథలు తీశాను. వాళ్ల ప్రోత్సాహం చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. కానిస్టేబుల్ కనకం ప్రతి సీజను బాహుబలి లాగా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. అందరికీ థాంక్ యూ" అని తన స్పీచ్ ముగించారు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు.