Sigma OTT Release Details: సినిమాలు ఇలా థియేటర్లలో విడుదల కాగానే అలా ఓటీటీ వివరాలపై రోజురోజుకీ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా నిన్న (అక్టోబర్ 2) థియేటర్లలో విడుదలైన సిగ్మా ఓటీటీ స్ట్రీమింగ్ డీటేల్స్ కూడా ఇప్పుడు ఆసక్తిగా మారాయి.
దర్శకుడిగా విజయ్ కుమారుడు

నేచురల్ నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమానే సిగ్మా. తమిళ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అయిన సినిమా ఇది.
జాతి రత్నాలు చిట్టి
సిగ్మా సినిమాలో సందీప్ కిషన్‌కు జోడీగా జాతి రత్నాలు చిట్టి ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేసింది. మంచి అంచనాలతో నిన్న అంటే అక్టోబర్ 2న థియేటర్లలో రిలీజ్ అయింది సిగ్మా సినిమా. తొలి చిత్రం నుంచే తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించిన జేసన్.. హీరో సందీప్ కిషన్‌ను సరికొత్త మాస్ థ్రిల్లింగ్ అవతార్‌లో ఆవిష్కరించారు.
తమన్ బీజీఎమ్
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ నేపథ్య సంగీతం అందించాడు. తమన్ అందించిన బీజీఎమ్ ఈ థ్రిల్లర్ డ్రామాను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లింది. సీనియర్ నటుడు సంపత్ రాజ్, డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరం, అన్బుదాసన్, యోగ్ జేపీ, కిరణ్ కొండ, మహాలక్ష్మి సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో నటించి కథకు ప్రాణం పోశారు.
రూ. 500 కోట్ల మాఫియా మనీ.. అసలు కథేంటంటే?
అప్పుల్లో కూరుకుపోయిన ఒక సాధారణ యువకుడు తన తల్లి జ్ఞాపకాలను కాపాడుకోవడానికి చేసే పోరాటమే ఈ చిత్ర కథాంశం. హీరో గురు (సందీప్ కిషన్)కు తల్లి అంటే అమితమైన ప్రేమ. అప్పుల ఊబి నుంచి బయటపడటంతో పాటు తన తల్లి జ్ఞాపకార్థం ఉన్న ఒక లైబ్రరీని కాపాడుకోడానికి వేగంగా డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషిస్తాడు.
{{/usCountry}}అప్పుల్లో కూరుకుపోయిన ఒక సాధారణ యువకుడు తన తల్లి జ్ఞాపకాలను కాపాడుకోవడానికి చేసే పోరాటమే ఈ చిత్ర కథాంశం. హీరో గురు (సందీప్ కిషన్)కు తల్లి అంటే అమితమైన ప్రేమ. అప్పుల ఊబి నుంచి బయటపడటంతో పాటు తన తల్లి జ్ఞాపకార్థం ఉన్న ఒక లైబ్రరీని కాపాడుకోడానికి వేగంగా డబ్బు సంపాదించే మార్గాలను అన్వేషిస్తాడు.
{{/usCountry}}ఈ క్రమంలో ఒక క్యాసినోకి వెళ్లిన గురు జీవితం ఒక్కసారిగా ఊహించని మలుపులు తిరుగుతుంది. దాదాపు రూ. 500 కోట్ల మాఫియా బ్లాక్ మనీకి సంబంధించిన సీక్రెట్ పెన్ డ్రైవ్ గురించిన విషయం గురుకి తెలుస్తుంది. ఆ పెండ్రైవ్ కోసం కొన్ని డేంజరస్ మాఫియా గ్యాంగ్స్ తీవ్రంగా వేట సాగిస్తుంటాయి.
గురు కల నెరవేరిందా?
ఆ పెండ్రైవ్ గురుకు ఎలా దొరికింది? అందులో ఏముంది? ఆ మాఫియా ముఠాల నుంచి గురు ఎలా తప్పించుకున్నాడు? మరి భారీగా డబ్బును సాధించాడా? తన తల్లి లైబ్రరీని గురు కాపాడుకున్నాడా? లేదా? అనే అంశాలను వెండితెరపై ఉత్కంఠభరితంగా మలిచారు.
ఇలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన సిగ్మా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై క్యూరియాసిటీ నెలకొంది. సిగ్మా ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. మంచి ధర వెచ్చించే సిగ్మా ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని టాక్.
సిగ్మా ఓటీటీ స్ట్రీమింగ్
ఈ లెక్కన నెట్‌ఫ్లిక్స్‌లోనే సిగ్మా ఓటీటీ రిలీజ్ కానుంది. అయితే, ఇదే నెలలో అంటే అక్టోబర్‌లోనే ఓటీటీలోకి సిగ్మా సినిమా రానుందని తెలుస్తోంది. అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో సిగ్మా ఓటీటీ స్ట్రీమింగ్ కానుందట. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి 5 భాషల్లో ఓటీటీలో సిగ్మా అందుబాటులోకి రానుందని సమాచారం.