తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటి సారా అర్జున్. తెలుగులో చియాన్ విక్రమ్ నాన్న సినిమాతో అందరి మనసుల్లో గుర్తుండిపోయింది. అనంతరం ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు, సైడ్ రోల్స్ చేసిన సారా అర్జున్ ఒక్కసారిగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి అందరిని షేక్ చేసింది.
హీరోయిన్‌గా డెబ్యూ

బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ సినిమాతో హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ సారా అర్జున్. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తో జోడీ కట్టింది ముద్దుగుమ్మ సారా అర్జున్. దురంధర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సారా అర్జున్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.
దురంధర్ సినిమాలో ఒక రాజకీయ నాయకుడికి అమాయకపు కూతురిగా నటించి.. తన నటనతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది సారా. అయితే, ధురంధర్ సినిమా వరల్డ్ వైడ్‌గా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోన్న విషయం తెలిసిందే. దురంధర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది.
రెడ్ బ్యాక్‌లెస్ డ్రెస్
హీరోయిన్‌గా తొలి సినిమాకే రూ. 1200 కోట్లు వచ్చిన తరుణంలో సారా అర్జున్ తన ఆనందాన్ని పంచుకుంది. అలాగే, తాజాగా హాట్ లుక్స్‌తో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది సారా అర్జున్. రెడ్ కలర్ స్లీవ్‌లెస్, బ్యాక్‌లెస్ డ్రెస్ ధరించి ఎంతో స్టైలిష్‌గా కనిపించింది సారా అర్జున్.
మెస్సీ బన్ హెయిర్ స్టైల్, తక్కువ వెలుతురులో షాండ్లియర్స్ మధ్యలో ఉన్న పెయింటింగ్స్ బ్యాక్‌డ్రాప్‌లో సారా అర్జున్ గ్లామర్ ట్రీట్ అదిరిపోయింది. ప్రముఖ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ సాషా జైరాం తీసిన ఈ ఫోటోషూట్‌లో సారా అర్జున్ హాట్ అండ్ క్లాసీ లుక్‌తో మెస్మరైజ్ చేసింది.
సారా ముఖ వర్చస్సును చూసి
{{/usCountry}}మెస్సీ బన్ హెయిర్ స్టైల్, తక్కువ వెలుతురులో షాండ్లియర్స్ మధ్యలో ఉన్న పెయింటింగ్స్ బ్యాక్‌డ్రాప్‌లో సారా అర్జున్ గ్లామర్ ట్రీట్ అదిరిపోయింది. ప్రముఖ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ సాషా జైరాం తీసిన ఈ ఫోటోషూట్‌లో సారా అర్జున్ హాట్ అండ్ క్లాసీ లుక్‌తో మెస్మరైజ్ చేసింది.
సారా ముఖ వర్చస్సును చూసి
{{/usCountry}}దీంతో సారా అర్జున్ న్యూ ఫొటోషూట్ వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. సారా అందాన్ని చూసిన నెటిజన్స్ కామెంట్లతో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. "స్వర్గం నుంచి దిగివచ్చిన కోకిల వంటి అప్సరస" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. సారా ముఖ వర్చస్సును చూసి "అన్‌రియల్ ఫేస్ కార్డ్" అని నెటిజన్లు పొగిడేస్తున్నారు.
ఒక్కసారిగా సారా అర్జున్ హాట్ లుక్‌లో దర్శనం ఇచ్చేసరికి ఇంటర్నెట్ షేక్ అవుతోంది. ఓ వైపు దురంధర్ కలెక్షన్స్, మరోవైపు సారా అర్జున్ గ్లామర్ ట్రీట్ బాలీవుడ్‌లో ఇంట్రెస్టింగ్‌గా మారింది.
అది తప్పని నిరూపించారు
ఇదిలా ఉంటే, దురంధర్ సినిమా సక్సెస్ గురించి "సినిమా నిడివి ఎక్కువైతే ప్రేక్షకులకు ఓపిక ఉండదు అన్న నానుడిని మీరు తప్పు అని నిరూపించారు. కథలో దమ్ముంటే జనం బ్రహ్మరథం పడతారని ధురంధర్ విజయంతో అర్థమైంది. కళాకారులుగా మేము సినిమా కోసం శ్రమిస్తాం. కానీ, అసలైన విజయం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు చూపిస్తున్న ఈ ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సారా అర్జున్ పేర్కొంది.