బాలీవుడ్ స్టార్ హీరో, దీపికా పదుకొణె భర్త రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ, ఇప్పటికే రూ. 900 కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
డాన్‌గా మెప్పించాల్సిన రణ్‌వీర్

అయితే, ఈ భారీ సక్సెస్ ఇప్పుడు ‘డాన్ 3’ ప్రాజెక్టు ఎఫెక్ట్ పడింది. బాలీవుడ్ హీరో, డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ‘డాన్’గా మెప్పించాల్సిన రణ్‌వీర్ సింగ్ అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు బి-టౌన్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
గ్యాంగ్‌స్టర్ పాత్రలకు బ్రేక్.. రణ్‌వీర్ కొత్త ప్లాన్!
‘దురంధర్’లో రణ్‌వీర్ పోషించిన పాత్రకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. వరుసగా గ్యాంగ్‌స్టర్ లేదా యాక్షన్ నేపథ్యం ఉన్న సినిమాలు చేయడం ఇష్టం లేకనే రణ్‌వీర్ సింగ్ ‘డాన్ 3’ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
దిగ్గజ దర్శకులతో
సంజయ్ లీలా భన్సాలీ, లోకేష్ కనగరాజ్, అట్లీ వంటి దిగ్గజ దర్శకులతో పనిచేయాలని రణ్‌వీర్ సింగ్ ఆశిస్తున్నారట. అందుకే, తన డేట్స్‌ను సర్దుబాటు చేసుకునే క్రమంలో ‘డాన్ 3’కు గుడ్ బై చెప్పారని టాక్.
జై మెహతా ‘ప్రళయ్’కు గ్రీన్ సిగ్నల్
‘డాన్ 3’ నుంచి బయటకు వచ్చిన రణ్‌వీర్ సింగ్ ఇప్పుడు తన పూర్తి ఫోకస్‌ను జై మెహతా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ప్రళయ్’ (Pralay) పై పెట్టారు. ఇది ఒక జాంబీ థ్రిల్లర్ అని, తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక తండ్రి చేసే పోరాటం చుట్టూ కథ తిరుగుతుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా అంటే 2026 జనవరిలోనే మొదలుపెట్టాలని రణ్‌వీర్ నిర్మాతలను కోరినట్లు తెలుస్తోంది.
హీరోయిన్ల మార్పు
మరోవైపు ‘డాన్ 3’ టీమ్ ఇప్పటికే పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. మొదట కియారా అద్వానీని హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ, కియారా అద్వానీ ప్రసవం తర్వాత విరామం తీసుకోవడంతో ఆమె స్థానంలో కృతి సనన్‌ను ఎంపిక చేశారు.
కొత్త ‘డాన్’ కోసం వేట!
{{/usCountry}}మరోవైపు ‘డాన్ 3’ టీమ్ ఇప్పటికే పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. మొదట కియారా అద్వానీని హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ, కియారా అద్వానీ ప్రసవం తర్వాత విరామం తీసుకోవడంతో ఆమె స్థానంలో కృతి సనన్‌ను ఎంపిక చేశారు.
కొత్త ‘డాన్’ కోసం వేట!
{{/usCountry}}ఇప్పుడు రణ్‌వీర్ సింగ్ కూడా హ్యాండ్ ఇవ్వడంతో మేకర్స్ కొత్త హీరో కోసం అన్వేషణ మొదలుపెట్టారు. రణ్‌వీర్ సింగ్ తప్పుకున్నా అనుకున్న సమయానికే డాన్ 3 సినిమాను పట్టాలెక్కించాలని ఫర్హాన్ అక్తర్ పట్టుదలతో ఉన్నట్లు సమాచారం.
షారుక్ ఖాన్‌తో
ఇకపోతే ఇదివరకు డాన్‌గా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సందడి చేసిన విషయం తెలిసిందే. డాన్, డాన్ 2 సినిమాల్లో అదిరిపోయే యాక్టింగ్‌తో షారుక్ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాల్లో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా ఆకర్షించింది.