Maa Inti Bangaram And Transfer Trimurthulu OTT Release Platforms: ఎప్పుడు కొత్త సినిమా ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తుంటారు డిజిటల్ స్ట్రీమింగ్ ఆడియెన్స్. అలాగే, థియేటర్లలో విడుదలైన వెంటనే ఆ సినిమాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, స్ట్రీమింగ్ డేట్ తెలుసుకోవాలనే కుతుహలంతో తెగ ఉంటారు.
ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్స్‌పై

ఈ క్రమంలోనే నిన్న అంటే జూన్ 19న థియేటర్లలో విడుదలైన రెండు సినిమాల ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్స్‌పై క్యూరియాసిటీ నెలకొంది. ఆ సినిమాలే సమంత రూత్ ప్రభు నటించిన మా ఇంటి బంగారం, సీనియర్ హీరో వడ్డే నవీన్ కమ్‌బ్యాక్ ఇచ్చిన ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు.
సమంత నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రమే మా ఇంటి బంగారం. ఇందులో సమంత మెయిన్ లీడ్ రోల్ చేయగా గుల్షన్ దేవయ్య, యాంకర్లు శ్రీముఖి, మంజూష, శ్రీనివాస్ గవిరెడ్డి, సీనియర్ హీరోయిన్ గౌతమి, లక్ష్మీ, దిగంత్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
మా ఇంటి బంగారం ఓటీటీ స్ట్రీమింగ్
సమంత భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించగా.. ఆయన హిమాంక్ దువ్వూరుతో కలిసి మా ఇంటి బంగారం మూవీని నిర్మించారు. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి అంచనాలతో జూన్ 19న థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది.
సమంత యాక్షన్ సీన్స్, ఎమోషనల్, డ్రామా బాగా వర్కౌట్ అయ్యాయని కామెంట్స వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మా ఇంటి బంగారం ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్గా మారాయి. ప్రముఖ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ మా ఇంటి బంగారం ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని సమాచారం.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
{{/usCountry}}సమంత యాక్షన్ సీన్స్, ఎమోషనల్, డ్రామా బాగా వర్కౌట్ అయ్యాయని కామెంట్స వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మా ఇంటి బంగారం ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్గా మారాయి. ప్రముఖ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ మా ఇంటి బంగారం ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని సమాచారం.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
{{/usCountry}}అంటే, జియో హాట్‌స్టార్‌లో మా ఇంటి బంగారం ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తి అయిన సుమారు 4 నుంచి 6 వారాల తర్వాత జియో హాట్‌స్టార్‌లో మా ఇంటి బంగారం ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అలాగే, మా ఇంటి బంగారం శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకుందని టాక్.
ఇక సమంత సినిమాతో పాటు నిన్న విడుదలైన మరో మూవీ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు. సీనియర్ హీరో వడ్డే నవీన్ చాలా కాలం గ్యాప్ తర్వాత కథానాయకుడుగా కమ్‌బ్యాక్ ఇచ్చిన సినిమా ఇది. తెలుగు పొలిటికల్ యాక్షన్ కామెడీ చిత్రంగా ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు మూవీ తెరకెక్కింది.
20 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ
కమల్ తేజ నర్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వడ్డే నవీన్‌కు జోడీగా గ్లామరస్ బ్యూటీ రాశీ సింగ్ హీరోయిన్‌గా చేసింది. ఆడుకాలం నరేన్, శిల్పా తులస్కర్, రఘు బాబు, బాబా భాస్కర్, దేవీ ప్రసాద్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అంతేకాకుండా వడ్డే నవీన్ నిర్మాతగా మారి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.
దాదాపు 20 ఏళ్ల తర్వాత వడ్డే నవీన్ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా కావడంతో ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులుపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీ, మూవీకి మాత్రం నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. స్టోరీ చాలా బాగున్నా టేకింగ్ పరమ రొటీన్, అనవసరపు ఫైట్స్, సాంగ్స్‌తో నింపేశారని పలువురు రివ్యూలు ఇచ్చారు.
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ఓటీటీ రిలీజ్
ఈ క్రమంలోనే ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఆసక్తి నెలకొంది. జీ5 ఓటీటీ సంస్థ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ లెక్కన జీ5లో ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
సమంత మూవీలాగే నెల రోజులు లేదా అంతకు ముందు, తర్వాత ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. బాక్సాఫీస్ కలెక్షన్స్, మౌత్ టాక్‌ను బట్టి ఈ రెండు సినిమాల ఓటీటీ రిలీజ్ డేట్స్ మారే ఛాన్స్ ఉంది.