...
...
Next Story

Akanksha Bisexual: నేను బైసెక్సువల్, పెళ్లికి ముందే అమ్మాయిలతో సంబంధం ఉంది.. సీరియల్ హీరోయిన్ ఆకాంక్ష కన్నీళ్లు

Akanksha Chamola Reveals She Was Bisexual: ప్రముఖ టెలివిజన్ నటి ఆకాంక్ష చమోలా తన వ్యక్తిగత జీవితంపై మరో షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. భర్త గౌరవ్ ఖన్నాతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన కొద్దిరోజులకే, తాను బైసెక్సువల్ అనే రహస్యాన్ని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ షో లాక్ అప్ 2లో చెప్పి బాంబ్ పేల్చారు.

Published on: Jul 5, 2026, 11:05:24 IST
Advertisement

Akanksha Chamola Reveals She Was Bisexual: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ఓటీటీ రియాలిటీ షోల వేదికగా వారు పంచుకునే రహస్యాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.

బైసెక్సువల్ అంటూ

నేను బైసెక్సువల్, పెళ్లికి ముందే అమ్మాయిలతో సంబంధం ఉంది.. సీరియల్ హీరోయిన్ ఆకాంక్ష కన్నీళ్లు
నేను బైసెక్సువల్, పెళ్లికి ముందే అమ్మాయిలతో సంబంధం ఉంది.. సీరియల్ హీరోయిన్ ఆకాంక్ష కన్నీళ్లు

తాజాగా నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న పాపులర్ రియాలిటీ షో 'లాక్ అప్' సీజన్ 2లో సీరియల్ హీరోయిన్ ఆకాంక్ష చమోలా తన జీవితానికి సంబంధించిన సంచలన విషయాలను బయటపెట్టారు. గత వారం తన భర్త, బిగ్ బాస్ విజేత గౌరవ్ ఖన్నాతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆమె.. ఇప్పుడు తాను బైసెక్సువల్ (ద్విలింగ సంపర్కురాలు) అంటూ మరో బాంబు పేల్చారు.

మన తెలుగులో బిగ్ బాస్ షో ఎంతటి క్రేజ్ తెచ్చుకుందో.. ఓటీటీలో 'లాక్ అప్' షోకి అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉంది. ఈ ఓటీటీ షో నిబంధనల ప్రకారం కంటెస్టెంట్లు తమ జీవితంలోని చీకటి కోణాలను, ఎవరికీ తెలియని రహస్యాలను బయటపెట్టి గేమ్‌లో ముందుకు సాగాల్సి ఉంటుంది.

లీక్ చేసిన మరో నటి

అయితే ఆకాంక్షకు సంబంధించిన ఈ సీక్రెట్‌ను ఆమె అనుమతి లేకుండానే తోటి కంటెస్టెంట్, నటి శ్రేయా కల్రా లీక్ చేశారు. బ్యాక్‌స్టేజ్‌లో ఆకాంక్ష మాట్లాడుకుంటున్న విషయాలను శ్రేయ దొంగచాటుగా విన్నారు. ఆ విషయాన్ని మరో కంటెస్టెంట్ సూఫీ మోతీవాలాకు చెప్పడంతో ఆకాంక్ష రహస్యం కాస్తా రచ్చకెక్కింది. తన అనుమతి లేకుండా వ్యక్తిగత విషయాన్ని బహిర్గతం చేయడంతో ఆకాంక్ష తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

పెళ్లికి ముందే అమ్మాయిలతో సంబంధాలు

మహిళల పట్ల తనకున్న ఆకర్షణ గురించి ఆకాంక్ష మరింత వివరిస్తూ సమాజంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నాకు అమ్మాయిలంటే ఇష్టం. వారిని నేను ఎంతగానో ఆరాధిస్తాను, వారి వైపు ఆకర్షితురాలినవుతాను. అది నా సేఫ్ స్పేస్ అని భావిస్తాను" అని ఆకాంక్ష చెప్పుకొచ్చారు.

"పెరిగే వాతావరణంలో పురుషాధిక్య ప్రపంచాన్ని చూసినప్పుడు ఎవరైనా అమ్మ, అక్కాచెల్లెళ్ల వైపు మొగ్గు చూపుతారు. వారి నుంచి లభించే కంఫర్ట్ జోన్ చాలా బాగుంటుంది. మహిళల్లో ఉండే ఆ ప్రత్యేకమైన శక్తి నన్ను ఎప్పుడూ ఆకట్టుకుంటుంది" అని ఆకాంక్ష చమోలా వివరణ ఇచ్చారు.

"ఆడవాళ్లు స్నేహితులుగా ఉండలేరని, వారి మధ్య ఈర్ష్య, పోటీ ఉంటాయని ఈ సమాజం చెబుతుంది. కానీ, నా విషయంలో అలాంటిది లేదు. నా దృష్టిలో మహిళలందరూ అందమైనవారే. సమాజం వీటికి రకరకాల పేర్లు పెట్టినా, నాకైతే అది స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే" అని ఆకాంక్ష పేర్కొన్నారు.

కన్నీళ్లు పెట్టుకున్న నటి

ఓటీటీ షోలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే తన వ్యక్తిగత జీవితాన్ని అందరూ టార్గెట్ చేస్తున్నారని, అసలు ఈ షోకి రావడం తను చేసిన పెద్ద పొరపాటని చెప్తూ ఆకాంక్ష కన్నీరు పెట్టుకున్నారు. దాంతో హోస్ట్ ఫరా ఖాన్ ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చారు.

గతంలో 'సంతోషి మా', 'యే హై ఆషికీ', 'క్రైమ్ పెట్రోల్' వంటి పాపులర్ షోలలో నటించిన ఆకాంక్ష చమోలా.. నటుడు, బిగ్ బాస్ విన్నర్ గౌరవ్ ఖన్నాను ప్రేమించి 2016 నవంబర్ 24న కాన్పూర్‌లో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే వీరి పదేళ్ల బంధం ఇప్పుడు విడాకులతో ముగిసిపోతుండటం, అంతలోనే ఈమె లైంగిక ధోరణి గురించిన వార్తలు బయటకు రావడం టీవీ పరిశ్రమలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks