బరువు తగ్గాలన్నా, కండరాలు దృఢంగా మారాలన్నా నేటి ఆధునిక డైట్‌లో ఓట్స్, క్వినోవా అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ ఫుడ్స్. అయితే, హెల్త్ కాన్షియస్ ఉన్నవారిలో తరచూ మెదిలే ప్రశ్న.. ఈ రెండింటిలో ప్రోటీన్ క్వాలిటీ దేనిలో ఎక్కువ ఉంటుంది? ఈ నేపథ్యంలో మీ ఫిట్‌నెస్ లక్ష్యాలకు ఏది సరైనదో ఈ పూర్తి పోలిక ద్వారా తెలుసుకోండి.
ఓట్స్ వర్సెస్ క్వినోవా- అసలేంటివి?

ఓట్స్ : ఇది ఒక హోల్ గ్రెయిన్. సాధారణంగా దీనిని బ్రేక్‌ఫాస్ట్‌గా ఎక్కువగా తీసుకుంటారు. ఇది ఉడికినప్పుడు సాఫ్ట్‌గా ఉండి, ఎక్కువ సమయం కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. జీర్ణక్రియకు, గుండె ఆరోగ్యానికి మేలు చేసే పీచు పదార్థం దీనిలో పుష్కలంగా ఉంటుంది.
క్వినోవా : సాంకేతికంగా ఇది ఒక గింజ అయినప్పటికీ, దీనిని ధాన్యం లాగే వండుకుని తింటారు. దీని రుచి కాస్త భిన్నంగా, ఉడికించినప్పుడు చాలా తేలికగా ఉంటుంది. ఇది పూర్తిగా గ్లూటెన్-ఫ్రీ ఆహారం.
ఓట్స్ వర్సెస్ క్వినోవా- ప్రోటీన్ దేనిలో ఎక్కువగా ఉంటుంది?
మీరు కేవలం ప్రోటీన్ పరిమాణం, నాణ్యతను బట్టి చూస్తే.. ఓట్స్ కంటే క్వినోవానే ఉత్తమమైన ఎంపిక!
కంప్లీట్ ప్రోటీన్ : క్వినోవాలో ప్రోటీన్ శాతం కొంచెం ఎక్కువగా ఉండటమే కాకుండా, మన శరీరానికి అవసరమైన 9 రకాల ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అన్నీ దీనిలో లభిస్తాయి. శాకాహారులకు క్వినోవా ఒక అద్భుతమైన ప్రోటీన్ వనరు. ఇది కండరాల రిపేర్, శరీర ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది.
ఓట్స్‌లో కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది, కానీ అది కంప్లీట్ ప్రోటీన్ కాదు. అయితే, ఓట్స్‌ను పాలు, డ్రై ఫ్రూట్స్ లేదా గింజలతో కలిపి తీసుకున్నప్పుడు దాని ప్రోటీన్ విలువ మరింత పెరుగుతుంది.
ఓట్స్ వర్సెస్ ప్రోటీన్- ఎందులో ఏమున్నాయి?
ఓట్స్ (100గ్రాముల్లో)-
- కేలరీలు- 68
- ప్రోటీన్- 2.5 నుంచి 3 గ్రాములు
- కార్బోహైడ్రెట్స్- 12 గ్రాములు
- ఫైబర్- 1.7 గ్రాములు
- ఫ్యాట్- 1.4 గ్రాములు
- ఐరన్, మెగ్నీషియం- మోస్తరుగా
ఓట్స్ (100గ్రాముల్లో)-
- కేలరీలు- 68
- ప్రోటీన్- 2.5 నుంచి 3 గ్రాములు
- కార్బోహైడ్రెట్స్- 12 గ్రాములు
- ఫైబర్- 1.7 గ్రాములు
- ఫ్యాట్- 1.4 గ్రాములు
- ఐరన్, మెగ్నీషియం- మోస్తరుగా
క్వినోవా (100గ్రాముల్లో)-
- కేలరీలు- 120
- ప్రోటీన్- 4 నుంచి 4.5 గ్రాములు
- కార్బోహైడ్రెట్స్- 21 గ్రాములు
- ఫైబర్- 2.8 గ్రాములు
- ఫ్యాట్- 1.9 గ్రాములు
- ఐరన్, మెగ్నీషియం- అధికంగా
ఓట్స్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
గుండె ఆరోగ్యానికి రక్షణ: ఓట్స్‌లో ‘బీటా గ్లూకాన్’ అనే ప్రత్యేకమైన ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
నిరంతర శక్తి : ఓట్స్ తిన్న తర్వాత శరీరంలో ఎనర్జీ చాలా నెమ్మదిగా విడుదలవుతుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగవు. రోజంతా యాక్టివ్‌గా ఉండటానికి ఇది బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.
బరువు నియంత్రణ: ఇది ఎక్కువ సమయం ఆకలి వేయకుండా చూస్తుంది, తద్వారా అనవసరపు స్నాక్స్ తినకుండా బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
క్వినోవా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
కండరాల పుష్టి: కంప్లీట్ ప్రోటీన్ ప్రొఫైల్ ఉండటం వల్ల జిమ్‌కు వెళ్లేవారికి, కండరాలు పెంచాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ డైట్.
ఖనిజాల నిధి: క్వినోవాలో శరీరానికి అత్యంత అవసరమైన ఐరన్ (ఇనుము), మెగ్నీషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
సులభంగా జీర్ణమవుతుంది: ఇది చాలా తేలికైన ఆహారం కావడంతో జీర్ణవ్యవస్థపై భారం పడదు. గ్లూటెన్ పడని వారికి ఇది దివ్యౌషధం.
ఓట్స్ వర్సెస్ ప్రోటీన్- మీ డైట్‌లో ఎలా చేర్చుకోవాలి?
ఓట్స్ తినే మార్గాలు:
- ఉదయాన్నే పండ్లు, నట్స్‌తో కలిపి ఓట్స్ గంజి లాగా తీసుకోవచ్చు.
- హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఓట్స్ ఉప్మా, అట్లు లేదా చిల్లా చేసుకోవచ్చు.
- స్మూతీలలో ఫైబర్ కోసం ఒక స్పూన్ ఓట్స్ పౌడర్ కలపవచ్చు.
- రాత్రిపూటే పాలలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే సులభంగా తినేయవచ్చు.
క్వినోవా తినే మార్గాలు:
- మధ్యాహ్నం అన్నానికి బదులుగా క్వినోవాను ప్రత్యామ్నాయంగా వాడవచ్చు.
- రకరకాల కూరగాయలు, మసాలాలు జోడించి 'క్వినోవా పులావ్' లేదా కిచిడీ చేసుకోవచ్చు.
- ఉడికించిన క్వినోవాను వెజిటబుల్ సలాడ్స్ లేదా గ్రెయిన్ బౌల్స్‌లో బేస్‌గా వాడవచ్చు.
- సూప్‌లు, హెల్తీ వ్రాప్స్లలో స్టఫింగ్‌గా ఉపయోగించవచ్చు.
ఓట్స్ వర్సెస్ ప్రోటీన్- ఏది తినాలి?
ఈ రెండింటిలో ఏదో ఒకదాన్నే ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్స్, మధ్యాహ్నం లేదా రాత్రి భోజనంలో అన్నానికి బదులుగా క్వినోవాను చేర్చుకోవడం ద్వారా మీ శరీరానికి అవసరమైన ఫైబర్, ప్రోటీన్ రెండింటినీ సమతుల్యంగా అందించవచ్చు.