OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో 11 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 6 మాత్రం చాలా ఇంట్రెస్టింగ్- ఎక్కడెక్కడ చూడాలంటే?
OTT Release Movies Telugu: ఓటీటీలోకి గత వారం తెలుగులో 11 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు అన్నీ స్పెషల్‌గానే ఉండగా ఆరు సినిమాలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఆహా నుంచి ఈటీవీ విన్ వరకు, రొమాంటిక్ నుంచి యాక్షన్ థ్రిల్లర్ దాకా ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో 11 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో రొమాంటిక్, అడ్వెంచర్, ఫ్యామిలీ డ్రామా, క్రైమ్ డాక్యుమెంటరీ, యాక్షన్ థ్రిల్లర్ వంటి అన్ని జోనర్లతో సినిమాలు ఉన్నాయి.

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్
అలాగే, ఈ సినిమాలన్నీ ఆహా, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, లయన్స్ గేట్ ప్లే, సన్ నెక్ట్స్, జీ5, ఈటీవీ విన్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ప్రీమియర్ అవుతున్నాయి. మరి ఆ ఓటీటీ రిలీజ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆహా ఓటీటీ
సైక్ సిద్ధార్థ (తెలుగు డార్క్ కామెడీ రొమాంటిక్ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 4
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
నారీ నారీ నడుమ మురారి (తెలుగు రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామా సినిమా)- ఫిబ్రవరి 4
మహాసెన్హా (తెలుగు డబ్బింగ్ తమిళ మైథలాజికల్ జంగిల్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 5
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ లూసీ లెట్‌బై (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 4
జియో హాట్‌స్టార్ ఓటీటీ
థ్యాంక్ యూ డియర్ (హిందీ డబ్బింగ్ తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 5
ది రాజాసాబ్ (తెలుగు హారర్ ఫాంటసీ కామెడీ సినిమా)- ఫిబ్రవరి 6
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ
మాతృ (తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 6
గన్స్ అప్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ కామెడీ ఫిల్మ్)- ఫిబ్రవరి 6
సన్ నెక్ట్స్ ఓటీటీ
నీలకంఠ (తెలుగు రూరల్ యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 6
జీ5 ఓటీటీ
పరాశక్తి (తెలుగు డబ్బింగ్ తమిళ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- ఫిబ్రవరి 7
ఈటీవీ విన్ ఓటీటీ
గోల్డ్ అండ్ గీత (తెలుగు రొమాంటిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 8
ఓటీటీలోకి తెలుగులో 11 సినిమాలు
ఇలా గత వారం (ఫిబ్రవరి 2 నుంచి 8 వరకు) తెలుగు భాషలో 11 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో అన్నీ సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. అయితే, వీటన్నింటిలో చాలా ఇంట్రెస్టింగ్‌గా తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన 6 ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
6 ఇంట్రెస్టింగ్
ఆ 6 సినిమాల్లో ప్రభాస్ ది రాజా సాబ్, చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారిన నీలకంఠ, శ్రీరామ్ మూవీ మాతృ, ఈటీవీ విన్ కథా సుధా చిత్రం గోల్డ్ అండ్ గీత, హీరో నందు సైక్ సిద్ధార్థ, శర్వానంద్ సూపర్ హిట్ సంక్రాంతి మూవీ నారీ నారీ నడుమ మురారి సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


