...
...
Next Story

OTT Horror: ఓటీటీలోకి తెలుగులో వచ్చిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్- పేద యువతి, రిచ్ ఫ్యామిలీ మధ్య దాగిన రక్తచరిత్ర!

The Invitation OTT Streaming In Telugu: డీఎన్‌ఏ పరీక్ష ద్వారా లండన్‌లోని సంపన్న బంధువులను కనుగొన్న ఒక పేద యువతి, వారి రాయల్ వెడ్డింగ్‌కు వెళ్లి ఎలాంటి భయానక పరిస్థితులను ఎదుర్కొందనేది ది ఇన్విటేషన్ కథ. నిన్నటి నుంచి తెలుగులో ది ఇన్విటేషన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అదెక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Sep 17, 2026, 05:35:52 IST
Advertisement

The Invitation OTT Release Telugu: హాలీవుడ్‌లో గోథిక్ హారర్ థ్రిల్లర్ చిత్రాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. పాతకాలపు పెద్ద భవనాలు, నిశ్శబ్ద వాతావరణం, రహస్యంగా సాగే చావులు.. ఈ జోనర్ ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి.

ఓటీటీలోకి ది ఇన్విటేషన్

ఓటీటీలోకి తెలుగులో వచ్చిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్- పేద యువతి, రిచ్ ఫ్యామిలీ మధ్య దాగిన రక్తచరిత్ర!
ఓటీటీలోకి తెలుగులో వచ్చిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్- పేద యువతి, రిచ్ ఫ్యామిలీ మధ్య దాగిన రక్తచరిత్ర!

సరిగ్గా ఇదే తరహా కథాంశంతో దర్శకురాలు జెస్సికా ఎమ్. థాంప్సన్ తెరకెక్కించిన సైకలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'ది ఇన్విటేషన్'. ఇక ఇలాంటి సినిమాలను ఓటీటీల్లో చూసేందుకు ఆడియెన్స్ మరింత ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటి వారికోసమే ది ఇన్విటేషన్ ఓటీటీలోకి వచ్చేసింది.

అసలు కథేంటంటే?

న్యూయార్క్ నగరంలో నివసించే ఈవీ (నాతలీ ఇమ్మాన్యుయేల్) ఒక సాధారణ క్యాటరింగ్ ఉద్యోగి. కొద్దిరోజుల క్రితమే తల్లిని కోల్పోయి ఒంటరితనంతో బాధపడుతున్న ఆమె, తన కుటుంబ మూలాలను తెలుసుకోవడానికి ఒక డీఎన్‌ఏ టెస్ట్ కిట్‌ను ఉపయోగిస్తుంది. ఆ పరీక్ష ద్వారా ఇంగ్లాండ్‌లో తనకు కొంతమంది ధనిక బంధువులు ఉన్నారని తెలుస్తుంది.

ఆ బంధువుల్లో ఒకరైన ఆలివర్ (హ్యూ స్కిన్నర్) ఆమెను కలిసి, ఇంగ్లాండ్‌లోని యార్క్‌షైర్‌లో జరగబోయే ఒక విలాసవంతమైన వివాహ వేడుకకు ఆహ్వానిస్తాడు. కొత్త బంధువులను పరిచయం చేసుకోవచ్చనే ఆశతో ఈవీ అక్కడికి వెళ్తుంది.

భయపెట్టించే సీన్స్

ఆ రాజభవనంలో ఆమెకు ఆ భవన యజమాని, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉన్న వాల్ట్ (థామస్ డోహెర్టీ) పరిచయమవుతాడు. మొదట్లో అంతా సజావుగానే సాగినప్పటికీ, రానురానూ ఆ భవనంలో నీడలా దాగి ఉన్న భయానక నిజాలు బయటపడటం మొదలవుతాయి. అసలు వారి కుటుంబంలో దాగిన రక్తచరిత్ర ఏంటీ అనేదే మిగతా కథ.

'గెట్ అవుట్' ఛాయలు.. గోథిక్ హారర్ మెరుపులు

భవనంలోని పనిమనుషులు చీకటి నిండిన వైన్ సెల్లార్లలోకి, లైబ్రరీల్లోకి వెళ్లినప్పుడు మాయమైపోవడం లాంటి దృశ్యాలు భయాందోళనను పెంచుతాయి. ప్రఖ్యాత నవలా రచయిత బ్రామ్ స్టోకర్ రాసిన 'డ్రాక్యులా' కథల ఛాయలు ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తాయి. అద్దాలు విరిగిపోవడం, మీనా-జోనాథన్ హార్కర్ అనే దంపతుల పాత్రలు కథలో రావడం వంటివి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తాయి.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

భయపెట్టే సన్నివేశాలతో తెరకెక్కిన ది ఇన్విటేషన్ సినిమాకు ఐఎమ్‌డీబీలో 6.6 రేటింగ్ వచ్చింది. అంతేకాకుండా రొట్టెన్ టోమాటోస్ నుంచి 90 శాతం ఫ్రెష్ కంటెంట్ అని కితాబు అందుకుంది. ఇలాంటి ది ఇన్విటేషన్ ఓటీటీలో నిన్నటి నుంచి అంటే సెప్టెంబర్ 16 నుంచి అందుబాటులో ఉంది.

మరో రెండింట్లో ది ఇన్విటేషన్ ఓటీటీ స్ట్రీమింగ్

జియో హాట్‌స్టార్‌లో ది ఇన్విటేషన్ ఓటీటీ రిలీజ్ అయింది. తెలుగు, హిందీ, తమిళం వంటి 3 భాషల్లో జియోహాట్‌స్టార్‌లో ది ఇన్విటేషన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇదే కాకుండా ఇంతకుముందే అమెజాన్ ప్రైమ్, జీ5 ఓటీటీల్లో కూడా ది ఇన్విటేషన్ అందుబాటులో ఉంది. కానీ, ప్రైమ్ వీడియో, జీ5లలో రెంటల్ విధానంలో మాత్రమే ది ఇన్విటేషన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks