Ranabaali OTT Streaming And Jailer 2 OTT Release: బిగ్ స్క్రీన్లపై భారీ అంచనాల మధ్య విడుదలైన మోస్ట్ అవైటెడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. థియేటర్లలో ప్రేక్షకులను ఊపేస్తున్న ఆ రెండు సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని డిజిటల్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
ఓటీటీలోకి రణబాలి, జైలర్ 2

ఆ రెండు మరేవో కావు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న రజనీకాంత్ 'జైలర్ 2', విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నాల 'రణబాలి'. థియేట్రికల్ రిలీజ్‌కు వచ్చిన కొత్త సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ఆసక్తి నెలకొంటుందన్న విషయంతెలిసిందే. ఈ క్రమంలోనే రణబాలి, జైలర్ 2 డిజిటల్ రైట్స్, ఓటీటీ స్ట్రీమింగ్ తేదీలపై ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వచ్చిన 'జైలర్ 2' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 125.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డు నెలకొల్పింది.
రూ. 160 కోట్లకు 'జైలర్ 2' ఓటీటీ హక్కులు!
సన్ పిక్చర్స్ నిర్మించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ 2 ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ట్రేడ్ వర్గాల ప్రకారం జైలర్ 2 ఓటీటీ రైట్స్ డీల్ ఏకంగా రూ. 160 కోట్లకు కుదిరిందని సమాచారం. నిబంధనల ప్రకారం థియేట్రికల్ రన్ ముగిసిన నాలుగు వారాలకు జైలర్ 2 ఓటీటీ రిలీజ్ కానుందని తెలుస్తోంది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం 4 భాషల్లో ఏకకాలంలో అమెజాన్ ప్రైమ్‌లో జైలర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అయితే, నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి జైలర్ 2 రానుందని టాక్ నడుస్తోంది. దీనిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.
రణబాలి ఓటీటీ రైట్స్
{{/usCountry}}తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం 4 భాషల్లో ఏకకాలంలో అమెజాన్ ప్రైమ్‌లో జైలర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అయితే, నవంబర్ 12న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి జైలర్ 2 రానుందని టాక్ నడుస్తోంది. దీనిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.
రణబాలి ఓటీటీ రైట్స్
{{/usCountry}}రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వివాహం తర్వాత జంటగా నటించిన తొలి చిత్రం 'రణబాలి'. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 1870ల నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ కరువు, బ్రిటీష్ దురాగతాలపై ప్రజల తిరుగుబాటు నేపథ్యంలో ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రూపుదిద్దుకుంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ రూ. 120 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో 'ది మమ్మీ' ఫేమ్ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ విలన్‌గా నటించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా రణబాలి థియేట్రికల్ హక్కులు రూ. 62 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం.
రూ. 145 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో 'రణబాలి' ధమాకా!
ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల రైట్సే రూ. 37 కోట్లు పలికాయట. బాక్సాఫీస్ వద్ద లాభాల్లోకి రావాలంటే రణబాలి చిత్రం రూ. 130 కోట్ల గ్రాస్ (రూ. 63 కోట్ల షేర్) రాబట్టాల్సి ఉంది. ఇదిలా ఉంటే, రణబాలి సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్ ద్వారానే రూ. 83 కోట్లు రాబట్టడం విశేషం.
ఇక రణబాలి ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ సంస్థ రూ. 55 కోట్లకు సొంతం చేసుకుందని సమాచారం. అలాగే, శాటిలైట్ హక్కులను జీ తెలుగు రూ. 15 కోట్లకు, ఆడియో హక్కులను టీ-సిరీస్ రూ. 5 కోట్లకు దక్కించుకున్నాయని తెలుస్తోంది. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ బిజినెస్ కలిపి మొత్తంగా రూ. 145 కోట్ల ప్రీ-రిలీజ్ మార్కెట్‌ను సాధించింది రణబాలి చిత్రం.
రణబాలి ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇక నవంబర్ 13న నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం 5 భాషల్లో రణబాలి ఓటీటీ రిలీజ్ కానుందని ప్రచారం సాగుతోంది. అయితే, దీనిపై మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. థియేటర్లలో రెస్పాన్స్ ఆధారంగా ఈ తేదీల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆ అధికారిక విడుదల తేదీలను ఓటీటీ సంస్థలు రిలీజ్‌కు కొన్ని రోజుల ముందు ప్రకటించే ఛాన్స్ ఉంది.