చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.
Samantha Son Prayers: సమంత కొడుకు దేవ్ కోసం మేనత్త పూజలు- చర్చి, దర్గా, సిద్ధి వినాయక ఆలయంలో ప్రార్థనలు- ఎందుకంటే?
Raj Nidimoru Sister Prayers For Samantha Son Dev Nidimoru: నవంబర్ 19న సమంత పండంటి మగబిడ్డకు జన్మనివ్వగా, చిన్నారికి 'దేవ్ నిడిమోరు' అని పేరు పెట్టారు. మేనల్లుడి రాకతో మురిసిపోయిన రాజ్ సోదరి శీతల్, ఏకాదశి ఉపవాస దీక్షతో ముంబైలోని ఆలయం, దర్గా, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Raj Nidimoru Sister Prayers For Samantha Son Dev Nidimoru: తెలుగు స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు జీవితంలో అత్యంత మధురమైన ఘట్టం మొదలైంది. సమంత, తెలుగు మూలాలున్న ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు దంపతులు తమ తొలి సంతానానికి స్వాగతం పలికారు. నవంబర్ 19న సమంత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

ఏఐ కంటెంట్ అని చెప్పడం
ఒక రోజు ఆలస్యంగా శుక్రవారం (నవంబర్ 20) నాడు సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. తమ ముద్దుల తనయుడికి 'దేవ్ నిడిమోరు' అని నామకరణం చేసినట్లు సమంత ప్రకటించారు. క్రీమ్ రంగు దుస్తుల్లో ఉన్న చిన్నారి తన తల్లి చిటికెన వేలును సున్నితంగా పట్టుకున్న మధురమైన ఫోటోను ఆమె షేర్ చేశారు.
అయితే ఇన్‌స్టాగ్రామ్ ఈ చిత్రాన్ని 'ఏఐ కంటెంట్' (AI content) గా గుర్తించడం గమనార్హం. "మా అందమైన మగబిడ్డ దేవ్ నిడిమోరు.. 19.11.2026. మా హృదయాలు ఇంత సంతోషంగా ఎప్పుడూ లేవు" అని సమంత, రాజ్ తమ పోస్ట్‌లో భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు ప్రేమ, దిష్టి తగలకుండా ఉండే ఎమోజీలను జతచేశారు.
ఆలయం, దర్గా, చర్చిలలో రాజ్ సోదరి ప్రత్యేక ప్రార్థనలు
తమ్ముడు రాజ్ నిడిమోరు తండ్రి కావడంతో ఆయన సోదరి (అక్క) శీతల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దేవ్ పుట్టిన తర్వాత ఆమె తమ అత్తతో కలిసి ముంబైలోని ప్రసిద్ధ హాజీ అలీ దర్గా, సిద్ధివినాయక ఆలయం, సెయింట్ మైఖేల్ చర్చిలను సందర్శించి చిన్నారి క్షేమం కోసం ప్రార్థనలు చేశారు.
ఏకాదశి పర్వదినాన ఉపవాస దీక్షలో ఉంటూనే తాను ఈ మూడు ప్రార్థనా మందిరాలకు వెళ్లినట్లు దేవ్ నిడిమోరు మేనత్త శీతల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. చిన్నారిని 'దేవుడిచ్చిన అపురూపమైన కానుక'గా ఆమె అభివర్ణించారు. కుటుంబంలో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణాన్ని శీతల్ తన పోస్ట్‌లో కళ్లకు కట్టారు.
అన్ని మతాలను గౌరవిస్తూ, ప్రేమిస్తూ ఎదగాలి
"అమ్మ ఎంతో ప్రేమతో చిన్నారికి దిష్టి తీశారు. దేవ్‌పై పడే ప్రతి చూపు ఓ ఆశీర్వాదంగా మారాలన్నదే మా ఆకాంక్ష. అన్ని మతాలను గౌరవిస్తూ, అందరినీ ప్రేమిస్తూ దేవ్ ఎదగాలి. రాజ్, సామ్ తమ కొడుకుతో కలిసి జీవితంలో మరింత లోతైన ప్రేమను, ఆనందాన్ని పొందాలి" అని శీతల్ రాసుకొచ్చారు.
ఈ సంతోషకరమైన సందర్భాన్ని పురస్కరించుకుని హాజీ అలీ జ్యూస్ సెంటర్‌లో సీతాఫలం క్రీమ్ (కస్టర్డ్ యాపిల్ క్రీమ్) తిని వేడుక చేసుకున్నట్లు తెలిపారు. చివరగా 'సర్వ మంగళాని భవంతు' (అంతా మంచే జరగాలి) అంటూ తన నోట్‌ను ముగించారు సమంత వదిన శీతల్.
తరలివచ్చిన తారల అభినందనల వెల్లువ
సమంత, రాజ్ దంపతులు తల్లిదండ్రులయ్యారన్న వార్త తెలియగానే దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షల వర్షం కురిపించారు. లేడీ సూపర్ స్టార్ నయనతార హార్ట్, హగ్ ఎమోజీలతో స్పందించారు. "అభినందనలు.. నాకు చాలా సంతోషంగా ఉంది" అని నయనతార కామెంట్ చేశారు.
త్రిష కృష్ణన్ స్పందిస్తూ.. ఇటీవలి కాలంలో తాను విన్న 'అత్యంత సంతోషకరమైన వార్త' ఇదేనని పేర్కొన్నారు. గాయని చిన్మయి శ్రీపాద "ఆనందభాష్పాలు వస్తున్నాయి" అని వ్యాఖ్యానించగా, మంచు లక్ష్మి "కంగ్రాట్స్.. మీ ముగ్గురికీ నా ప్రేమను పంపిస్తున్నాను" అని శుభాకాంక్షలు తెలిపారు.
వీరితో పాటు ఉపాసన కొణిదెల, కాజల్ అగర్వాల్, వరలక్ష్మి శరత్‌కుమార్, నజ్రియా నజీమ్, విక్కీ కౌశల్ తదితర సినీ సెలబ్రిటీలు కొత్త తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు.

E-Paper
