OTT Telugu Releases: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 13 సినిమాలు- 5 చాలా ఇంట్రెస్టింగ్- ఏ ప్లాట్‌ఫామ్‌లో ఎన్ని మూవీస్ అంటే?

OTT Telugu Movies Release: ఓటీటీలోకి గత వారం ఏకంగా 13 సినిమాలు తెలుగు భాషలో స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు అన్నీ స్పెషల్‌గా ఉంటే తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన ఐదు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఆహా టు నెట్‌ఫ్లిక్స్ దాకా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న ఆ సినిమాలు చూద్దాం.

Jan 26, 2026, 06:44:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 13 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. హారర్ మిస్టరీ థ్రిల్లర్ నుంచి యాక్షన్ కామెడీ వరకు దాదాపుగా అన్ని రకాల జోనర్లలో ఈ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 13 సినిమాలు- 5 చాలా ఇంట్రెస్టింగ్- ఏ ప్లాట్‌ఫామ్‌లో ఎన్ని మూవీస్ అంటే?
ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 13 సినిమాలు- 5 చాలా ఇంట్రెస్టింగ్- ఏ ప్లాట్‌ఫామ్‌లో ఎన్ని మూవీస్ అంటే?

ఆహా టు లయన్స్ గేట్ ప్లే ఓటీటీ వరకు

అయితే, తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఆహా, ఈటీవీ విన్‌తోపాటు నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, లయన్స్ గేట్ ప్లేలలో ఓటీటీ ప్రీమియర్ అవుతున్న ఆ మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఆహా ఓటీటీ

శంబాల (తెలుగు ఫాంటసీ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- జనవరి 22

మారియో (తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఫిల్మ్)- జనవరి 23 (అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో కూడా)

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

జీరో డే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 20

ఫ్రీ బెర్ట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫ్యామిలీ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 22

తేరే ఇష్క్ మే (తెలుగు డబ్బింగ్ హిందీ రొమాంటిక్ థ్రిల్లర్ మ్యూజికల్ డ్రామా చిత్రం)- జనవరి 23

జియో హాట్‌స్టార్ ఓటీటీ

ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్‌డమ్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 19

మార్క్ (తెలుగు డబ్బింగ్ కన్నడ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 23

స్పేస్ జెన్: చంద్రయాన్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ బయోగ్రాఫికల్ డ్రామా వెబ్ సిరీస్ సిరీస్)- జనవరి 23

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

చీకటిలో (తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 23

స్ల్పిట్స్‌విల్లా (తెలుగు డబ్బింగ్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- జనవరి 23

ఈటీవీ విన్ ఓటీటీ

సంధ్యానామ ఉపాసతే (తెలుగు లాక్‌డౌన్ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్)- జనవరి 22

గొల్ల రామవ్వ (తెలుగు పీరియాడిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా మూవీ)- జనవరి 25

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

ఆఫ్టర్‌బర్న్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ పోస్ట్ అపోకలిప్టిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీ చిత్రం)- జనవరి 23

ఓటీటీలోకి తెలుగులో 13

ఇలా గత వారం (జనవరి 19 నుంచి 25 వరకు) తెలుగులో ఏకంగా 13 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో అన్నీ సినిమాలు డిఫరెంట్ జోనర్లతో చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

చాలా ఇంట్రెస్టింగ్‌గా 5

అయితే, వీటిలో తెలుగులో స్ట్రయిట్ చిత్రాలుగా ఆది సాయి కుమార్ హారర్ మిస్టరీ శంబాల, హెబ్బా పటేల్ బోల్డ్ థ్రిల్లర్ మారియో, శోభిత ధూళిపాళ క్రైమ్ థ్రిల్లర్ చీకటిలో, తాళ్లూరి రామేశ్వరి పీరియాడిక్ డ్రామా గొల్ల రామవ్వ, ఈవిన్ కథా సుధా చిత్రం సంధ్యానామ ఉపాసతే వంటి 5 మూవీస్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More