TV Pair Akanksha Gaurav Divorce Announcement In OTT Show: బుల్లితెరపై మోస్ట్ అడోరబుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ప్రముఖ టీవీ నటుడు, బిగ్ బాస్ గత సీజన్ 19 విజేత గౌరవ్ ఖన్నా, నటి ఆకాంక్ష చమోలా వైవాహిక బంధం ముగింపు దశకు చేరింది.
ఓటీటీ షోలో క్లారిటీ

తాము విడాకులు తీసుకోబోతున్నామంటూ ఆకాంక్ష చేసిన అధికారిక ప్రకటన హిందీ టెలివిజన్ రంగంతో పాటు సోషల్ మీడియా ప్రపంచంలో తీవ్ర కలకలం రేపుతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా గ్రాండ్‌గా ప్రారంభమైన పాపులర్ ఓటీటీ బోల్డ్ రియాలిటీ షో 'లాక్ అప్' సీజన్ 2 వేదికగా ఆమె ఈ సంచలన నిజాన్ని బయటపెట్టారు.
'లాక్ అప్ 2' షోలో ఆకాంక్ష చమోలా ఒక కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ ఓటీటీ షో ప్రీమియర్ ఎపిసోడ్‌లో హోస్ట్‌లు ఫరా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆకాంక్ష తన జీవితంలోని అతిపెద్ద రహస్యాన్ని పంచుకున్నారు. తాము గత ఏడాది కాలంగా విడిగా ఉంటున్నామని చెబుతూ అందరికీ షాక్ ఇచ్చారు. గౌరవ్ ఖన్నాతో విడిపోవడంపై ఆకాంక్ష షో వేదికగా స్పష్టత ఇచ్చారు.
ఏడాదిగా విడివిడిగానే.. అసలు కారణం ఇదే!
"మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ, భాగస్వాములుగా మా ఆలోచనలు కలవడం లేదు. భవిష్యత్తు గురించి మా ఇద్దరి అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. దురదృష్టవశాత్తూ ఆ భవిష్యత్తులో మేమిద్దరం కలిసి ఉండలేము. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నాం" అని ఆకాంక్ష క్లారిటీ ఇచ్చారు.
ఈ ప్రకటన విన్న హోస్ట్‌లు ఫరా ఖాన్, రితేష్ దేశ్ముఖ్తో పాటు షోలో ఉన్న మిగతా కంటెస్టెంట్లు కూడా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. నిజానికి ఈ ఏడాది జనవరిలోనే వీరిద్దరి బంధంపై సోషల్ మీడియాలో కొన్ని ఊహాగానాలు వచ్చాయి.
హృదయమే బలి అవుతుంది
{{/usCountry}}ఈ ప్రకటన విన్న హోస్ట్‌లు ఫరా ఖాన్, రితేష్ దేశ్ముఖ్తో పాటు షోలో ఉన్న మిగతా కంటెస్టెంట్లు కూడా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. నిజానికి ఈ ఏడాది జనవరిలోనే వీరిద్దరి బంధంపై సోషల్ మీడియాలో కొన్ని ఊహాగానాలు వచ్చాయి.
హృదయమే బలి అవుతుంది
{{/usCountry}}"కేవలం అవసరాల కోసమే బంధాలు ఏర్పడినప్పుడు, ఎప్పుడూ హృదయమే బలి అవుతుంది" అంటూ ఆకాంక్ష అప్పట్లో హిందీలో పెట్టిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పుడు ఆకాంక్ష నేరుగా విడాకుల విషయం చెప్పడంతో ఆ అనుమానాలన్నీ నిజమయ్యాయి.
ఆడిషన్‌లో చిగురించిన ప్రేమ..
ఆకాంక్ష చమోలా 'సంతోషి మా', 'యే హై ఆషికి', 'క్రైమ్ పెట్రోల్' వంటి పాపులర్ బుల్లితెర షోల ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక ఆడిషన్ సమయంలో గౌరవ్ ఖన్నాను కలిసిన ఆకాంక్ష, కొన్నాళ్ల డేటింగ్ తర్వాత అతనితో ప్రేమలో పడ్డారు.
కాన్పూర్‌లో ఘనంగా పెళ్లి
వీరిద్దరూ నవంబర్ 24, 2016న గౌరవ్ స్వస్థలమైన కాన్పూర్‌లో మూడు రోజుల పాటు ఎంతో వైభవంగా వివాహం చేసుకున్నారు. బుల్లితెరపై ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట తొమ్మిదో పడిలోకి అడుగుపెట్టే లోపే ఇలా విడిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
పిల్లల విషయంలో భిన్నాభిప్రాయాలు
గతంలో గౌరవ్ ఖన్నా బిగ్‌బాస్ 19 హౌస్‌లో ఉన్నప్పుడు తన వైవాహిక జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తోటి కంటెస్టెంట్, యూట్యూబర్ మృదుల్ తివారీతో గార్డెన్ ఏరియాలో ముచ్చటిస్తూ పితృత్వం (ఫాదర్‌హుడ్) పై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. తమకు పెళ్లయి తొమ్మిదేళ్లు కావస్తున్నా పిల్లలు ఎందుకు లేరనే ప్రశ్నకు గౌరవ్ అప్పట్లో సున్నితంగా సమాధానం ఇచ్చారు.
"నాకు పిల్లలు కావాలని ఉంది, కానీ నా భార్యకు ఇష్టం లేదు. మాది ప్రేమ వివాహం కాబట్టి ఆమె నిర్ణయాన్ని గౌరవించక తప్పదు. ప్రేమించినప్పుడు అన్నింటికీ కట్టుబడి ఉండాలి కదా!" అని గౌరవ్ ఖన్నా అప్పుడు అలా వ్యాఖ్యానించారు.
సమర్ధించిన గౌరవ్
తన భార్య ఆలోచనలోనూ న్యాయముందని గౌరవ్ సమర్థించారు. ఇద్దరం రోజంతా షూటింగ్‌లతో బిజీగా ఉంటే పిల్లల బాధ్యతలను ఇతరుల చేతుల్లో పెట్టడం ఆకాంక్షకు ఇష్టం లేదని, అందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని అప్పట్లో గౌరవ్ చెప్పారు.
వైవాహిక విబేధాలే
భార్య నిర్ణయానికి అంతలా విలువ ఇచ్చే భర్త దొరికినా, వారి మధ్య వచ్చిన వైవాహిక విబేధాలే చివరికి విడాకుల వరకు దారితీశాయని బాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.