Best OTT Telugu Dark Comedy Crime Thriller Movies To Watch: భారతీయ చలనచిత్ర రంగంలో సరికొత్త ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది టాలీవుడ్. ఒకప్పుడు కేవలం కమర్షియల్ హంగులతో కూడిన కామెడీ సినిమాలకే పరిమితమైన తెలుగు ప్రేక్షకులు, ఇప్పుడు వినూత్నమైన 'డార్క్ కామెడీ' (Dark Comedy) చిత్రాలను అమితంగా ఇష్టపడుతున్నారు.
బిబి పాయ్‌రా ఓటీటీ రిలీజ్ నేపథ్యంలో

ఇటీవల హోయ్‌చోయ్‌లో బెంగాలీ కామెడీ థ్రిల్లర్ బిబి పాయ్‌రా ఓటీటీ రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ భాషల్లో అలరించే డార్క్ కామెడీలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఓటీటీ ఆడియెన్స్. ఈ క్రమంలో తెలుగు డార్క్ కామెడీ థ్రిల్లర్స్ కోసం వెతుకలాట మొదలెట్టారు.
ఒకే ఓటీటీలో
అలాంటి వారికోసం సజెషన్ కింద ఒకే ఓటీటీలో తప్పక చూడాల్సిన ది బెస్ట్ 3 తెలుగు డార్క్ హ్యూమర్, క్రైమ్ కామెడీ సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్, వాటి ఐఎమ్‌డీబీ రేటింగ్స్, కథ, వాటిని ఎందుకు చూడాలో చెప్పే ఆసక్తికర అంశాలను ఇక్కడ తెలుసుకుందాం.
1. మత్తు వదలరా (Mathu Vadalara)
ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి కుమారుడు శ్రీసింహ హీరోగా, రితేష్ రాణా దర్శకత్వంలో వచ్చిన మత్తు వదలరా సినిమా ఒక విలక్షణమైన సస్పెన్స్ డార్క్ కామెడీ.
ఐఎమ్‌డీబీ రేటింగ్ (IMDb Rating): 8.2/10
{{/usCountry}}ఐఎమ్‌డీబీ రేటింగ్ (IMDb Rating): 8.2/10
{{/usCountry}}ఓటీటీ ప్లాట్‌ఫామ్ (OTT Platform): అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
కథ (Story Plot): తక్కువ జీతంతో విసిగిపోయిన ఒక డెలివరీ బాయ్.. కస్టమర్ల దగ్గర చిన్న చిన్న మోసాలు చేసి డబ్బు సంపాదించాలనుకుంటాడు. అలా వెళ్లిన మొదటి ఇంట్లోనే ఒక వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. ఆ క్రైమ్ సీన్ నుంచి తప్పించుకోవడానికి అతడు పడే పాట్లు, డ్రగ్స్ మాఫియా లింకులు ఈ సినిమాలో చూడొచ్చు.
చూడాల్సిన ఆసక్తికర అంశాలు (Interesting Elements): 'సత్య' పోషించిన యేసు పాత్ర కామెడీ టైమింగ్ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. టీవీ సీరియల్స్‌పై వచ్చే సెటైర్లు, వినూత్నమైన స్క్రీన్‌ప్లే ప్రేక్షకుడికి సరికొత్త థ్రిల్‌ను ఇస్తాయి.
2. బ్రోచేవారెవరురా (Brochevarevarura)
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన ఈ చిత్రం క్లాసిక్ డార్క్ హ్యూమర్‌కు అద్భుతమైన ఉదాహరణ.
ఐఎమ్‌డీబీ రేటింగ్: 8.0/10
ఓటీటీ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో
కథ: చదువులో వెనుకబడిన ముగ్గురు స్నేహితులు (R3 గ్యాంగ్) తమ క్లాస్‌మేట్ అయిన మిత్ర అనే అమ్మాయికి సహాయం చేయడానికి ఒక 'ఫేక్ కిడ్నాప్' ప్లాన్ చేస్తారు. కానీ, ఆ ప్లాన్ రియల్ కిడ్నాప్‌గా మారి ఎలా మిస్ ఫైర్ అయింది? మరోవైపు ఒక సినిమా దర్శకుడి ఈ ముగ్గురి ఫ్రెండ్స్ కథతో ఎలా ముడిపడి ఉందనేదే స్టోరీ.
చూడాల్సిన ఆసక్తికర అంశాలు: రెండు వేర్వేరు కథలను ఇంటర్లింక్ చేసిన విధానం అద్భుతంగా ఉంటుంది. క్రైమ్ ఎలిమెంట్స్ నడుస్తున్నా, ముగ్గురు మిత్రుల మధ్య సాగే సంభాషణలు సున్నితమైన హాస్యాన్ని పంచుతాయి.
3. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (Agent Sai Srinivasa Athreya)
స్వరూప్ ఆర్ఎస్జె దర్శకత్వంలో నవీన్ పొలిశెట్టి డిటెక్టివ్‌గా నటించిన ఈ చిత్రం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అయినప్పటికీ, అంతర్లీనంగా సాగే డార్క్ హ్యూమర్ సినిమాకు అదనపు హైలెట్‌గా నిలిచింది.
ఐఎమ్‌డీబీ రేటింగ్: 8.4/10
ఓటీటీ ప్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
కథ: నెల్లూరులో చిన్న చిన్న కేసులను పరిష్కరించే డిటెక్టివ్ ఆత్రేయ.. రైల్వే ట్రాక్‌ల పక్కన దొరికే గుర్తుతెలియని శవాల వెనుక ఉన్న ఒక పెద్ద అంతర్జాతీయ నేర ముఠా మిస్టరీని ఎలా ఛేదించాడనేది కథ.
చూడాల్సిన ఆసక్తికర అంశాలు: నెల్లూరు బ్యాక్‌డ్రాప్‌లో నవీన్ పొలిశెట్టి చేసే డిటెక్టివ్ స్టంట్స్, శెట్టి మార్క్ హ్యూమర్ నవ్విస్తూనే.. దేశంలో జరుగుతున్న ఒక తీవ్రమైన క్రైమ్ స్కామ్‌ను కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. ముఖ్యంగా నవీన్ చెప్పే డైలాగ్స్, యాక్టింగ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎంతో ఆకట్టుకుంటాయి.