...
...
Next Story

Varanasi: నాకు ఏడుపొచ్చేసింది, జెర్సీలో నానిలా అరిచా: రాజమౌళి కొడుకు కార్తికేయ-ఇస్రో రాకెట్ లాంచ్‌లా చేశారన్న యాంకర్ సుమ

Rajamouli Son Karthikeya Get Tears To Varanasi Event Technical Glitch: మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటించిన లేటెస్ట్ సినిమా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా ప్రమోషన్స్‌లో వారణాసి సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు రాజమౌళి కుమారుడు కార్తికేయ. యాంకర్ సుమ తన ఫీలింగ్స్ చెప్పారు.

Published on: Sep 26, 2026, 12:13:54 IST
Advertisement

Rajamouli Son Karthikeya Get Tears To Varanasi Event Technical Glitch: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కలయికలో రూపుదిద్దుకుంటున్న గ్లోబల్ ప్రాజెక్ట్ 'వారణాసి'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ఇదివరకు హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా నిర్వహించిన వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ సినీ ప్రియుల్లో భారీ సంచలనం సృష్టించింది.

సాంకేతిక లోపాలతో

నాకు ఏడుపొచ్చేసింది, జెర్సీలో నానిలా అరిచా: రాజమౌళి కొడుకు కార్తికేయ-ఇస్రో రాకెట్ లాంచ్‌లా చేశారన్న యాంకర్ సుమ
నాకు ఏడుపొచ్చేసింది, జెర్సీలో నానిలా అరిచా: రాజమౌళి కొడుకు కార్తికేయ-ఇస్రో రాకెట్ లాంచ్‌లా చేశారన్న యాంకర్ సుమ

కానీ, అంతర్జాతీయ స్థాయి మీడియా సమక్షంలో జరిగిన ఈ వేడుకలో ఊహించని విధంగా సాంకేతిక లోపాలు తలెత్తి కార్యక్రమం కాసేపు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన సమయంలో స్టేజ్ వెనుక ఏం జరిగింది, ఆ సమయంలో రాజమౌళి కుటుంబం ఎంత ఆందోళనకు గురైందో జక్కన్న తనయుడు, నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ సంచలన విషయాలను బయటపెట్టారు.

మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ నటించిన లేటెస్ట్ మూవీ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'. ఈ సినిమాకు కార్తికేయ కూడా నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. తాజాగా డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమా ప్రమోషనల్ వీడియోలో యాంకర్ సుమ, నటుడు ఫహాద్ ఫాజిల్‌తో సరదాగా మాట్లాడుతూ కార్తికేయ వారణాసి ఈవెంట్‌లో జరిగిన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.

టెంట్ లోపల రణరంగం లాంటి పరిస్థితి!

సాంకేతిక సమస్య తలెత్తినప్పటి వాతావరణాన్ని కార్తికేయ వివరిస్తూ.. "ఆ సమయంలో స్టేజ్ వెనుక ఉన్న టెంట్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. నిజం చెప్పాలంటే నాకైతే ఏడుపొచ్చేసింది. ఎవరిపై కోప్పడాలో, ఎలా స్పందించాలో అర్థం కాక తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాను" అని అన్నారు.

ప్రీ-రిలీజ్ ఈవెంట్ల నిర్వహణలో రాజమౌళి పాటించే క్రమశిక్షణను యాంకర్ సుమా గుర్తుచేసుకున్నారు. "రాజమౌళి సర్ 'స్టూడెంట్ నంబర్ 1' సమయం నుంచే ప్రతి ఈవెంట్‌కు ముందు పక్కాగా రిహార్సల్స్ చేస్తుంటారు. అంతటి ప్లానింగ్ ఉన్న టీమ్‌కి ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం అందరినీ కలచివేసింది" అని సుమ కనకాల అన్నారు.

"అది కేవలం ఒక సినిమా ఈవెంట్‌లా లేదు, ఇస్రో (ISRO) రాకెట్ లాంచ్ చేస్తున్నంత ఆందోళనగా అనిపించింది. రమా గారు, రాజమౌళి గారు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మహేశ్ బాబు సతిమణి నమ్రతా శిరోద్కర్ దేవుడిని ప్రార్థిస్తూ కూర్చున్నారు" అని యాంకర్ సుమ చెప్పుకొచ్చారు.

ఉగాది కానుకగా 2027లో విడుదల

కాగా, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన వారణాసి సినిమాకు విజయేంద్ర ప్రసాద్, ఎస్.ఎస్. కాంచితో కలిసి రాజమౌళి స్వయంగా కథను అందించారు. ప్రముఖ దర్శకుడు దేవా కట్టా సంభాషణలు సమకూర్చారు.

శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ విజువల్ వండర్‌ను 2027 ఏప్రిల్ 7న ఉగాది పండగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks