Zee5 OTT Re Launch By New AI Features With 5 Categories: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఓటీటీ వినియోగం సరికొత్త ఎత్తులకు చేరుతోంది. డిజిటల్ మీడియా పోటీ తీవ్రమవుతున్న తరుణంలో, ప్రముఖ వీడియా స్ట్రీమింగ్ సంస్థ 'జీ5' (ZEE5) తమ ప్లాట్‌ఫామ్‌ను అత్యాధునికంగా అప్‌గ్రేడ్ చేసింది. యూజర్లకు డిజిటల్ వినోదాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కృత్రిమ మేధ (AI) సాంకేతికతను జోడించి ప్లాట్‌ఫారమ్‌ను సంస్కరించింది.
ఒకేరకమైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియెన్స్

స్మార్ట్ టీవీలు, మొబైల్ ఫోన్లలో ఒకే రకమైన వీక్షణ అనుభవాన్ని అందించడమే కాకుండా, యూజర్లు కోరుకునే కంటెంట్‌ను క్షణాల్లో గుర్తించేలా నావిగేషన్ వ్యవస్థను తీర్చిదిద్దారు. దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల ప్రేక్షకుల అభిరుచులను విశ్లేషించి, నిపుణులతో 'బగ్‌థాన్స్' నిర్వహించిన తర్వాతే ఈ మార్పులను అమల్లోకి తెచ్చారు.
ఏఐ ఆధారిత సెర్చ్.. క్లౌడ్ సెక్యూరిటీ
ఈ అప్‌డేట్‌లో ప్రధాన ఆకర్షణ ఏఐ పర్సనలైజేషన్. ప్రతీ వీక్షకుడి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా కంటెంట్‌ను ఏఐ సిఫార్సు చేస్తుంది. మొబైల్‌లో చూస్తున్న సినిమాను లేదా సిరీస్‌ను టీవీలో కొనసాగించేటప్పుడు ఎలాంటి అంతరాయం కలగకుండా స్లాట్-రహిత క్రాస్-స్క్రీన్ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు.
సబ్‌స్క్రిప్షన్లు, ప్లేబ్యాక్ లేదా యాప్ లాగిన్ సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి ప్రత్యేకంగా 'నెక్ట్స్-జెన్ ఏఐ కస్టమర్ అసిస్టెంట్' సేవలను ప్రవేశపెట్టారు. వినియోగదారుల వ్యక్తిగత వివరాల భద్రత కోసం అత్యున్నత స్థాయి క్లౌడ్ డేటా ప్రైవేసీ ప్రమాణాలను పాటించనున్నారు.
ఐదు విభాగాలు.. చందా లేని 'ఫ్రీ 5' ప్రపంచం
యూజర్ల సౌకర్యం కోసం ప్లాట్‌ఫారమ్‌ను ఐదు ప్రత్యేక విభాగాలుగా విభజించారు. ప్రీమియం ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్రీ 5, కిడ్జ్, టీవీ, స్పోర్ట్స్ పేరిట వీటిని అందుబాటులో ఉంచారు. వీటిలో 'ఫ్రీ 5' విభాగం ఉచిత వినోదానికి సరికొత్త వేదికగా మారనుంది.
ఎలాంటి చందా రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కొరియన్-చైనీస్ డ్రామాలు, యానిమే, మైక్రో డ్రామాలు, వార్తలను జీ5 ఓటీటీలో ఉచితంగా వీక్షించవచ్చు.
ఫిఫా వరల్డ్ కప్, హాలీవుడ్ వినోదం
{{/usCountry}}ఎలాంటి చందా రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కొరియన్-చైనీస్ డ్రామాలు, యానిమే, మైక్రో డ్రామాలు, వార్తలను జీ5 ఓటీటీలో ఉచితంగా వీక్షించవచ్చు.
ఫిఫా వరల్డ్ కప్, హాలీవుడ్ వినోదం
{{/usCountry}}క్రీడాభిమానుల కోసం అత్యంత ప్రజాదరణ పొందిన ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026, 2030) డిజిటల్ ప్రసార హక్కులను జీ5 కైవసం చేసుకుంది. వీటితో పాటు ప్రముఖ అంతర్జాతీయ సంస్థలైన PVR INOX PICTURES, LIONSGATE PLAY లతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది.
బాబ్ ఒడెన్‌కిర్క్ నటించిన 'నార్మల్', సెత్ రోజెన్ 'ది ఇన్‌వైట్', ఏంజెలీనా జోలీ 'యాంగ్జియస్ పీపుల్' వంటి అంతర్జాతీయ సినిమాలను తెలుగు సహా ఏడు ప్రాంతీయ భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు.
190కిపైగా దేశాల్లో కంటెంట్
"వినోదాన్ని ప్రతి ఒక్కరికీ సులభంగా, వేగంగా చేరువ చేయడమే మా ప్రాథమిక లక్ష్యం. ఏఐ, పర్సనలైజేషన్ సాంకేతికతతో మొబైల్, స్మార్ట్ టీవీ స్ట్రీమింగ్ విధానాన్ని పూర్తిగా మార్చేశాం. ప్రాంతీయ కంటెంట్‌తో పాటు అంతర్జాతీయ హాలీవుడ్ చిత్రాలు, గ్లోబల్ స్పోర్ట్స్ ఈవెంట్లను వీక్షకులకు అందిస్తున్నాం" అని జీ5 ఇండియా హెడ్ తేజ్‌కరణ్ సింగ్ బజాజ్ తెలిపారు.
స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫారమ్‌లో సాంకేతికత వెనుక ఉండి నడుస్తుంటే, వినోదం ముందడుగులో ఉండాలన్నదే తమ వ్యూహమని జీ ఎంటర్‌టైన్‌మెంట్ సీటీఓ ప్రమోద్ ప్రకాష్ స్పష్టం చేశారు. 190కి పైగా దేశాల్లో సౌత్ ఏషియన్ కంటెంట్‌ను అందిస్తున్న జీ5, ఈ కొత్త అప్‌డేట్‌తో ఓటీటీ రంగంలో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది.