...
...
Next Story

OTT Crime Thriller: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్- గిఫ్ట్ బాక్సుల్లో నరికిన చేతులు, ట్విస్టులు- 83 శాతం ఫ్రెష్, 7.9 రేటింగ్

Yuddham Sei OTT Streaming: ఓటీటీలో అదరగొడుతున్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా యుద్ధం సేయి. రాత్రివేళ నిర్మానుష్యమైన రోడ్లు, అందంగా ప్యాక్ చేసిన బహుమతుల బాక్సుల్లో మనుషుల నరికిన చేతులు వంటి థ్రిల్లింగ్ సీన్లు, ట్విస్టులతో సాగే యుద్ధం సేయి 2 ఓటీటీల్లో డిఫరెంట్ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.

Published on: Sep 7, 2026, 18:00:27 IST
Advertisement

Yuddham Sei OTT Release In 2 Platforms: రాత్రివేళ నిశ్శబ్దం, వర్షంలో తడిసిన చెన్నై వీధులు, అక్కడ అందంగా ప్యాక్ చేసిన బహుమతుల బాక్సుల్లో కనిపించే మనుషుల నరికిన చేతులు.. సన్నివేశం వినడానికే ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తోంది కదూ?

సీటు అంచున కూర్చోబెట్టేలా

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్- గిఫ్ట్ బాక్సుల్లో నరికిన చేతులు, ట్విస్టులు- 83 శాతం ఫ్రెష్, 7.9 రేటింగ్
ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్- గిఫ్ట్ బాక్సుల్లో నరికిన చేతులు, ట్విస్టులు- 83 శాతం ఫ్రెష్, 7.9 రేటింగ్

ఇలా సీటు అంచున కూర్చోబెట్టే ఆద్యంతం ఉత్కంఠభరిత అనుభూతిని ఇచ్చే సినిమా 'యుద్ధం సేయి' (Yutham Sei). సాధారణ క్రైమ్ థ్రిల్లర్లలో పోలీస్ ఆఫీసర్ అనగానే గాల్లోకి వాహనాలను లేపుతూ, భారీ డైలాగులు పేల్చే సీన్లు గుర్తుకొస్తాయి. కానీ ఈ చిత్రంలో డిటెక్టివ్ కథ పూర్తిగా వేరుగా ఉంటుంది.

అసలు ఏమిటీ 'యుద్ధం సెయ్'?

వైవిధ్యమైన సినిమాలకు పేరుగాంచిన తమిళ దర్శకుడు మిస్కిన్ (Mysskin) తెరకెక్కించిన ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ యుద్ధం సేయి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇందులో డిటెక్టివ్ జేకే పాత్రలో ప్రముఖ దర్శకుడు, నటుడు చేరన్ జీవించినంతంగా నటించారు.

ఒకవైపు కనిపించకుండా పోయిన తన సొంత చెల్లెలి కోసం మానసికంగా నరకం అనుభవిస్తూనే, మరోవైపు నగరంలో వరుసగా జరుగుతున్న దారుణ హత్యల గుట్టు విప్పే బాధ్యతను జేకే చేపడతారు. దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ అతడికి ఎదురయ్యే నిజాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తాయి.

సూపర్ కాప్ కాదు.. మనలాంటి సగటు మనిషి!

యుద్ధం సేయి సినిమా ప్రత్యేకత కథానాయకుడి పాత్ర రూపకల్పనలోనే ఉంది. జేకే ఏమీ తిరుగులేని వీరుడు కాదు. అతడికి సొంత బలహీనతలు ఉన్నాయి, తీవ్రమైన మానసిక ఆందోళన ఉంది. ప్రతీ సమస్యకు డిటెక్టివ్ రౌడీలను గాల్లోకి లేపుతూ సమాధానం చెప్పడు.

కథ కేవలం హంతకుడిని పట్టుకోవడంతోనే ముగిసిపోదు. రాజకీయ అవినీతి, అధికార దుర్వినియోగం, చట్టంలోని లోపాలను ఈ చిత్రం ఎత్తిచూపుతుంది. "వ్యవస్థే బాధితులకు న్యాయం చేయలేనప్పుడు, సగటు మనిషి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే తప్పేంటి?" అనే బలమైన ప్రశ్నను ఈ సినిమా ద్వారా దర్శకుడు మన ముందు ఉంచారు.

థ్రిల్ పంచే నైజం ఉన్న ఫైట్ సీన్లు, సంగీత దర్శకుడు 'కె' అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోశాయి. ఈ సినిమా విడుదలై దాదాపు 15 ఏళ్లు కావస్తున్నా, ఇప్పటికీ ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం సస్పెన్స్ మాత్రమే కాకుండా ఆలోచింపజేసే కథాంశంతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కచ్చితంగా చూడాల్సిన మాస్టర్‌పీస్.

యుద్ధం సేయి ఓటీటీ స్ట్రీమింగ్

ఇంతటీ క్రేజ్ తెచ్చుకున్న యుద్ధం సేయి సినిమాకు ఐఎమ్‌డీబీ (IMDb)లో 7.9 రేటింగ్ లభించింది. అలాగే, 83 శాతం ఫ్రెష్ కంటెంట్‌గా సర్టిఫికెట్ పొందింది. ఇలాంటి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ యుద్ధం సేయి ఓటీటీలో ఆకట్టుకుంటోంది.

యుద్ధం సేయి రెండు ఓటీటీల్లో అందుబాటులో ఉంది. జియో హాట్‌స్టార్‌లో యుద్ధం సేయి (Yuddham Sei) పేరుతో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. జీ5లో కూడా యుద్ధం సేయి ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, జీ5 ఓటీటీలో క్రైమ్ కేస్ 99 టైటిల్‌తో అందుబాటులో ఉంది. ఇలా రెండు డిఫరెంట్ టైటిల్స్‌తో 2 ఓటీటీల్లో యుద్ధం సేయి సినిమాను చూడొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe