OTT Telugu: ఓటీటీలోకి తెలుగు మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్- శాపం, 33 ఏళ్లకే మరణం- 9.5 రేటింగ్, ట్విస్టులు- 5 భాషల్లో!
Mahendragiri Varahi OTT Release: ఓటీటీలోకి తెలుగు మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా మహేంద్రగిరి వారాహి వచ్చేయనుంది. సుమంత్, మీనాక్షి గోస్వామి, సిద్ధు జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్ నటించిన ఈ సినిమా ట్విస్టులతో సాగుతుంది. ఇలాంటి మహేంద్రగిరి వారాహి ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.
Mahendragiri Varahi OTT Streaming: మిస్టరీ, థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్‌తో వచ్చే సినిమాలంటే తెలుగు ఓటీటీ ప్రియులకు అమితమైన ఇంట్రెస్ట్. అలాంటి ఆడియెన్స్ కోసమే తెలుగులో విభిన్న ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ ఈ మిస్టరీ థ్రిల్లర్స్‌ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్.

మైథలాజికల్ మిస్టరీ హారర్ థ్రిల్లర్
అలా రీసెంట్‌గా తెలుగులో వచ్చిన మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా మహేంద్రగిరి వారాహి. డివోషనల్‌కి మిస్టరీ, సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ యాడ్ చేసి రూపొందించిన సినిమానే ఇది. ఈ సినిమాలో సుమంత్, మీనాక్షి గోస్వామి హీరో హీరోయిన్లుగా నటించారు.
సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన మహేంద్రగిరి వారాహి సినిమాలో క్రేజీ హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రల్లో మెరిశారు. వీరితోపాటు కమల్ కామరాజు, మాళవిక నాయర్, బ్రహ్మానందం, మంజు భార్గవి, వంశీ చాగంటి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
ఐఎమ్‌డీబీ రేటింగ్ 9.5
సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైన మహేంద్రగిరి వారాహి సినిమాలో మంచి ట్విస్టులు, ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకునేలా ఉందని ప్రశంసలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మహేంద్రగిరి వారాహి సినిమాకు ఐఎమ్‌డీబీలో ఏకంగా 9.5 రేటింగ్ వచ్చింది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం సమీపంలో ఉన్న మహేంద్రగిరి ఆలయం నేపథ్యంగా సాగుతుంది. వారాహి అమ్మవారి శాపం వల్ల ఒక రాజవంశంలోని మగవారందరూ తమ 33వ పుట్టినరోజునాడే వింతగా ప్రాణాలు కోల్పోతుంటారు.
హీరో తెలుసుకునే రహస్యాలేంటీ
అలా తన కొడుకు రాజేంద్ర వర్మ (సిద్ధు జొన్నలగడ్డ)ను కోల్పోయిన ఆ కుటుంబ పెద్ద (మంజు భార్గవి), తన మనవడు నాగేంద్ర వర్మ (వంశీ చాగంటి)ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది. మరోవైపు హైదరాబాద్‌లో యూట్యూబర్‌గా పనిచేసే సిద్ధార్థ్ (సుమంత్), తన అన్నయ్య రాజీవ్ (కమల్ కామరాజు)తో కలిసి మహేంద్రగిరి ఆలయానికి వస్తాడు.
యాదృచ్ఛికంగా నాగేంద్ర వర్మ, రాజీవ్ ఇద్దరి పుట్టినరోజు ఒకే రోజు కావడంతో, వారిద్దరూ గుడిలోనే అనుమానాస్పద స్థితిలో మరణిస్తారు. అసలు తన అన్న ఎందుకు చనిపోయాడో, 33 ఏళ్ల శాపం వెనుక ఉన్న రహస్యమేంటో ఛేదించేందుకు సిద్ధార్థ్ పరిశోధన మొదలుపెడతాడు. ఆ ఇన్వెస్టిగేషన్‌లో సిద్ధార్థ్‌కి తెలిసిన రహస్యాలేంటీ అనేదే మిగతా కథ.
మహేంద్రగిరి వారాహి ఓటీటీ రైట్స్
ఇలాంటి మహేంద్రగిరి వారాహి ఓటీటీలోకి వచ్చేయనుంది. మహేంద్రగిరి వారాహి ఓటీటీ రైట్స్‌ను దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. కాబట్టి అమెజాన్ ప్రైమ్‌లో మహేంద్రగిరి వారాహి ఓటీటీ రిలీజ్ కానుంది. అక్టోబర్ 2 నుంచి మహేంద్రగిరి వారాహి ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నట్లు సమాచారం.
దేవుడి ఆగ్రహం, రాజవంశానికి శాపం, వరుస మరణాలు అనగానే మనకు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి సినిమాను గుర్తు చేస్తుంది. డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి కూడా అదే తరహా కథను ఎంచుకున్నప్పటికీ.. 33 ఏళ్ల వయసు పరిమితి, పగతో కూడిన ఫ్లాష్ బ్యాక్‌తో కాస్త భిన్నంగా చెప్పే ప్రయత్నం చేశారు.
మహేంద్రగిరి వారాహి ఓటీటీ స్ట్రీమింగ్
సినిమా ప్రారంభం, మహేంద్రగిరి సంస్థానపు చరిత్ర, సిద్ధు జొన్నలగడ్డ పాత్ర ఎంట్రీతో కథ ఆసక్తికరంగానే మొదలవుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు సెకండాఫ్‌పై తీవ్ర ఉత్కంఠను పెంచుతాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని ట్విస్టులతో సాగే మహేంద్రగిరి వారాహి సినిమాను అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి 5 భాషల్లో ఎంచక్కా వీక్షించవచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


