Varanasi OTT Rights And Non Theatrical Business Details: తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కలసి చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'. సుమారు రూ. 1000 కోట్లకుపైగా బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
టైమ్ ట్రావెల్, రామాయణ బ్యాక్‌డ్రాప్

టైమ్ ట్రావెల్, రామాయణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ రిలీజ్‌కు ముందే సినీ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తోంది. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధిక బడ్జెట్‌తో నిర్మిస్తున్న వారణాసి ఓటీటీ వ్యాపారంలో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది.
వారణాసి ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్
సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వారణాసి ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.650 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కేవలం ఓటీటీ హక్కుల రూపంలోనే సినిమా నిర్మాణ వ్యయంలో దాదాపు 80 శాతానికి పైగా వారణాసి సినిమాకు వెనక్కి రావడం విశేషం.
దీనికితోడు టీ-సిరీస్ సంస్థ ఆడియో హక్కులను రూ.50 కోట్లకు దక్కించుకోగా, శాటిలైట్ హక్కులు కూడా రూ.150 కోట్ల వరకు పలికే అవకాశం ఉంది. ఈ లెక్కన నాన్-థియేట్రికల్ వ్యాపారం రూపంలోనే సుమారు రూ.850 కోట్లు ఇప్పటికే ఖరారైనట్లు ఇండస్ట్రీ టాక్.
థియేట్రికల్ బిజినెస్.. ఓవర్సీస్‌లో భారీ ప్లాన్
వారణాసి సినిమా లాభాల్లోకి రావాలంటే థియేటర్ల ద్వారా రూ.450 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్ల నుంచి రూ.900 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తే సరిపోతుంది. రాజమౌళి గత చిత్రాలైన 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' సాధించిన వసూళ్లతో పోలిస్తే, తొలి నాలుగైదు రోజుల్లోనే ఈ మార్కును దాటడం ఏమాత్రం కష్టం కాదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
{{/usCountry}}వారణాసి సినిమా లాభాల్లోకి రావాలంటే థియేటర్ల ద్వారా రూ.450 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్ల నుంచి రూ.900 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తే సరిపోతుంది. రాజమౌళి గత చిత్రాలైన 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' సాధించిన వసూళ్లతో పోలిస్తే, తొలి నాలుగైదు రోజుల్లోనే ఈ మార్కును దాటడం ఏమాత్రం కష్టం కాదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
{{/usCountry}}ఇక అంతర్జాతీయ స్థాయిలో వారణాసి సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు గట్టి ప్రణాళికలు రచిస్తున్నారు. అమెరికా, కెనడా ప్రాంతాల్లో ప్రముఖ లైట్‌స్టార్మ్ సంస్థ ద్వారా ఒక పెద్ద పంపిణీ సంస్థతో కలసి చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కావడంతో గ్లోబల్ ఆడియన్స్‌ను ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్ డీల్ ఆలస్యం వెనుక కారణాలు
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా తన అంతర్గత నిర్వహణలో కొన్ని మార్పులు చేపడుతోంది. ఉద్యోగుల కోత, ఉన్నతాధికారుల మార్పుల వల్ల కొత్త ప్రాజెక్ట్‌ల కొనుగోలు ప్రక్రియలో కొంత ఆలస్యం జరుగుతోంది.
'వారణాసి' నిర్మాతలు ఆరంభంలోనే రూ.500 కోట్లకు పైగా ఓటీటీ ఆఫర్ ఆశించినప్పటికీ, ప్రస్తుతం చర్చలు చివరి దశకు చేరి ఒప్పందం ఖరారు కావాల్సి ఉంది. ఈ అంతర్గత పునర్వ్యవస్థీకరణ కారణంగా ఓటీటీ అధికారిక ప్రకటనలో కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
షూటింగ్ అప్‌డేట్.. ఏప్రిల్ 2027న గ్రాండ్ రిలీజ్
ఈ భారీ ప్రాజెక్ట్‌లో మహేశ్ బాబుకు జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, పవర్‌ఫుల్ విలన్ పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపిస్తున్నారు. మహేశ్ బాబు తన భాగానికి సంబంధించిన చిత్రీకరణను ఇప్పటికే పూర్తి చేశారు.
ప్రస్తుతం మిగిలిన కీలక సన్నివేశాలను రాజమౌళి అత్యంత శ్రద్ధతో చిత్రీకరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, ఈ దృశ్యకావ్యాన్ని ఏప్రిల్ 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.