...
...
Next Story

Yash: ఇండస్ట్రీకి ఆయన డబ్బు సంపాదించడానికి రాలేదు.. ఒక్కో హీరోయిన్‌పై హీరో యశ్ కామెంట్స్

Yash Comments On Toxic Heroines: కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన లేటెస్ట్ సినిమా టాక్సిక్. ఐదుగురు హీరోయిన్లు నటించిన ఈ సినిమాకు లేడి డైరెక్టర్ దర్శకత్వం వహించారు. ఇటీవల నిర్వహించిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒక్కో హీరోయిన్‌పై హీరో యశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ విశేషాలపై లుక్కేద్దాం.

Published on: Aug 24, 2026, 23:11:20 IST
Advertisement

Yash Comments On Toxic Heroines: ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న సినిమా టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఆఫ్ అడల్ట్స్. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఐదుగురు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.

లేడి డైరెక్టర్ దర్శకత్వం

ఇండస్ట్రీకి ఆయన డబ్బు సంపాదించడానికి రాలేదు.. ఒక్కో హీరోయిన్‌పై హీరో యశ్ కామెంట్స్
ఇండస్ట్రీకి ఆయన డబ్బు సంపాదించడానికి రాలేదు.. ఒక్కో హీరోయిన్‌పై హీరో యశ్ కామెంట్స్

లేడి డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన టాక్సిక్ ఆగస్ట్ 26న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఇటీవల హైదరాబాద్‌లో టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో యశ్ చేసిన కామెంట్స్ ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి.

రాకింగ్ స్టార్ యశ్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ‘కేజీఎఫ్’ తర్వాత మీకు థాంక్స్ చెప్పడానికి కూడా నేను ఇక్కడికి రాలేదు. పనిలో నిమగ్నమైపోయాను. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని అన్నారు.

సినిమాకు సరిహద్దులు లేవు

"నిజాయితీ, సంకల్పంతో పని చేస్తే ప్రేక్షకులు ఎవరినైనా సపోర్ట్ చేస్తారని మీరు నిరూపించారు. సినిమాకు సరిహద్దులు లేవు. భాషను, సరిహద్దులను మించి మానవత్వం ఉంది, ప్రేమ ఉంది, నిజాయితీ ఉంది అని మీరు చూపించారు. అలాగే కర్ణాటకలో కూడా మేము తెలుగు ప్రజలను సినిమాలని ఎంతగానో ఇష్టపడతాం" అని యశ్ తెలిపారు.

"మన ఇండియన్ సినిమా ప్రపంచ స్థాయిలో నిలబడాలి. మనందరం కలిసి ఇండియన్ సినిమాను గ్లోబల్ సినిమాలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాలి. సినిమాను సీరియస్‌గా తీసుకోకండి. మేము చేసింది గొప్పగా ఏం లేదు" అని షాకింగ్ కామెంట్స్ చేశారు యశ్.

యశ్ మోటివేషన్

"‘టాక్సిక్’ సినిమా గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమాకు ఇండియా నుంచి బెస్ట్ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు పనిచేశారు. ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి చాలా ఎఫర్ట్ పెట్టారు. మీరందరూ ఇండియన్ సినిమా కోసం కలిసికట్టుగా రావాలని కోరుతున్నాను. మన ఇండియన్ సినిమా గురించి మనం గర్వపడేలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను" అని యశ్ కోరారు.

దిల్ రాజుకు మంచి దిల్ ఉంది

"‘కేజీఎఫ్’కు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన రవి బస్రూర్ ఈ సినిమాకు కూడా మ్యాజిక్ క్రియేట్ చేశారు. ఆహర్నిశలు ఈ సినిమా కోసం పనిచేశారు. ‘కేజీఎఫ్ 2’ సమయంలో దిల్ రాజు గారితో మాకు పరిచయం ఏర్పడింది. ఆయన చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. నిజంగా ఆయనకు చాలా మంచి దిల్ ఉంది. ఆయనతో కలిసి ఈ సినిమాను రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది" అని దిల్ రాజును యశ్ ప్రశంసించారు.

"కచ్చితంగా ఆడియన్స్‌కు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నాం. మా నిర్మాత కేవీఎన్ గారు ఇండస్ట్రీకి డబ్బు సంపాదించడానికి రాలేదు. ఫిలిం ఇండస్ట్రీకి తన వంతు సహకారం అందించాలని వచ్చారు. బెస్ట్ ప్రొడక్షన్ హౌస్‌గా మైల్‌స్టోన్ సినిమాలను నిర్మిస్తున్నారు" అని యశ్ చెప్పుకొచ్చారు.

హీరోయిన్లపై యశ్ కామెంట్స్

"హుమా ఖురేషి ప్రతి సన్నివేశంలో అద్భుతంగా నటించారు. కియారాతో మరోసారి ఆడియన్స్ ప్రేమలో పడిపోతారు. రుక్మిణి వసంత్‌తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. తను ప్రతి ఇండస్ట్రీలోనూ అద్భుతమైన సినిమాలు చేస్తోంది. లేడీ సూపర్‌స్టార్ నయనతార గారు ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేశారు" అని హీరోయిన్లపై యశ్ కామెంట్స్ చేశారు.

"‘టాక్సిక్’ పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుంది. మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను. ఇంతకంటే అద్భుతమైన సినిమాలు చేస్తాను. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు" అని యశ్ తన స్పీచ్ ముగించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks