...
...
Next Story

OTT Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు మెడికో ఫ్యామిలీ డ్రామా- సవతి తల్లి టార్చర్, తాగుబోతు తండ్రి మధ్య నలిగే నర్స్!

Sister Mahi OTT Streaming Today: ఓటీటీలోకి ఇవాళ నేరుగా తెలుగు మెడికో లవ్ ఫ్యామిలీ డ్రామా చిత్రం సిస్టర్ మహి (ఒక నర్స్ కథ) స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సవతి తల్లి టార్చర్ పెట్టే నర్స్ కథ ఇది. డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు కథ, స్క్రీన్‌ప్లే అందించిన సిస్టర్ మహి ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 21, 2026, 13:16:16 IST
Advertisement

Sister Mahi OTT Release Today: తెలుగు చిత్ర పరిశ్రమలో కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈసారి ఓటీటీ ప్రేక్షకుల కోసం ఒక సున్నితమైన, హృదయానికి హత్తుకునే కథతో ముందుకు వచ్చారు.

రాఘవేంద్రరావు కథ, స్క్రీన్ ప్లే

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు మెడికో ఫ్యామిలీ డ్రామా- సవతి తల్లి టార్చర్, తాగుబోతు తండ్రి మధ్య నలిగే నర్స్!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు మెడికో ఫ్యామిలీ డ్రామా- సవతి తల్లి టార్చర్, తాగుబోతు తండ్రి మధ్య నలిగే నర్స్!

తెలుగు దిగ్గజ డైరెక్టర్ రాఘవేంద్రరావు కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ స్వయంగా నిర్మించిన వినూత్న చిత్రం ‘సిస్టర్ మహి (ఒక నర్స్ కథ)’. మానవత్వం, నిష్కల్మషమైన ప్రేమ, ఊహించని త్యాగాల నేపథ్యంలో సాగే ఈ భావోద్వేగ భరిత చిత్రాన్ని తాగుబోతు తండ్రి, సవతి తల్లి పెట్టే టార్చర్ మధ్య సాగే నర్స్ కథగా తెరకెక్కించారు.

గుండెల్ని పిండేసే మహి, సూర్యల ప్రేమకథ

ఈ సినిమా కథ మొత్తం ‘మహి’ అనే ఒక దయా హృదయం ఉన్న నర్స్ చుట్టూ తిరుగుతుంది. ఆసుపత్రికి వచ్చే రోగులకు సేవ చేయడం అనేది కేవలం తను చేసే ఉద్యోగం మాత్రమే కాదని, అది మానవత్వంతో కూడిన ఒక పెద్ద బాధ్యత అని మహి బలంగా నమ్ముతుంది.

అదే ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసే సూర్యతో మహి ప్రేమలో పడుతుంది. వీరిద్దరి మధ్య సాగే స్వచ్ఛమైన ప్రేమ, చిన్న చిన్న సంతోషాలు, భవిష్యత్తు గురించి వారు కనే అందమైన కలలతో కథ ఎంతో ఆహ్లాదకరంగా సాగుతుంది. అయితే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కడానికి కొన్ని రోజుల ముందు వీరి జీవితాల్లో ఒక పెద్ద విషాదం చోటుచేసుకుంటుంది.

సినిమా ట్విస్టులు

సిస్టర్ మహి చిత్రంలో ప్రీతి నేహా, దీక్షిత్ ఎన్.సి. ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. వారితో పాటు భాస్కర్, రాజ్‌కుమారి, మధులిక శర్మ, రామ్ చరణ్, సమన్వి పవార్, సంధ్యా జనక్, మహాలక్ష్మి, మధుకర్, తేజు శరణ్య, సుధీర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సాంకేతిక విభాగానికి వస్తే.. సాయి మధుకర్ అందించిన సంగీతం, పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వివమ్, బృందా ఈ సినిమాలోని ఎమోషనల్ పాటలను ఆలపించారు. రాజ్‌కుమార్ ముచింతల సౌండ్ ఎఫెక్ట్స్ అందించగా, శ్రీనివాస్ కొప్పోల ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

ఓటీటీలోకి నేరుగా సిస్టర్ మహి

'ఆర్.కె. టెలి షో' స్టూడియోలో డబ్బింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సిస్టర్ మహి సమాజంలో తోటివారికి సహాయం చేయాలనే మంచి సందేశాన్ని ఇస్తూ తెలగు మెడికో లవ్ ఫ్యామిలీ డ్రామా జోనర్‌తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు నేరుగా ఇవాళ (జూన్ 21) వచ్చేసింది.

ఈటీవీ విన్ ఓటీటీలో

తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలో వైవిధ్యమైన కంటెంట్‌తో దూసుకుపోతున్న ఈటీవీ విన్‌లో (ETV Win) సిస్టర్ మహి ఓటీటీ రిలీజ్ అయింది. ఈటీవీ విన్ కథా సుధ సిరీస్‌లో భాగంగా ఇవాళ సిస్టర్ మహి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఒక సాదాసీదా నర్స్ జీవితంలో జరిగిన హృదయవిదారక సంఘటనల సమాహారంగా తెరకెక్కిన సిస్టర్ మహి సినిమాను ఈటీవీ విన్ ఓటీటీలో ఎంచక్కా చూసేయండి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe