...
...
Next Story

షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్‌లను బీట్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్- ధురంధర్ ఓటీటీ రిలీజ్‌తో అమాంతం పెరిగిన క్రేజ్

ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్' చిత్రం బాక్సాఫీస్ వద్దే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ప్రకటించిన ఐఎమ్‌డీబీ పాపులర్ సెలబ్రిటీల జాబితాలో ఈ మూవీ హీరో హీరోయిన్ సారా అర్జున్, రణ్‌వీర్ సింగ్ అగ్రస్థానంలో నిలిచి షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ వంటి స్టార్స్‌ను ఓడించారు.

Published on: Feb 9, 2026, 20:41:33 IST
Advertisement

సినిమా రంగంలో రికార్డులు తిరగరాయడం అంటే బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించడమే కాదు.. సోషల్ మీడియాలో, సెర్చ్ ఇంజిన్లలో ఎంత ప్రభావం చూపారనేది కూడా కీలకమే. గతేడాది డిసెంబర్‌లో విడుదలై సుమారు రూ. 1300 కోట్ల భారీ వసూళ్లను సాధించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar) ఇప్పుడు (ఐఎమ్‌డీబీ) IMDb ర్యాంకింగ్స్‌లోనూ సరికొత్త రికార్డులను సృష్టించింది.

షారుఖ్, ఐశ్వర్యరాయ్‌లను వెనక్కి నెట్టిన సారా అర్జున్

షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్‌లను బీట్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్- ధురంధర్ ఓటీటీ రిలీజ్‌తో అమాంతం పెరిగిన క్రేజ్
షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్‌లను బీట్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్- ధురంధర్ ఓటీటీ రిలీజ్‌తో అమాంతం పెరిగిన క్రేజ్

తాజాగా విడుదలైన ఐఎమ్‌డీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల జాబితాలో ‘ధురంధర్’ నటీనటులు ఆధిపత్యం ప్రదర్శించారు. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ సరసన నటించిన యువ నటి, ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.

జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో ధురంధర్ ఓటీటీ రిలీజ్ అయినప్పటి నుంచి సారా అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే సారా అర్జున్ బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ (#8), ఐశ్వర్య రాయ్ బచ్చన్ (#10) వంటి దిగ్గజాలను సైతం వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. ఇక రణ్‌వీర్ సింగ్ రెండో స్థానంలో నిలిచి తన సత్తా చాటారు.

లిస్టులో ‘ధురంధర్’ టీమ్ సందడి

ఈ వారం టాప్ 10 జాబితాలో దర్శకుడు ఆదిత్య ధర్ (#6), నటుడు అక్షయ్ ఖన్నా (#7) కూడా చోటు సంపాదించుకున్నారు. వీరే కాకుండా ఆర్. మాధవన్ (#17), అర్జున్ రాంపాల్ (#21), సంజయ్ దత్ (#35), రాకేష్ బేడీ (#64) కూడా మొదటి టాప్ 100 మందిలో నిలిచారు. ఒకే సినిమా నుంచి ఏకంగా ఎనిమిది మంది సెలబ్రిటీలు ఈ స్థాయిలో ట్రెండింగ్‌లో ఉండటం అరుదైన విషయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇతర ట్రెండింగ్ సెలబ్రిటీలు

ఇదిలా ఉంటే, యదార్థ సంఘటనల ఆధారంగా, పాకిస్థాన్‌లోని ల్యారీలో జరిగిన రహస్య ఆపరేషన్ నేపథ్యంలో రూపొందిన ‘ధురంధర్’.. గల్ఫ్ దేశాలు, పాకిస్థాన్‌లో నిషేధానికి గురైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించింది.

ఐఎమ్‌డీబీ జాబితాలో సారా అర్జున్, రణ్‌వీర్ సింగ్

త్వరలో ‘ధురంధర్: ది రివెంజ్’

ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar: The Revenge) సిద్ధమవుతోంది. దురంధర్ 2 మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 1300 కోట్లు కొల్లగొట్టిన మొదటి భాగం కంటే, రెండో భాగం మరిన్ని రికార్డులను సృష్టిస్తుందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks