...
...
Next Story

NTR KCR Chiranjeevi The Paradise: నాని ది ప్యారడైజ్‌లో ఎన్టీఆర్, కేసీఆర్, చిరంజీవి.. అసలు వాళ్లెందుకు ఉన్నారు?

Sr NTR Chiranjeevi KCR In Nani The Paradise Movie: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ మూవీ థియేటర్లలో రచ్చ చేస్తోంది. 1980ల నాటి తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో దివంగత ఎన్టీఆర్, కేసీఆర్ పోలికలతో ఉన్న పాత్రలు ప్రేక్షకులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాయి.

Published on: Sep 24, 2026, 21:12:15 IST
Advertisement

Sr NTR Chiranjeevi KCR In Nani The Paradise Movie: 'దసరా' లాంటి సంచలన విజయం తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన 'ది ప్యారడైజ్'. గురువారం (సెప్టెంబర్ 24)థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లింది.

రియల్ లైఫ్ రెఫరెన్సులు

నాని ది ప్యారడైజ్‌లో ఎన్టీఆర్, కేసీఆర్, చిరంజీవి.. అసలు వాళ్లెందుకు ఉన్నారు?
నాని ది ప్యారడైజ్‌లో ఎన్టీఆర్, కేసీఆర్, చిరంజీవి.. అసలు వాళ్లెందుకు ఉన్నారు?

కేవలం నాని మాస్ యాక్షన్ మాత్రమే కాకుండా, ఈ కథలో శ్రీకాంత్ ఒదెల నింపిన అనేక రియల్ లైఫ్ రెఫరెన్సులు, రాజకీయ ప్రముఖుల పోలికలు ఉన్న పాత్రలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

కేసీఆర్, ఎన్టీఆర్ పాత్రల ఎంట్రీ.. థియేటర్లలో పూనకాలు!

కథ మధ్యలో నాని పోషించిన 'జడల్' పాత్ర, అతని గూడెం ప్రజలు అణచివేతపై తిరుగుబాటు చేస్తున్న సమయంలో 'శంకరన్న' అనే కొత్త పాత్ర ప్రవేశిస్తుంది. నటుడు ప్రియదర్శి పోషించిన ఈ శంకరన్న పాత్ర 'సవారీ' తెగ ప్రజల కష్టాలను అర్థం చేసుకుని, వారికి హక్కులు కల్పిస్తానని మాటిస్తాడు.

సినిమాలో ఎక్కడా నేరుగా పేరు చెప్పనప్పటికీ.. ఆ పాత్ర పెట్టుకున్న బొట్టు, ఆయన శైలి, మాట్లాడిన సంభాషణలు చూస్తే అది కచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రారంభ రాజకీయ జీవితాన్ని ప్రతిబింబిస్తోందని అర్థమవుతుంది. 1980ల కాలంలో కేసీఆర్ యూత్ కాంగ్రెస్‌లో కీలక నాయకుడిగా ఎదిగిన తీరును ఈ పాత్ర ద్వారా ఆవిష్కరించారు.

మాజీ సీఎం ఎన్టీఆర్ పాత్రే

సినిమా ముగింపు ఘట్టంలో శంకరన్న ఆ గూడెం ప్రజలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రినే నేరుగా తీసుకొస్తాడు. అక్కడ కనిపించే ఆ సీఎం విగ్రహచ్ఛాయలు (Silhouette), గంభీరమైన రూపాన్ని చూస్తే అది దివంగత ప్రజా నాయకుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పాత్రేనని అనుమానం రాక మానదు. థియేటర్లలో ఎన్టీఆర్ కటౌట్ తరహా నీడ కనిపించగానే నందమూరి అభిమానులు ఈలలు, కేరింతలతో రచ్చ చేస్తున్నారు.

గద్దర్ నుంచి చిరంజీవి దాకా.. పక్కా రెట్రో వైబ్స్

మరోవైపు మోహన్ బాబు పోషించిన 'శిఖంజా మాలిక్' పాత్ర ఫైటింగ్ స్టైల్ చూస్తే 'భారతీయుడు' సినిమాలో కమల్ హాసన్ సేనాపతి పాత్ర గుర్తుకురాక మానదు. అంతేకాకుండా, నాటి పంజాబ్ విప్లవ గాయకుడు అమర్ సింగ్ చంకీలా సంగీతాన్ని వినే పంజాబీ పోలీస్ అధికారి పాత్రను కూడా కథలో భాగం చేశారు.

హైదరాబాద్ నేటివిటీ.. ప్యారడైజ్ బిర్యానీ టచ్

కథ నడిచే ప్రాంతాన్ని 'ప్యారడైజ్' అనే ఊహాజనిత నగరంగా చూపించినప్పటికీ, పాతబస్తీ సందులు, ప్రసిద్ధ లిబర్టీ కేఫ్, ప్యారడైజ్ బిర్యానీ వంటి ల్యాండ్‌మార్క్‌లు హైదరాబాద్ నేటివిటీని స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. ఒక భూస్వామి అణచివేతకు గురైన తెగ తరఫున నాయకుడు ఎలా పోరాడాడు అనే కథకు నైజాం సంస్కృతిని, రాజకీయ పరిణామాలను జోడించి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా మలిచారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks